India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏయూతో పాటు అనుబంధ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఈ.ఎన్ ధనుంజయ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 7 (సోమవారం) నుంచి 12(శనివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 14(సోమవారం) తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
అరకులోయలో పాస్ పోర్టు ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తపాలా శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ సంజయ్ పాండా తెలిపారు. శనివారం ఆయన అరకులోయలోని ఉప తపాలా శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు పాస్ పోర్టు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో ఉప తపాలా కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.
అమెరికాలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతులు సంఘ సభ్యులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో తెలుగు ప్రజలు ఇంత ఘనంగా నిర్వహించడం గర్వకారణం అని పేర్కొన్నారు. ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
విశాఖ కుర్రాడు <<14221996>>నితీశ్<<>> కుమార్ రెడ్డి టీమ్ఇండియాకు ఎంపికయ్యారు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు లభించింది. నితీశ్ 2003 మే 26న విశాఖపట్నంలో జన్మించారు. IPL 2024లో 13 మ్యాచుల్లో 303 పరుగులతో రాణించి అందరి దృష్టి ఆకర్షించారు. అనంతరం జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ఎంపికైనా గాయంతో ఆ పర్యటనకు దూరమయ్యారు. బంగ్లాతో పోరులో ఈ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసే అవకాశముంది.
ఉక్కు కార్మికులు ఈనెల 30న భారీ నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికుల గేట్ పాస్‌లను వెనక్కి తీసుకోవాలంటూ HODలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒకపక్క ప్రైవేటీకరణ చేయబోమంటూ కేంద్రం సెయిల్‌లో విలీనానికి అనుకూలంగా ఉన్నట్టు ప్రకటనలు వస్తున్నాయి. మరోపక్క కార్మికులను తొలగిస్తోంది.
కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జే.మహిత్ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ శనివారం తెలిపారు. ఇటీవల పాడేరులో జరిగిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో తమ పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొన్నారన్నారు. అయితే షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలకు మహిత్ ఎంపికయ్యారని అభినందించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఒకేసారి 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించిందని స్టీల్ ప్లాంట్ సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు అయోధ్యరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివిధ కార్మిక సంఘాల నాయకులు తీవ్ర నిరసన తెలియజేయడంతో యాజమాన్యం దిగివచ్చిందన్నారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై స్టీల్ ప్లాంట్ అడ్మిన్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేపట్టామన్నారు.
గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో షీలా నగర్ రహదారిపై శుక్రవారం డాక్ యార్డ్ ఉద్యోగి దిలీప్ కుమార్(33) మృతిచెందిన విషయం తెలిసిందే. అల్లూరి జిల్లా హుకుంపేటకు చెందిన ఇతను పెందుర్తి మం. సరిపల్లిలో ఉంటున్నారు. విధులు ముగించుకొని బైకుపై వెళ్తుండగా టోల్ గేట్ సమీపంలో లారీ ఢీకొనగా, దిలీప్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. హెల్మెట్ ఉన్నా ప్రాణాలు దక్కలేదని కుటుంబ సభ్యులు రోదించారు.
ముడి వస్తువులకు విలువలు జోడింపు ద్వారా నాణ్యత పెరగడమే కాకుండా మెరుగైన ఆర్ధిక లబ్ది చేకూరుతుందని అల్లూరి కలెక్టర్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం న్యూడిల్లీలో స్పైసెస్ బోర్డు, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ నిర్వహించిన వర్క్ షాప్‌కు కలెక్టర్ హాజరయ్యారు. మంచి పరిశుభ్రత పద్ధతులలో సుగంద ద్రవ్యాలైన మిరియాలను సరైన పక్వ స్థితిలో సేకరించాలని, సేకరించిన మిరియాలకు అదనపు విలువలు జోడించాలన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. అనకాపల్లి ఆర్డీవోగా షేక్ ఆయేషాను నియమించారు. విశాఖ ఆర్డీవో హుస్సేన్ సాహిబ్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో పోలూరి శ్రీలేఖను నియమించారు. భీమిలి ఆర్డీవో భాస్కర్ రెడ్డి స్థానంలో కె.సంగీత్ మాధుర్ బదిలీపై వచ్చారు. VMRDA సెక్రటరీని బదిలీ చేయగా ఆమెను విజయనగరం ఆర్డీవోగా నియమించారు.
Sorry, no posts matched your criteria.