Visakhapatnam

News August 12, 2025

విశాఖ కలెక్టర్‌పై జనసేన కార్యాలయంలో ఫిర్యాదు

image

హిందూ ధర్మ రక్షా సమితి అధ్యక్షురాలు కొత్తలంక భువనేశ్వరిశర్మ విశాఖ కలెక్టర్‌ హరీంధర ప్రసాద్‌‌పై జనసేన ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఫిర్యాదు చేశారు. గాజువాక వేంకటేశ్వర ఆలయంలో అన్యమతస్తుల తీరుపై స్పందించకుండా, విరుద్ధ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వాంబే కాలనీలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోలేదని తెలిపారు. భక్తుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ఆమె తెలిపారు.

News August 12, 2025

రాష్ట్రంలో మొదటిసారి విశాఖలోనే: సీపీ

image

విశాఖలో లోన్ యాప్ మోసాలతో 295 మంది వరకు బాధితులను గుర్తించినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సైబర్ క్రైమ్ ఇన్‌స్టంట్ లోన్ యాప్ కేసులో గుర్తించిన క్రిపో కరెన్సీని ఇండియా కరెన్సీలోకి మార్చి వందమంది బాధితులకు రూ.50 లక్షలను మంగళవారం అందించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి సహాయం విశాఖలో చేసినట్లు తెలిపారు. సైబర్ మోసాలకు ప్రజలు గురికా వద్దని సీపీ సూచించారు.

News August 12, 2025

విశాఖ జూపార్క్‌లో ప్రపంచ ఏనుగుల దినోత్సవం

image

విశాఖ జూ పార్క్‌లో క్యూరేటర్ మంగమ్మ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఏనుగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఇందిరాగాంధీ జూ పార్క్‌లో ప్రస్తుతం కృష్ణ, రాజు, సరస్వతి, లక్ష్మీ అనే నాలుగు ఏనుగులు ఆరోగ్యంగా ఉన్నాయని జూపార్క్ సిబ్బంది వివరించారు.

News August 12, 2025

మృతుని వివరాలు తెలిస్తే చెప్పిండి: ఆరిలోవ ఎస్ఐ

image

ఆదివారం అర్ధరాత్రి ఓల్డ్ డైరీ ఫార్మ్ సమీపంలో పశువులు అక్రమంగా తరలిస్తున్న వ్యాను ఢీకొని సుమారు 40 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇప్పటివరకు మృతుని వివరాలు తెలియలేదు. వ్యక్తి వివరాలు గుర్తుపట్టిన వారు వెంటనే ఆరిలోవ పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ వై.కృష్ణ సూచించారు. ప్రస్తుతం మృతదేహం మార్చురీలో భద్రపరిచారు.

News August 12, 2025

విశాఖ జిల్లాలో 5,15,264 మందికి టాబ్లెట్స్

image

విశాఖలో మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, డిఎంహెచ్ఓ జగదీశ్వర రావు పాల్గొని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను అందించారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల బాలబాలికలకు అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నులిపురుగుల నివారణ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 5,15,264 మందికి టాబ్లెట్స్ ఇవ్వనున్నారు.

News August 12, 2025

బీచ్ రోడ్డులో నేడు తిరంగా యాత్ర: కలెక్టర్

image

ఆర్కే బీచ్ రోడ్డులో ఈరోజు ఉదయం 6.30 గంట‌ల నుంచి హ‌ర్ ఘ‌ర్ తిరంగా యాత్ర నిర్వ‌హించ‌నున్న‌ట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. దీనిలో భాగంగా జాతీయ పతాకం ప్రాముఖ్యతను, స్వాతంత్ర్య పోరాటంలో, దేశ ప్రజలను సమైక్యంగా ఒక్క తాటిపై నిలిపి ఉంచడంలో జాతీయ జెండా భూమికను తెలిపే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు వెల్లడించారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు భారీ ఎత్తున తిరంగా యాత్ర, బైక్ ర్యాలీ సాగుతుంద‌న్నారు.

News August 12, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 105 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 105 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

News August 11, 2025

స్టీల్ ప్లాంట్‌లో విషాదం.. ఒకే రోజు ఇద్దరు మృతి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో విషాదం నెలకొంది. వేరువేరు విభాగాల్లో పనిచేస్తోన్న ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం మృతి చెందారు. సీపీపీ విభాగంలో రోజువారి కూలీగా పనిచేస్తున్న తాడి అప్పారావు(54) క్లీనింగ్ చేస్తూ కింద పడి మృతి చెందాడు. ఇతను అగనంపూడి ప్రాంతానికి చెందివాడు. ఇస్లాంపేటలో నివాసం ఉంటున్న సురేశ్ సింగ్(45) ఐరన్ స్ర్కాప్ పైకి ఎత్తుతుండగా తీగ తెగి పడి మరణించాడు. మృతుడిది బిహార్‌గా గుర్తించారు.

News August 11, 2025

విశాఖ డెయిరీ కాంట్రాక్ట్ కార్మికుల నిరాహార దీక్ష

image

విశాఖ డెయిరీలో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కార్మికులు 24 గంటల నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. దీక్షా శిబిరంలో మహిళా కార్మికులు రాత్రి విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోతున్నారు. తమ కుటుంబాల భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుందని, డిమాండ్లు నెరవేరేవరకు వెనక్కి తగ్గబోమని కార్మికులు స్పష్టం చేశారు.

News August 11, 2025

విశాఖ కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు

image

విశాఖ కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో నాలుగు నకిలీ అకౌంట్లు క్రియేట్ చేవారు. కలెక్టర్ పేరు, ఫొటోతో ఈ అకౌంట్లు నడుపుతున్నారు. ఇవి పూర్తిగా నకిలీ అని విశాఖ కలెక్టరేట్ నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ అకౌంట్ నుంచి వచ్చే ఎటువంటి సందేశాలకు ప్రతిస్పందించవద్దని సూచించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. >Share it