Vizianagaram

News August 22, 2025

VZM: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ VRO

image

వేపాడ మండలం సింగరాయ VROగా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది. విజయనగరం DSP రమ్య అందించిన వివరాల ప్రకారం.. రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్‌కు దరఖాస్తు చేసుకోగా VRO రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ.లక్ష VROకి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. MRO కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.

News August 22, 2025

ఈనెల 23న స్వచ్ఛాంధ్ర నిర్వహించండి: కలెక్టర్

image

ఈనెల 23న 4వ శనివారం ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులకు ఆదేశించారు. గురువారం సాయంత్రం తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. ఈవారం డ్రైన్ క్లీనింగ్, పారిశుద్ధ్యం ప్రధానాంశంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నీటి నిల్వలు లేకుండా చూడడం, దోమల నివారణకు మందులు స్ప్రే చేయడం, నీటి నాణ్యతలను పరీక్షించడం, తదితర వాటిపై అవగాహన కల్పించాలన్నారు.

News August 22, 2025

VZM: ఉచిత బస్సు ప్రయాణంపై అభిప్రాయాలు చెప్పండి

image

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రయాణికుల స్పందన తెలుసుకునేందుకు రేపు డయల్ యువర్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి గురువారం తెలిపారు. శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, 9959225604 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. ప్రయాణికుల స్పందన, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

News August 22, 2025

VZM: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ VRO

image

వేపాడ మండలం సింగరాయ VROగా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది. విజయనగరం DSP రమ్య అందించిన వివరాల ప్రకారం.. రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్‌కు దరఖాస్తు చేసుకోగా VRO రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ.లక్ష VROకి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. MRO కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.

News August 21, 2025

VZM: ఏసీబీ వలలో వీఆర్వో

image

విజయనగరం జిల్లాలోని వేపాడ మండలం సింగరాయి గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్న సత్యవతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం చిక్కారు. ఓ రైతు నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ రైడ్‌కు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News August 21, 2025

దివ్యాంగులకు అండగా నిలబడండి: చిన్న శ్రీను

image

దివ్యాంగుల పింఛన్లు పొందుతూ అనర్హత నోటీసులు అందుకున్న బాధితులకు ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలు అండగా నిలబడాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గురువారం పిలుపునిచ్చారు. తొలగించిన పింఛన్ల పునః పరిశీలనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన నేపథ్యంలో వాస్తవంగా అర్హత కలిగిన వారిని గుర్తించి ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకునేందుకు సహకరించాలన్నారు.

News August 21, 2025

గణేశ్ మండపాల ఏర్పాటుకు ఎస్పీ సూచనలు ఇవే..

image

గణేశ్ మండపాల ఏర్పాటుకు విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం పలు సూచనలు చేశారు.
➣ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదు
➣సింగిల్ విండో విధానంతో https://ganeshutsav.net లింక్ ద్వారా అనుమతులు
➣విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు వివరాలు తప్పనిసరి
➣కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, అనుపు తేదీ ముందే చెప్పాలి
➣NOC పొందిన తరువాత ప్రింట్ తీసుకొని మండపంలో భద్రపరచాలి

News August 21, 2025

VZM: హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ

image

షెడ్యూల్ కులాల యువతకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ అంబేడ్కర్ గురువారం తెలిపారు. కనీసం ఏడాది కాల పరిమితి గల లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలన్నారు. దరఖాస్తులను ఈనెల 27వ తేదీ లోపు కంటోన్మెంట్ కార్యాలయానికి అందజేయాలని పేర్కొన్నారు. ఐదుగురు స్త్రీలు, ఐదుగురు పురుషులను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.

News August 21, 2025

VZM: పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర నేర సమీక్షను ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, SDPS, పోక్సో, అట్రాసిటీ, రోడ్డు ప్రమాద కేసులు, లాంగ్ పెండింగ్ కేసులపై సమీక్షించారు. న్యాయస్థానాలను సంబంధిత అధికారులు తరచూ సందర్శించి కేసుల ప్రాసిక్యూషన్ జరుగుతున్న తీరును గమనించాలన్నారు. PGRS ఫిర్యాదులు తాము సూచించిన అధికారులు మాత్రమే విచారణ చేయాలన్నారు.

News August 20, 2025

VZM: ‘పరిసరరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి’

image

ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారిణి జీవనరాణి సూచించారు. జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రపంచ దోమల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ రోనాల్డ్ రాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. డ్రై డే ఫ్రైడే తప్పనిసరిగా పాటించాలన్నారు.