India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలో ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్ల పరీక్ష కోసం అభ్యర్థులకు సహాయం అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని జిల్ల రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి శనివారం తెలిపారు. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తికి ఈ కంట్రోల్ రూమ్ నంబరు 08922-236947కి సంప్రదించవచ్చునని సూచించారు.
విజయనగరం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై శనివారం అవగాహన కల్పించారు. బాలల పరిరక్షణ చట్టాల అమలులో నిధుల కొరత, అవగాహన లేకపోవడం, సిబ్బంది కొరత, ప్రత్యేక పోలీస్ యూనిట్ల లోపం, శిక్షణ పొందిన మానవ వనరుల కొరత, వసతి గృహాల కొరత వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. బాలల హక్కులపై అవగాహన కల్పించాలన్నారు.
ఎరువుల సరఫరాపై రైతుల సమస్యలు తెలుసుకునేందుకు, వారి నుంచి సూచనలు, సలహాలను స్వీకరించేందుకు ఆదివారం డయిల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని అంబేడ్కర్ ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్య 9441957315 నంబరుకు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు.
జవహర్ నవోదయ స్కూల్ ఉపాధ్యాయుల నియామకం కోసం JC ఛాంబర్‌లో శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. జేసీ సేతు మాధవన్, DEO మాణిక్యం నాయుడు, జవహర్ నవోదయ ప్రిన్సిపల్ దుర్గా ప్రసాద్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ కమిటీ ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథ్స్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు జరిగాయి. ఒక సంవత్సర కాలానికి కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి ఎంపికలు చేశారు.
క్షేత్రస్థాయిలో మెరుగైన వెద్యసేవలను అందించాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని వైద్యారోగ్య, పశు సంవర్థకశాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో కలెక్టరేట్‌లో శనివారం సమీక్షా నిర్వహించారు. PHC, CHCల ద్వారా అందిస్తున్న వైద్యం, గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా అందిస్తున్న సేవలపై సమీక్షించారు.
ఉద్యోగం రాలేదని బొబ్బిలి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన బలగ మధు (23) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెచ్‌సీ వివరాల ప్రకారం.. మధు ట్రిపుల్ ఐటీ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. బొబ్బిలి (M) గున్నతోటవలస రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసున్నాడు. మధు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గరివిడి వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో శుక్రవారం సమావేశం అయ్యారు. విత్తనం నుంచి ఎరువుల వరకు రైతులు పడరాని పాట్లు పడాల్సి వస్తోందన్నారు. యూరియా కొరత పై ఈనెల 9న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టి ఆర్డీవోలకు వినతిపత్రాలు అందిస్తామన్నారు.
పెందుర్తి – సింహాచలం లైన్ మధ్య జరిగే సాంకేతిక పనులు కారణంగా నేటి నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈనెల 6, 8, 10, 12వ తేదీల్లో విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (18526) & 7, 9, 11, 13వ తేదీల్లో బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (19525)ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
విజయనగరం జిల్లాలో ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ పండగ సందర్భంగా జిల్లా కేంద్రంలోనూ, ఇతర ప్రాంతాల్లో ముస్లింలు చేపట్టిన ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం తెలిపారు. పట్టణంలో సుమారు 1500 మందితో భారీ ర్యాలీ చేపట్టగా, ఎటువంటి ఘటనలు జరగకుండా తమ సిబ్బంది బందోబస్తు నిర్వహించారన్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారని చెప్పారు.
ఇటీవల జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో విజయనగరం ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి ఎర్ల సాయి సత్తా చాటాడు. సీనియర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో 600/600 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడని ప్రిన్సిపల్ టీవీ గిరి తెలిపారు. సీనియర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో 590 ప్లస్ మార్కులను ఆరుగురు విద్యార్థులు సంపాదించారన్నారు. జూనియర్ విభాగంలో కూడా మంచి ఉత్తీర్ణత నమోదైందని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.