Visakhapatnam

News July 15, 2024

విశాఖ: అనాథ పిల్లలకు కల్కి సినిమా ఫ్రీ

image

జేసీఐ సేవలు అభినందనీయమని విశాఖ నగర పోలీస్ కమిషనర్ అన్నారు. జేసీఐ వైజాగ్ పోర్ట్ అమిగోస్ ఆధ్వర్యంలో 120 మంది అనాథ చిన్నారులకు కల్కి సినిమా ఉచితంగా చూపించారు. సీపీ శంఖబ్రత బాగ్చీ చిన్నారులతో కలిసి చిత్రాన్ని చూశారు. కమిషనర్ మాట్లాడుతూ సినిమాల ద్వారా కూడా మంచిని నేర్చుకోవచ్చన్నారు. అనంతరం జేసీఐ సభ్యులను అభినందించారు.

News July 15, 2024

విజయసాయిరెడ్డి ఏం చెప్పనున్నారు..?

image

తన భార్యకు గర్భం రావడానికి సుభాశ్, ఎంపీ విజయసాయి రెడ్డే కారణమని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో శాంతి మీడియా ముందుకు వచ్చి విజయసాయి రెడ్డికి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఇవాళ ఉదయం 11 గంటలకు విశాఖలో విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టనున్నారు.

News July 15, 2024

నేడు కేజీహెచ్‌ను సందర్శించనున్న మంత్రి సత్య కుమార్

image

రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సోమవారం విశాఖపట్నం రానున్నారు. ఉదయం 11:20 నిమిషాలకు ఆయన విమానంలో విశాఖ చేరుకుంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:15 గంటలకు కేజీహెచ్ సందర్శిస్తారు. 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే పర్యవేక్షణ, రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. రాత్రి 11:20 గంటలకు బయలుదేరి విజయవాడకు రైల్లో తిరుగు ప్రయాణం అవుతారు.

News July 15, 2024

సింహాచలం: గిరిప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఈవో

image

సింహాచలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి గిరి ప్రదక్షణ నేపథ్యంలో ఏర్పాట్లను ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి పరిశీలించారు. ఆదివారం ఆలయ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులతో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News July 14, 2024

అనంత్ అంబానీకి విశాఖ ఎంపీ ఆశీర్వచనాలు

image

అంబానీ ఇంట పెళ్లికి విశాఖ ఎంపీ హాజరయ్యారు. అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌‌తో పాటు ఎంపీ శ్రీభరత్ వెళ్లారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని పాల్గొన్నారు.

News July 14, 2024

30 రోజుల్లో 30 మంచి పనులు చేసింది: గంటా

image

కూటమి ప్రభుత్వం 30 రోజుల్లో 30 మంచి పనులు చేసిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంపీపీ కాలనీలో తన నివాసంలో ఆయన మాట్లాడారు. భోగాపురం ఎయిర్ పోర్ట్, పోలవరం పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు. కేంద్ర ఉక్కుశాఖా మంత్రి స్వయంగా వచ్చి ఉక్కు సమస్యపై సమీక్ష జరిపి కార్మికులకు భరోసా ఇచ్చేలా మాట్లాడారని గుర్తుచేశారు. విశాఖ అభివృద్ధిలో భాగంగా మెట్రో, బీచ్ రోడ్ అభివృద్ధి చేస్తామని హామి ఇచ్చారు.

News July 14, 2024

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

image

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీంతో ఏపీ తీరానికి చేరువగా అల్పపీడనం రానుంది. దీని ప్రభావంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించారు.

News July 14, 2024

వేతనాలకు ఏయూ సిబ్బంది ఎదురుచూపు..!

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగులకు నేటివరకు వేతనాలు అందలేదు. వర్సిటీ వీసీ రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఖాళీ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇన్చార్జి విసీ ని నియమించలేదు. దీంతో ఉద్యోగుల వేతనాలు మంజూరు ఆలస్యం అవుతోంది. ఉద్యోగులకు దాదాపు రూ.32 కోట్ల వరకు వేతనాలు, పెన్షన్ల రూపంలో ఇవ్వాల్సి ఉంది. ఇన్చార్జి వీసీ నియామకం జరిగితేనే ఈ ఫైల్ ‌కు మోక్ష లభించి ఉద్యోగులకు వేతనాలు లభిస్తాయి.

News July 14, 2024

విశాఖలో మెట్రో.. చంద్రబాబు సూచనలు

image

విశాఖ నగరంలో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు సూచన మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. నగరంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే పైవంతెనలకు అనుసంధానంగా మెట్రో డిజైన్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఎన్.హెచ్.ఏ.ఐ సమన్వయంతో ప్రణాళిక రచిస్తున్నారు.

News July 14, 2024

అత్యాచార ఘటనపై హోమ్ మంత్రి సీరియస్

image

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలోని ఓ గిరిజన గ్రామంలో ఆరు నెలల చిన్నారిపై <<13625276>>అత్యాచారం<<>> చేసిన ఘటనపై హోమ్ మంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజుతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా ఎస్పీ, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడిన ఆమె.. ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై యాక్షన్ చాలా సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించారు.