Visakhapatnam

News August 31, 2024

విశాఖ: పింఛన్లను పంపిణీ చేసిన కలెక్టర్

image

విశాఖ నగరంలో శనివారం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం తాటిచెట్ల పాలెంలో ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు కలెక్టర్ హరీంధర ప్రసాద్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభారాణి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

News August 31, 2024

అనకాపల్లి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు

image

అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లాలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సెలవు ప్రకటించారు. కచ్చితంగా విద్యాసంస్థలు నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. ఎంఈఓ లు విద్యాసంస్థల మీద పర్యవేక్షణ చేయాలని సూచించారు.

News August 31, 2024

నేడు విశాఖ జిల్లాలోని పాఠశాలలకు సెలవు

image

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖ కలెక్టర్ హరీంధిర ప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. SHARE IT.

News August 31, 2024

బలపడిన వాయుగుండం.. భారీ వర్షాలు పడే అవకాశం

image

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మరో 36 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

News August 30, 2024

గాజువాకలో చిట్టీల పేరిట మోసం

image

గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద చిట్టీల పేరిట మోసపోయామంటూ సుమారు 200 మంది బాధితులు ఆందోళన చెపట్టారు. వారి వివరాల ప్రకారం.. వాంబే కాలనీకి చెందిన మరడాన.పరుశురాం చిట్టీలు, రియల్ ఎస్టేట్ పేరిట సుమారు రూ.30 కోట్లతో పరారయ్యడని తెలిపారు. పరుశురాం గాజువాక పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ చేస్తుంటానని నమ్మించి తమను మోసం చేశాడని వాపోయారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

News August 30, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాకు ప్రత్యేక అధికారుల నియామకం

image

విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు సీనియర్ IASలను స్పెషల్ ఆఫీసర్స్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖకు హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సౌరభ్ గౌర్‌ను నియమించింది. అల్లూరి జిల్లాకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, అనకాపల్లికి ఇండస్ట్రీస్ డైరెక్టర్ సీహెచ్.శ్రీధర్‌ను నియమించింది.

News August 30, 2024

విశాఖలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్

image

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రిని కలవడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. సమస్యలపై ప్రజలు అందజేసిన వినతి పత్రాలను స్వీకరించారు. అందర్నీ పలకరించారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

News August 30, 2024

విశాఖలో BSNL 4జీ సేవలు ప్రారంభం

image

విశాఖ నగరంలో తొలిసారిగా BSNL 4జీ సేవలను ప్రారంభించింది. స్టీల్ ప్లాంట్ హౌస్ బాంకెట్ హాల్‌లో ప్లాంట్ సీఎండీ అతుల్ బట్, డైరెక్టర్ సురేశ్ చంద్ర పాండే, BSNL అధికారి సత్య ప్రసాద్, ఐటీఎస్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ విలియమ్స్ తదితరులు లాంఛనంగా 4జీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అధికారి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

News August 30, 2024

ఏయూలో ఎంబ్రియాలజీ కోర్సు ప్రారంభం

image

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలలో నూతనంగా మాస్టర్స్ ఇన్ క్లినికల్ ఎంబ్రియాలజీ కోర్సును వీసీ ఆచార్య జి.శశిభూషణరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఎంబ్రియాలజీ నిపుణుల అవసరం పెరుగుతోందని అన్నారు. సమాజ అవసరాలు, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఎంతో ప్రాధాన్యత కలిగిన ఇటువంటి కోర్సును ప్రారంభించడం పట్ల వీసీ కళాశాల ఆచార్యులను అభినందించారు.

News August 30, 2024

విశాఖ: నేడు పాఠశాలలను సందర్శించనున్న మంత్రి లోకేశ్

image

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేవ్ తన పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖ జిల్లాలోని నాలుగు పాఠశాలలను సందర్శించనున్నారు. పాఠశాలల భవనాల స్థితిగతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యాబోధన తదితర అంశాలను ఆయన పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మంత్రి పర్యటన ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నగర పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలను కలుస్తారు.