India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీతంపేటలో నకిలీ మద్యం తయారు చేస్తున్న కట్టమూరి రామకృష్ణను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. అతని వద్ద నుంచి 70 నకిలీ మద్యం సీసాలు, 1.5lts హోమియోపతి స్పిరిట్, 225 వివిధ బ్రాండ్ల ఖాళీ మద్యం సీసాలు, 76 లిక్కర్ ప్యాకేజ్ కవర్ల లేబుల్స్ మూతలు స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ రవి కిరణ్, ఎస్ఐ ముసలి నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖ సీపీ నగరంలో బిక్షటాన చేస్తున్న 250 మందిని తీసుకువచ్చి షెల్టర్ కల్పించారు. చోడుపల్లి పైడమ్మ (77) శ్రీహరిపురంలో ఎండు చేపలు అమ్ముతూ ఉండేది. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుమారుడు సాంబమూర్తి వెతకడం ప్రారంభించాడు. అయితే పోలీసులు చేసిన స్పెషల్ డ్రైవ్‌లో ఆమె పట్టుబడింది. పోలీసుల సంరక్షణలో ఉన్న ఆమెను శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం 24 గంటల తర్వాత తీరానికి శుక్రవారం కొట్టుకువచ్చింది. స్థానికుల సమాచారం మేరకు మత్స్యకారులు, పోలీసుల సహకారంతో మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖలకు చెందిన వివిధ శకటాలను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖకు ప్రథమ స్థానం, జీవీఎంసీ శకటానికి ద్వితీయ స్థానం, విద్యాశాఖ శకటానికి తృతీయ స్థానం లభించింది. మరికొన్ని ప్రభుత్వ శకటాలు కూడా ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విశాఖ జిల్లా DMHO పేడాడ జగదీశ్వర్రావు ఉత్తమ అవార్డును రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ అందించిన అవార్డుల్లో DMHO పేడాడ జగదీశ్వర్రావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది DMHOకు అభినందనలు తెలిపారు.
విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడులు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయనతో పాటు వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం సందేశాన్ని అందించారు. వేడుకల్లో భాగంగా సిబ్బందికి స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.
విశాఖ ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఛైర్మన్ పృథ్వితేజ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థ పరిధిలో 73 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని తెలిపారు. 19,385 మంది వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు అమర్చామన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 97 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
విశాఖ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంత్రి అనగాని సత్య ప్రసాద్ జాతీయ జెండా ఎగురువేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, కమిషనర్ శంఖబ్రత బాగ్చి, వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథ్ పాల్గొన్నారు. పోలీస్, రెవెన్యూ, జీవీఎంసీ విభాగాల్లో ప్రతిభ చూపించిన అధికారులు, ఉద్యోగులకు మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో జ్యోతి తెన్నేటి విశ్వనాథం కీలక పాత్ర పోషించారు. మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి సత్యాగ్రహంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాసేవకు అంకితమయ్యారు. విశాఖ ఎంపీగాను గెలుపొందారు. మద్రాస్ ప్రెసెడెన్సీ నుంచి విడిపోయాక ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటులో ఆయన కృషి నగర వాసులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
విశాఖలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. జ్ఞానాపురంలో నివాసం ఉంటున్న సత్యరాజ్ బైక్ పై మిత్రుడితో కలిసి ఫంక్షన్‌కు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వేములవలస వద్ద అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సాయికుమార్ రోడ్డు దాటుతుండగా మినీ బస్సు ఢీకొని మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.