Visakhapatnam

News August 25, 2025

విశాఖ పోర్టు రోడ్డులో భారీ వాహనాలకు అనుమతి లేదు

image

కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. మ.12.30 నిమిషాలకు I.N.S సర్కార్‌కు చేరుకొని ఉదయగిరి, హిమగిరి అనే నౌకలను ప్రారంభించనున్నారు. ఆయన ప్రసంగించిన తర్వాత సాయంత్రం 5.25 నిముషాలకు తిరిగి బయలుదేరుతారు. V.V.I.P రాక సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ రోడ్డులో రేపు భారీ వాహనాలకు అనుమతి లేదని పోర్టు అధికారులు తెలిపారు.

News August 25, 2025

విశాఖ జిల్లాలో 5,616 స్మార్ట్ కార్డులు పంపిణీ: జేసీ

image

జిల్లాలో సోమవారం 5,616 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని జేసీ మయూర్ అశోక్ తెలిపారు.‌ ఈనెల 31 వరకు సచివాలయాల సిబ్బంది ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు సంబంధిత రేషన్ దుకాణాల వద్ద పంపిణీ చేస్తామన్నారు. పాత బియ్యం కార్డు, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబరుతో సచివాలయ సిబ్బంది నుంచి స్మార్ట్ కార్డులు తీసుకోవాలన్నారు.

News August 25, 2025

విశాఖ కలెక్టర్ పీజీఆర్ఎస్‌కు 329 వినతులు

image

విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 329 వినతులు అందాయి. కలెక్టర్ హరేందర్ ప్రసాద్ స్వయంగా అర్జీలను స్వీకరించారు. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 141, జీవీఎంసీకి చెందినవి 72, పోలీస్ శాఖకు సంబంధించినవి 17 ఉండగా ఇతర శాఖలకు చెందినవి 99 ఫిర్యాదులు వచ్చాయి.

News August 25, 2025

విశాఖలో సెప్టెంబర్ 8 వ‌ర‌కు నేత్ర‌దాన ప‌క్షోత్స‌వాలు

image

ఆగ‌స్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 40వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు జ‌రుగుతాయ‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ తెలిపారు. ఈ మేర‌కు సోమ‌వారం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. నేత్రదానంపై ప్ర‌తి ఒక్క‌రికీ అవగాహన క‌ల్పించాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్టర్ అధికారుల‌ను ఆదేశించారు. డీఎం & హెచ్వో జగదీశ్వరరావు, ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ ఉన్నారు.

News August 25, 2025

జీవీఎంసీలో పీజీఆర్ఎస్‌కు 114 వినతులు

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 114 వినతులు వచ్చాయి. ఈ వినతులను జివిఎంసి అదనపు కమీషనరు ఎస్.ఎస్.వర్మ తీసుకున్నారు. ఇందులో అకౌంట్స్ విభాగానికి 4, రెవెన్యూ 19, ప్రజారోగ్యం 08, పట్టణ ప్రణాళిక 55, ఇంజినీరింగు 19, మొక్కల 03, యుసిడి విభాగమునకు 06 కలిపి మొత్తంగా 114 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News August 25, 2025

విశాఖలో రైల్వే ఆధునీకరణపై ఎంపీ భరత్ సమీక్ష

image

విశాఖ ఎంపీ శ్రీభరత్ సోమవారం చిన్న వాల్తేరు రైల్వే గెస్ట్ హౌస్‌లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం సందీప్ మాధుర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు, కొత్త రైళ్లు, ఆధునిక సదుపాయాలపై చర్చించి రైల్వే ప్రాజెక్టులు వేగవంతం కావాలని కోరారు. జీఎం పూర్తి సహకారం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే అభివృద్ధి కొనసాగుతుందని ఎంపీ స్పష్టం చేశారు.

News August 25, 2025

విశాఖలో ఖమ్మం యువతి అత్మహత్య

image

విశాఖలో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. ఖమ్మం జిల్లాకు చెందిన నరేశ్, రమ్య HYDలో పనిచేస్తూ ప్రేమించుకున్నారు. ఈనెల 11న ఇద్దరూ విశాఖ వచ్చారు. కొబ్బరితోట ఏరియాలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. పెళ్లి చేసుకుందామని రమ్య కోరగా..‘నాకు ముందే పెళ్లి అయ్యింది. నిన్ను చేసుకోలేను’ అని చెప్పి నరేశ్‌ ఎటో వెళ్లిపోయాడు. ఇంట్లో రమ్య శనివారం ఉరేసుకుంది. నరేశ్‌ని అరెస్ట్ చేసినట్లు 2టూన్ CI ఎర్రన్నాయుడు తెలిపారు.

News August 25, 2025

విశాఖ: కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్

image

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి మొదలుకానుంది. విశాఖ జిల్లాలో 5,17,149 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వలస వెళ్లిన లబ్ధిదరులు తమ కార్డును నమోదు చేసుకున్న రేషన్ దుకాణం వద్దే తీసుకోవాలన్నారు. ఏటీఎమ్ కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది.

News August 24, 2025

కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్: కలెక్టర్

image

సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి అధికారులు హాజరవుతారు. అర్జీలు, పాత స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. పరిష్కారం అయిన వెంటనే మెసేజ్ వస్తుందని చెప్పారు. కాల్ సెంటర్ 1100 లేదా meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని కోరారు.

News August 24, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌లో గంజాయి స్మగ్లర్ల అరెస్టు

image

విశాఖ రైల్వే స్టేషన్‌లో జి.ఆర్.పీ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. ధనంజయనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం జి.ఆర్.పీ-ఆర్‌పీఎఫ్ సంయుక్త తనిఖీల్లో, కర్ణాటకకు చెందిన రసూల్ (27), షాదీక్ హుస్సేన్ వద్ద నుంచి రూ.50,000 విలువైన 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి ముఠాలపై ప్రత్యేక నిఘా బృందాలతో విశాఖ, దువ్వాడ, అనకాపల్లి, సింహాచలం స్టేషన్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.