Visakhapatnam

News July 16, 2024

ఏయూ: సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫైనార్ట్స్ 2వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు, ఎంఎస్సీ మెరైన్ బయోటెక్నాలజీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షలు విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాలను ఏయూ వెబ్‌సైట్‌లొ పొందుపరిచామని, విద్యార్థులు తమ రిజిస్టర్ నంబర్‌ను నమోదు చేసి ఫలితాలను పొందవచ్చని తెలిపారు.

News July 16, 2024

ఫార్మసీ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల పరిధిలో ఏప్రిల్ నెలలో నిర్వహించిన బీఫార్మసీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఏయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా ఫలితాలను ఏయూ పోర్టల్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు నేరుగా పరీక్ష ఫలితాలను వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.

News July 16, 2024

విశాఖను అడ్డగోలుగా దోచుకున్నారు: సీఎం చంద్రబాబు

image

YCP నాయకులు విశాఖను అడ్డగోలుగా దోచుకున్నారని CM చంద్రబాబు ఆరోపించారు. ‘రామానాయుడు స్టుడియో భూములలో వాటా కొట్టేయాలని చూశారు. ఓల్డేజ్ హోమ్‌కోసం ఇచ్చిన హయగ్రీవ భూములను మాజీ ఎంపీ ఎంవీవీ దోచుకోవాలని చూశారు. తన సంస్థకు 10.57 ఎకరాలు కేటాయించి, ఆ భూమిలో లబ్ధిదారులకు 0.96 శాతం వాటా ఇచ్చారు. ఆయన కంపెనీకి రూ.65 కోట్ల విలువ చేసే TDR బాండ్లను జారీ చేసి కుంభకోణానికి పాల్పడ్డారు’ అని చెప్పారు.

News July 16, 2024

గిరి ప్రదక్షణపై స్వచ్ఛంద సంస్థలతో సమావేశం

image

ఈనెల 20, 21, 22వ తేదీల్లో జరగనున్న సింహాచలం సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలతో ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే స్టాల్స్‌పై సూచనలు, సలహాలు ఇచ్చారు. ట్రాఫిక్ ఏసీపీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

News July 15, 2024

సేవా దృక్పథంతో సేవలందించాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్

image

వైద్య సిబ్బంది సేవా దృక్పథంతో సేవలందించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. కే‌జీ‌హెచ్‌లో అందుతున్న వైద్య సేవలపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్యవృత్తి ఎంతో గొప్పదని, ఈ వృత్తిలో కొనసాగడం ఎంతో అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రిని పలువురు సత్కరించారు. ఆసుపత్రులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని విశాఖ ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.

News July 15, 2024

గిరి ప్రదక్షణపై స్వచ్ఛంద సంస్థలతో సమావేశం

image

ఈనెల 20, 21, 22వ తేదీల్లో జరగనున్న సింహాచలం సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలతో ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే స్టాల్స్‌పై సూచనలు, సలహాలు ఇచ్చారు. ట్రాఫిక్ ఏసీపీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

News July 15, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో 125 పోస్టల్ ఉద్యోగాలు

image

పదో తరగతి అర్హతతో పోస్టల్‌లో BPM/ABPM ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. విశాఖ డివిజన్‌లో 17, అనకాపల్లి డివిజన్‌లో 108 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. >Share It

News July 15, 2024

కేజీహెచ్, ఏఎంసీ అభివృద్ధికి కృషి: ఎంపీ

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేజీహెచ్‌తో పాటు ఆంధ్ర మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీ మాట్లాడారు. విశాఖలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉత్తరాంధ్ర వాసులకు ఎన్నో సేవలు అందిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం ఆసుపత్రిలో సౌకర్యాల విషయంలో అశ్రద్ధ చూపిందని ఆరోపించారు.

News July 15, 2024

మాజీ మంత్రి గుడివాడపై విశాఖ సీపీకి ఫిర్యాదు

image

మాజీ మంత్రి గుడివాడపై చర్యలు తీసుకోవాలని తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామ్ విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీకి ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మాజీ మంత్రి వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయని సీపీ దృష్టికి తీసుకెళ్లారు.

News July 15, 2024

విశాఖ: 130 కిలోమీటర్ల వేగంతో గరీబ్ రథ్..!

image

విశాఖ-సికింద్రాబాద్-విశాఖ(12740-12739) గరీబ్ రథ్ రైళ్ల వేగం పెరగనున్నట్లు సమాచారం. ఈ నెల 22 నుంచి సికింద్రాబాద్-విశాఖ, ఈ నెల 23 నుంచి విశాఖ-సికింద్రాబాద్ రైళ్లు ఎల్ హెచ్బీ బోగీలను మారనుండటంతో రైలు వేగం కూడా పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 120 కిలో మీటర్ల గరిష్ఠ వేగంతో వెళుతుండగా, ఇప్పుడు దాన్ని 130 కిలోమీటర్లకు పెంచనున్నట్లు సమాచారం.