India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గంట్యాడ పోలీసు స్టేషన్ పరిధిలో చిన్నారిపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమరావతి పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి ఘటన వివరాలు తెలుసుకున్నారు. సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. ఈ విషయంపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో మాట్లాడిన మంత్రి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
ఆదివారం రేవు పోలవరం సముద్రంలో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. ఉదయాన్నే తుర్ల అర్జునరావు మృతదేహం వెలుగు చూసింది. అరగంట వ్యవధిలోనే సంజీవ్ కుమార్(బబ్లూ) మృతదేహం కూడా బయటపడినట్లు పోలీసులు తెలిపారు. చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉంటారని ఆశించిన తల్లిదండ్రుల కళ్లముందే కుమారులు తనువు చాలించడంతో బోరున విలపించారు.
మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేయబోయాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. అనకాపల్లికి చెందిన ఓ కుటుంబం గంట్యాడలో ఓ శుభకార్యానికి వచ్చింది. అక్కడ ఆడుకుంటున్న చిన్నారిని 30 ఏళ్ల యువకుడు ఆమెను దగ్గర్లోని తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా సీఐ నర్సింహమూర్తి దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు విద్యార్థులు గల్లంతయినట్లు మెరైన్ ఏఎస్ఐ కృష్ణ తెలిపారు. కోరుప్రోలు గ్రామానికి వివాహ వేడుకలో పాల్గొనేందుకు విజయనగరం నుంచి వచ్చిన 11 మంది విద్యార్థులు తీరంలో విహారయాత్రకు వెళ్లారు. వారిలో టి.అర్జున్, బి.బబ్లు సముద్రంలో స్నానం చేస్తుండగా గల్లంతయినట్లు పేర్కొన్నారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని బీబీఏ-ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్సు నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిపారు. జూలై నెలలో జరిగిన ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు నవంబర్ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఏయూ వెబ్సైట్ నుంచి పొందవచ్చు.
టీడీపీ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేశ్ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు చోటు దక్కింది. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాల కల్పనకు గల అవకాశాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా ఉద్యోగాల కల్పనకు గల అవకాశాలపై సూచనలు చేయనుంది.
భోగాపురం మండలంలోని లింగాలవలస మరో ఆన్‌లైన్ యాప్ మోసం వెలుగులోకి వచ్చింది. సీఐ ప్రభాకర్ వివరాలు మేరకు.. రూ.లక్షల్లో డిపాజిట్ చేస్తే ఎనిమిది రోజులకు 20 శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపడంతో ఓ యువకుడు బంధువులతో కలిసి రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేశాడు. మరికొంతమంది యువత కూడా నగదు చెల్లించారు. ప్రస్తుతం యాప్ పనిచేయకపోవడంతో భోగాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
భీమిలి మండలం చినగదిలి పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేసిన విశాఖ డెయిరీకి శనివారం జీవీఎంసీ సహాయ ప్రణాళిక అధికారి శాస్త్రి నోటీసులు జారీ చేశారు. జీవీఎంసీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. ఆ ప్రాంతంలో వసతి గృహాలు, పశువుల షెడ్లు, ఇతర భవనాలు ఉన్నట్లు గుర్తించామని నోటీసులో పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పత్రాలు వారంలోగా సమర్పించాలని కోరారు.
సుందర పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శనివారం ప్రారంభించారు. సుందర పార్వతీపురం రూపొందాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యమై జిల్లా వ్యాప్తంగా పరిశుద్ధ్య వాతావరణం ఏర్పాటు చేయడంతో పాటు సుందరమైన ప్రకృతి సోయగల పరిసరాలను రూపకల్పనకు సహకరించాలని కోరారు.
ఇసుక తవ్వకపు ధర జిల్లా అంతటా ఒకే విధంగా ఉండేలా కమిటీ నిర్ణయం తీసుకుంది. విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ అధ్యక్షతన ఇసుక సరఫరా జిల్లా స్థాయి సమావేశం శనివారం జరిగింది. స్టాక్ పాయింట్ వద్ద ఇసుక తవ్వకపు ధర టన్నుకు రూ.425గా, నేరుగా రీచ్ వద్ద తీసుకునే వారికి రూ.150గా ధరను నిర్ణయించారు. దీనికి ఎటువంటి సీనరేజి లేదని, రవాణా ఛార్జీలను మాత్రమే లబ్ధిదారులు చెల్లించాలని కలెక్టర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.