Visakhapatnam

News August 13, 2025

VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌పై కేసు కొట్టివేత

image

VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌పై ఛలో రుషికొండ కార్యక్రమంలో పోలీసులు పెట్టిన కేసులు విశాఖ జిల్లా కోర్టు జడ్జి ప్రదీప్ కుమార్ కొట్టివేశారు. వైసీపీ ప్రభుత్వం హయంలో ఛలో రుషికొండ కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. అప్పట్లో TNSF రాష్ట్ర అధ్యక్షుడిగా రుషికొండ వెళ్లి నిరసన తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు శోభన్ బాబు, పార్థసారథి వాదనలు వినిపించారు.

News August 13, 2025

భారీ వర్షాలు.. అప్రమత్తం చేసిన విశాఖ కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బుధవారం అప్రమత్తం చేశారు. సచివాలయ సిబ్బంది సెక్రటరీలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలకు సరిపడా మందుల నిలువను ఉంచాలని డిఎంహెచ్ఓ‌కు కలెక్టర్ ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉండాలని, వారికి పునరావస కేంద్రాలను ఏర్పాటు చేయాలని తహశీల్దార్లకు సూచించారు. బస్సులర పర్యవేక్షణ చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

News August 13, 2025

విశాఖ‌ను మాద‌క ద్ర‌వ్య ర‌హిత జిల్లాగా తీర్చుదిద్దుదాం: కలెక్టర్

image

విశాఖ‌ను మాద‌క ద్ర‌వ్య ర‌హిత జిల్లాగా తీర్చుదిద్ద‌దామ‌ని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. న‌షా ముక్త్ భార‌త్ అభియాన్ ప్ర‌తిజ్ఞలో భాగంగా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. యువత పెద్ద సంఖ్యలో మాదక ద్రవ్య నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని కోరారు.

News August 13, 2025

విశాఖ: ఎన్టీఆర్ గృహ నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలోని ఎన్టీఆర్ గృహ నిర్మాణ లేఅవుట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ హరేంధీర ప్రసాద్ బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. మౌలిక వసతులు అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. కాంట్రాక్టుల పనితీరుపై సమీక్షించారు.

News August 13, 2025

విశాఖ: అంతర్జాతీయ క్రీడాకారుడికి ఆహ్వానం

image

స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విజయవాడలోని(గవర్నర్ బంగ్లా)లో జరగనున్న కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీకాకుళానికి చెందిన అంతర్జాతీయ వాలీబాల్ ఛాంపియన్ అట్టాడ చరణ్‌కు ఆహ్వానం అందింది.
ప్రస్తుతం అట్టాడ చరణ్ విశాఖపట్నం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) అకాడమీలో శిక్షణ పొందుతూ గాజువాక వడ్లపూడిలో నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆహ్వానం లెటర్‌‌ను చరణ్‌కు అందజేశారు.

News August 12, 2025

విశాఖ: ‘ఆధార్ సీడింగ్ లోపాలను సరిదిద్దాలని ఆదేశం’

image

ఆధార్ సీడింగ్ లోపాలను సరిదిద్దాలని విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (C.G.R.F)
ఛైర్మన్ సత్యనారాయణ ఆదేశించారు. కన్సూమర్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటరమణ ఫిర్యాదుపై మంగళవారం వర్చువల్‌ విచారణ జరిగింది. విచారణలో ఫిర్యాదుదారు వెంకటరమణ మాట్లాడుతూ.. ఆధార్ సీడింగ్ పొరపాట్లు వల్ల పలువురు పేదలు ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నారని తెలిపారు.

News August 12, 2025

విశాఖ: ‘ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలి’

image

ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న మహిళల ఫ్రీ బస్ పథకాన్ని వృక్ష అతిథులతో ప్రారంభించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆర్టీసీ సిబ్బంది సిద్ధం కావాలని అన్నారు. పథకం అమలులో లోపాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News August 12, 2025

కంచరపాలెంలో కారు ఢీకొని బాలుడి మృతి

image

కంచరపాలెం సుభాష్ నగర్‌లో మంగళవారం రాత్రి విషాదం నెలకొంది. కారు ఢీకొని 15 నెలల చిన్నారి వర్షిత్ మృతి చెందాడు. ఐటీఐ జంక్షన్ నుంచి ఊర్వశి జంక్షన్ వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. చిన్నారి తండ్రి రాంబాబు ప్లంబర్ చేస్తున్నారు. బాలుడుని కారు ఢీకొట్టిన సమయంలో తండ్రి సమీపంలోనే ఉన్నట్లు సమచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 12, 2025

విశాఖలో వైసీపీ కార్పొరేటర్ గెలుపుపై జగన్ హర్షం

image

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు మంగళవారం తాడేపల్లిలో కలిశారు. విశాఖలో చేపడుతున్న కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డికి వివరించారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి కేకే రాజుకు సూచించారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైసీపీ కార్పొరేటర్ గెలుపుపై జగన్మోహన్ రెడ్డి అభినందించారు.

News August 12, 2025

విశాఖ కలెక్టర్‌పై జనసేన కార్యాలయంలో ఫిర్యాదు

image

హిందూ ధర్మ రక్షా సమితి అధ్యక్షురాలు కొత్తలంక భువనేశ్వరిశర్మ విశాఖ కలెక్టర్‌ హరీంధర ప్రసాద్‌‌పై జనసేన ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఫిర్యాదు చేశారు. గాజువాక వేంకటేశ్వర ఆలయంలో అన్యమతస్తుల తీరుపై స్పందించకుండా, విరుద్ధ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వాంబే కాలనీలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోలేదని తెలిపారు. భక్తుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ఆమె తెలిపారు.