Visakhapatnam

News August 28, 2024

విశాఖ: భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు

image

గుజరాత్‌లోని వడోదరలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. బుధవారం బయలుదేరే గాంధీగ్రామ్-పూరీ ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్, 31న బయలుదేరే పూరీ-గాంధీగ్రామ్ వీక్లీ స్పెషల్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. నేడు బయలుదేరే తాంబరం-సంత్రాగచ్చి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్, నేడు బయలుదేరే సంత్రాగచ్చి-సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ ప్రెస్‌ను రద్దు చేసినట్లు తెలిపారు.

News August 28, 2024

విశాఖలో 2.381 సెం.మీ పెరిగిన సముద్రమట్టం: CSTEP

image

తీరప్రాంతాలకు ముంపు సమస్య ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని 15 నగరాల్లో అధ్యయనం చేయగా అందులో విశాఖ కూడా ఉంది. 1987 నుంచి 2021 వరకు విశాఖలో 2.381 సెం.మీ సముద్ర మట్టం పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. 2040 నాటికి విశాఖలో 5% భూమి మునిగిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. జనాభా పెరుగుదల, వాతావరణంలో మార్పులు, పట్టణీకరణ తదితర అంశాల ఇందుకు ప్రధాన కారణంగా అధ్యయనంలో తేలింది.

News August 28, 2024

నాలుగు గంటల ఆలస్యంగా చెన్నై-హౌరా సూపర్ ఫాస్ట్

image

చెన్నై-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్(12840) రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. చెన్నైలో ఈరోజు రాత్రి 7 గంటలకు బయలుదేరాల్సిన ట్రైన్ 4 గంటలు ఆలస్యంగా రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని వెల్లడించారు. ఈ ట్రైన్ విశాఖకు రేపు మధ్యాహ్నం 12:10 గంటలకు చేరుతుంది. ప్రయాణీకులు గమనించాలని రైల్వే అధికారులు కోరారు.

News August 28, 2024

గంజాయి రవాణా నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలి: డీఐజీ

image

గంజాయి రవాణా నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీలను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో ఐదు జిల్లాల ఎస్పీలతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గంజాయి రవాణా- నియంత్రణపై సమీక్షించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారిని విచారించి ఇందులో ఎవరెవరు ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములుగా ఉన్నారో గుర్తించాలన్నారు.

News August 28, 2024

విశాఖ: కిలో అల్లం రూ.40

image

గిరిజన ప్రాంతంలో అల్లం ధర ఒక్కసారిగా పడిపోయింది. గతవారం మార్కెట్లో కిలో రూ.60-రూ.70 వరకు ధర పలికింది. ఈ వారం లోతుగెడ్డ వారపు సంతలో వర్తకులు కిలో రూ.40కి కొనుగోలు చేశారు. ప్రతి ఏడాది రైతులు ఆగస్టులో పాత అల్లం పొలాల నుంచి తీసుకుని మార్కెట్‌లో విక్రయిస్తారు. ఒక్కసారిగా కిలో రూ.40కి ధర పడిపోవడంతో గిట్టుబాటు కావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News August 28, 2024

విశాఖలో రాజ్‌నాథ్ సింగ్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈనెల 29న విశాఖపట్నం రానున్నారు. ఉదయం 10 గంటలకు దిల్లీలోని పాలెం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌కు చెందిన నేవల్ బేస్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 01.45 గంటల వరకు అక్కడ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు.

News August 28, 2024

విశాఖలో 101 ఏళ్ల అథ్లెట్ 

image

విశాఖకు చెందిన 101 ఏళ్ల నేవీ కమాండర్ వి.శ్రీరాములు వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటి మూడు కేటగిరిలో మూడు స్వర్ణ పతకాలు సాధించిన ఆయన మంగళవారం విశాఖ చేరుకున్నారు. స్వాతంత్ర్యానికి ముందే రాయల్ ఇండియన్ నేవీలో చేరిన శ్రీరాములు రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం భారత నావికాదళంలో అధికారిగా చేరారు. కళాశాల రోజుల నుంచి క్రీడాకారుడైన శ్రీరాములు అథ్లెటిక్స్‌లో పాల్గొనేవారు.

News August 28, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్, ఐఓసీఎల్ మధ్య ఒప్పందం

image

విశాఖ స్టీల్ ప్లాంట్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య మంగళవారం హైడ్రాలిక్ లూబ్రికేట్ ఆయిల్ గ్రీజు సరఫరాపై ఎంఓయూ జరిగింది. ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం సమావేశ మందిరంలో 2024-29 వరకు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన అవగాహన ఒప్పందంపై ఇరు సంస్థల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ప్లాంట్ డైరెక్టర్ ఏకే బాగ్చీ, లూబ్స్ ఈడీ ఆర్.ఉదయ్ కుమార్, ప్లాంట్ సీజీఎం శ్రీధర్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

News August 28, 2024

విశాఖ: కొడుకు మృతి తట్టుకోలేక.. మానసిక వేదనతో 

image

పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రంపాలెంలో బోర అన్నపూర్ణ (37) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. నాలుగేళ్ల కిందట ఆమె కుమారుడు నిఖిల్ అనారోగ్యంతో మృతి చెందగా అప్పటినుంచి మానసిక వేదనతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

News August 28, 2024

నేడు విశాఖ రానున్న నారా లోకేష్

image

మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ రానున్నారు. విజయవాడ నుంచి విమానంలో రాత్రి 9.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రామ్ నగర్‌లోని టీడీపీ కార్యాలయానికి చేరుకొని అక్కడ బస చేస్తారు. 29న ఉదయం 9.45 గంటలకు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. సాయంత్రం 6.30 గంటలకు నోవాటెల్ హోటల్‌కు వెళ్తారు. రాత్రి 9 గంటలకు రామనగర్ ఎన్టీఆర్ భవనానికి చేరుకొని అక్కడ బస చేస్తారు.