India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శనివారం తెలిపారు. విశాఖ-రాయపూర్ పాసింజర్ (58527/28), విశాఖ – కోరాపూట్ పాసింజర్ (58537/38), విశాఖ – భవానిపట్నం పాసింజర్ (58503/04)ను ఆగస్టు 19 నుంచి 28 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల్లో KGHకి ఎటువంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ వాణి స్పష్టం చేశారు. ఈ అక్రమాల్లో KGH, ఆంధ్రా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్ల ప్రమేయం ఉందని మీడియా కథనాల ద్వారా తనకు తెలిసిందన్నారు. దీనిపై ఇంత వరకూ అధికారిక సమాచారం అందలేదని చెప్పారు. ప్రస్థుతం ఈ కేసుపై తెలంగాణ పోలీసులు విచారణ చేస్తున్నారని, డాక్టర్ల ప్రమేయం ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శనివారం తెలిపారు. విశాఖ-రాయపూర్ పాసింజర్ (58527/28), విశాఖ – కోరాపూట్ పాసింజర్ (58537/38), విశాఖ – భవానిపట్నం పాసింజర్ (58503/04)ను ఆగస్టు 19 నుంచి 28 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.

మద్దిలపాలెంలో ఆగస్టు 11న ఐద్వా విశాఖ జిల్లా 17వ మహాసభలు జరగనున్నాయని జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ, కార్యదర్శి వై.సత్యవతి తెలిపారు. ఈ మేరకు శనివారం విశాఖ కార్యాలయంలో వారు మట్లాడారు. 1936లో స్థాపితమై 1981లో దేశవ్యాప్త సంఘంగా ఏర్పడిన ఐద్వా స్త్రీ హక్కులు, సమానత్వం, హింస నిరోధక చట్టాల సాధనలో పోరాటాలు చేపట్టిందన్నారు. ఈ సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా 11004కు పైగా ప్రదేశాల్లో వృక్షా బంధన్ కార్యక్రమాలు జరిగాయని గ్రీన్ క్లైమేట్ టీం కార్యదర్శి జె.వి.రత్నం తెలిపారు. శనివారం ఎంవీపీ కాలనీలో విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కట్టారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విశాఖలో 60 వేల విత్తన రాఖీలు విద్యార్థులు తయారు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పిలుపుతో విత్తన రాఖీల ఉద్యమం దేశవ్యాప్తంగా ఉత్సాహాన్ని రేకెత్తించిందన్నారు.

విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద బొక్క వీధిలోని వెల్డింగ్ దుకాణంలో సిలిండర్ పేలిన ఘటనల్లో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలను హోం మంత్రి అనిత పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. వెల్డింగ్ దుకాణాల్లో పేలుళ్లు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై దుకాణాల యజమానులకు కార్మికులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.

భీమిలి మండలం కొత్తవలస, ఆనందపురం మండలం శొంఠ్యాం థీమ్ బేస్డ్ టౌన్ షిప్‌లుగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశామని VMRDA కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ తెలిపారు. జిల్లాలో మరో రెండు ప్రదేశాలను గుర్తించనున్నామని చెప్పారు. ప్రత్యేక రంగాల ఆధారంగా అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచడం, ఆర్థిక వికాసం వీటి లక్ష్యంగా పేర్కొన్నారు.

విశాఖలో 24/7 మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు నీటి సరఫరాను అందించాలని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ శుక్రవారం ఆదేశించారు. డిసెంబర్ 31 నాటికి పూర్తిస్థాయిలో పనులను పూర్తి చేయాలన్నారు. మాధవధార, మురళీనగర్‌లో 24/7 నీటి సరఫరా ప్రారంభమైందని, వారు వినియోగిస్తున్న నీటికి బిల్లులు ఇవ్వాలని సూచించారు. వినియోగదారులు ఎంత నీటిని వినియోగిస్తున్నారనే విషయాన్ని వివరించాలన్నారు.

విశాఖ VJF ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం సర్పంచుల సంఘం సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రూ.1,000 కోట్లు సర్పంచుల ఖాతాలో జమ చేసిందన్నారు. మరో రూ.1,120 కోట్లు సెప్టెంబర్ లోపల విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. సర్పంచులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 8 నుంచి 13 వరకు తిరంగా యాత్ర, తిరంగా సెల్ఫీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం వివరించారు. ఆగస్టు 12న ఉదయం 7 గంటలకు బీచ్ రోడ్డులో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు భారీ ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.