Visakhapatnam

News July 20, 2024

కోయంబత్తూర్-దానాపూర్ మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కోయంబత్తూరు-దానాపూర్ మధ్య ఒక వైపు ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. ఈనెల 21వ తేదీ రాత్రి 11.30 గంటలకు కోయంబత్తూరులో బయలు దేరి మర్నాడు రాత్రి 8.10 గంటలకు దువ్వాడ చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి 8.15 గంటలకు బయలుదేరి దానాపూర్ వెళ్తుందన్నారు.

News July 20, 2024

ఆగస్టు 12,13 తేదీల్లో MCA 4వ సెమిస్టర్ పరీక్షలు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో MCA 4వ సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 12,13 వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు. పరీక్షల విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఆగస్టు 12న డేటాసైన్స్, ఆగస్టు 13న సెలెక్టివ్-2 గా ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ కంప్యూటింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.

News July 20, 2024

గిరిప్రదక్షిణకు జీవీఎంసీ రూ.1.85 కోట్లు వ్యయం

image

సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల కోసం మహా విశాఖ నగరపాలక సంస్థ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంజినీరింగ్ విభాగం నుంచి రూ.1.69 కోట్లు, ప్రజారోగ్య విభాగం నుంచి రూ.16లక్షలు మొత్తం 1.85కోట్లు వెచ్చిస్తున్నారు. ఇన్ఛార్జి కమిషనర్, కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆదేశాల మేరకు ప్రధాన ఇంజినీరు రవి కృష్ణంరాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేశ్ కుమార్ ఏర్పాట్లు చేశారు.

News July 20, 2024

జంబ్లింగ్ విధానంలో బీఈడీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ 4వ సెమిస్టర్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షలు) జె.రత్నం తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏయు ప్రియదర్శిని సర్వీస్ ఆర్గనైజేషన్‌లకు ఏయూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. వారం రోజుల ముందుగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని తమకు కేటాయించిన కేంద్రంలో పరీక్షకు హాజరవ్వాలి.

News July 20, 2024

సింహాచలం: రేపు దిల్లీ విజయోత్సవం

image

ఆషాడ పౌర్ణమి సందర్భంగా ఈనెల 21న అప్పన్న ఆలయంలో దిల్లీ విజయోత్సవం నిర్వహించనున్నారు. భగవత్ రామానుజులు దిల్లీ బాదుషాను పాండిత్యంలో మెప్పించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవాన్ని జరపడం ఆలయ సంప్రదాయంగా వస్తుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు భక్తుల దర్శనాలను నిలిపివేసి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

News July 20, 2024

మార్పు మొదలైంది: మంత్రి లోకేశ్

image

ఏయూలో గతంలో ఏర్పాటు చేసిన ఇనుప బారికేట్లను, గేట్లను తొలగించడంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఏయూ పరిపాలన భవనంలోకి విద్యార్థులు రాకుండా గతంలో ఏర్పాటు చేసిన ఇనుప అడ్డంకులను తొలగించినందుకు ఇన్‌ఛార్జ్ వీసీ ఆచార్య శశిభూషణ్ రావును ‘ఎక్స్’ వేదికగా అభినందించారు. బారికేడ్లు, దిగ్బంధం రోజులు పోయాయని మార్పు ప్రారంభమైందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

News July 20, 2024

నేడు విశాఖ జిల్లాలో పాఠశాలలకు సెలవు

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, సింహాచలం గిరి ప్రదక్షిణ కార్యక్రమం నేపథ్యంలో శనివారం జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాల యాజమాన్యాలకు కలెక్టర్ ఉత్తర్వులు పంపారు. పాఠశాలకు కచ్చితంగా సెలవు ఇవ్వాలని సూచించారు. వర్షాల దృష్ట్యా అల్లూరి జిల్లాలోని స్కూల్లకు కూడా సెలవు ప్రకటించారు.

News July 20, 2024

భీమిలి: ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై సీఎంఓ ఆదేశం

image

ఎర్ర మట్టి దిబ్బల తవ్వకాలను వెంటనే ఆపివేయాలని సీఎంఓ విశాఖ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆ ప్రాంతాన్ని సందర్శించి ఎంత మేర తవ్వకాలు జరిగాయనే విషయంపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. భీమిలి హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా భూములను చదును చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది.

News July 20, 2024

సింహాచలం గిరి ప్రదక్షణకు 2,600 మందితో బందోబస్తు

image

సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు 2600 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. నగరంలో శాంతి భద్రతలు, క్రైమ్, మరియు ట్రాఫిక్ సిబ్బంది అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. పుణ్య స్థానాలు ఆచరించే భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు.

News July 20, 2024

సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి

image

గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల పరిధిలో 29 చోట్ల 290 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11 మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. 390 ఎల్ఈడి లైట్లు అమర్చినట్లు తెలిపారు. 9 జనరేటర్స్ సిద్ధం చేశామన్నారు. కొండ దిగువన పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.