Visakhapatnam

News July 17, 2024

విశాఖలో MLA తాలూకా అంటే బండి సీజ్

image

విశాఖలో ఇకపై పలానా MLA, మంత్రి తాలూకా అంటూ వాహనాలపై ఉంటే వాటిని సీజ్ చేస్తామని రావాణా శాఖ DTO జీసీ. రాజారత్నం హెచ్చరించారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రతి వెహికిల్‌కి హై సెక్యూరిటీ నంబర్ మాత్రమే వేసుకోవాలని చెప్పారు. ఇటీవల వాహనాలకు పలానా MAL, మంత్రి తాలుకా అని నంబర్ ప్లేట్‌లపై రాసుకొని తిరుగుతున్నారని అటువంటి వాహనాలను సీజ్ చేసి, తగు చర్యలు తీసుకుంటామన్నారు.

News July 17, 2024

విశాఖ: అండర్-19 వన్డే క్రికెట్ టోర్నీ ప్రారంభం

image

విశాఖ నగరంలో వైఎస్‌ఆర్ క్రికెట్ స్టేడియంలో ఏసీఏ అండర్-19 అంతర్‌ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. మొదటి రోజు విశాఖ – రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విశాఖ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. అనంతరం నార్త్ జోన్ జట్టు 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. విశాఖ జట్టు 71 పరుగుల తేడాతో విజయం సాధించింది.

News July 17, 2024

తిరునల్వేలి-షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు

image

తిరునల్వేలి -షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డీసీఎం కే.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18, 25 తేదీల్లో తిరునల్వేలిలో రాత్రి 1.50 గంటలకు బయలుదేరి దువ్వాడ మీదుగా షాలిమార్ వెళుతుందన్నారు. షాలిమార్-తిరునల్వేలి ఈనెల 20, 27 తేదీల్లో షాలిమార్‌లో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు దువ్వాడ మీదగా తిరునల్వేలి వెళ్తుందన్నారు.

News July 17, 2024

ఆ నోటిఫికేషన్‌ని రద్దు చేయాలి: ఈఏఎస్.శర్మ

image

బౌద్ధారామాల స్థలాన్ని కుదిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని విశ్రాంత IAS ఈఏఎస్ శర్మ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి దుర్గేశ్‌కు మంగళవారం లేఖ రాశారు. బౌద్ధారామమైన తొట్లకొండ 3,143 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. గత ప్రభుత్వం 2021లో బౌద్ధారామాల రక్షిత ప్రాంతాన్ని కేవలం 120 ఎకరాలకు కుదించే జీవోను నోటిఫై చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నారు.

News July 17, 2024

విశాఖ: బొకారో ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

image

ధన్ బాద్-అలెప్పి బొకారో ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం పెద్ద ప్రమాదం తప్పింది. ఏ2 సెకండ్ ఏసీ భోగికి స్ప్రింగ్ విరిగిపోయింది. రైలు విశాఖ స్టేషన్‌కు చేరుకునే సమయంలో జరగడంతో ఆవరణలో ఉన్న రోలింగ్ సిబ్బంది దానిని గుర్తించి సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. ప్రయాణికులను ఖాళీ చేయించి రైలు నుంచి బోగిని తొలగించారు. వేరొక బోగిని దానికి అమర్చారు. గంటన్నర పాటు రైలు స్టేషన్‌లో నిలిచిపోయింది.

News July 16, 2024

ఎర్ర మట్టి దిబ్బల్ని నాశనం చేయకండి: బొలిశెట్టి

image

భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బల్ని నాశనం చేయొద్దని, అవి జాతీయ సంపద అని ప్రముఖ పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్యనారాయణ ‘X’ వేదికగా అధికారుల్ని హెచ్చరించారు. దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ఎర్రమట్టి దిబ్బలు ముఖ్య భాగం అని గుర్తు చేశారు. ఇలాంటివి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయని, ఒకటి భీమిలిలోనిది కాగా రెండోది తమిళనాడులోని పేరి వద్ద ఉందన్నారు. వీటిని పరిరక్షించుకోవాలన్నారు.

News July 16, 2024

విశాఖలో ఇంటర్నేషనల్ స్నేక్ డే

image

పాములకు హాని చేయవద్దని ఏపీ సీసీఎఫ్(వన్యప్రాణులు) శాంతి ప్రియ పాండే కోరారు. విశాఖలో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌లో మంగళవారం ప్రపంచ స్నేక్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా పాములను చంపవద్దని.. అన్ని పాములలో విషం ఉండదని తెలిపారు. పాములు కాటు వేస్తే తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.

News July 16, 2024

స్పీకర్ అయ్యన్నతో చీఫ్ సెక్రటరీ భేటీ

image

అమరావతిలో అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించిన అయ్యన్నపాత్రుడుని తొలిసారిగా చీఫ్ సెక్రటరీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధివిధానాలను చీఫ్ సెక్రటరీ స్పీకర్‌కు వివరించారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన అనుభవాలను ఆయనకు వివరించారు.

News July 16, 2024

సింహాచలం గిరిప్రదక్షిణ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, విశాఖ సీపీ శంకభద్ర బాగ్చి మంగళవారం పరిశీలించారు. సింహాచలంతో పాటు పరిసర ప్రాంతాల్లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గిరి ప్రదక్షిణ విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ విశ్వనాథన్, ఈవో శ్రీనివాసమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు.

News July 16, 2024

విశాఖ: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు టోల్ ఫ్రీ

image

నూతనంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావలసిన వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912 కు ఫోన్ చేసి సర్వీసు పొందవచ్చునని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి సర్కిళ్ల పరిధిలోని వినియోగదారులు కనెక్షన్‌ల కోసం ఈ నంబర్‌కి ఫోన్ చేయవచ్చునని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.