India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గణేశ్ ఉత్సవాలు సజావుగా జరిగేలా చూడాలని, ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ వకుల్ జిందాల్ చర్చించారు. వినాయక చవితి మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరని తెలిపారు. అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని మీసేవలో చలానా చెల్లించాలన్నారు. మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలను పాటించాలని సూచించారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో ఎరువుల కొరత ఉందని పలువురు సభ్యులు ప్రస్తావించగా.. సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పింఛన్ల తొలగింపుపై పునరాలోచన చేయాలన్నారు.
గజపతినగరం మండలం పిడిశీల గ్రామంలో వివాహిత కర్రోతు సాయి సుధ (29) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ కిరణ్ కుమార్ బుధవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. సాయి సుధ భర్త గురునాయుడు పనికి వెళ్లిపోయాడు. వీరి పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి వరలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
విజయనగరం జిల్లాలో అతి వేగంగా వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు. DGP ఆదేశాలతో గత వారం రోజుల నుంచి రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వారం రోజుల్లో 23 కేసులు నమోదు చేసి రూ.25,665 జరిమానా విధించామని పేర్కొన్నారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు.
విజయనగరం పట్టణానికి చెందిన టీ.మోహన్ భారీ సైబర్ మోసానికి గురయ్యాడు. పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సహకరిస్తానని చెప్పి దఫదఫాలుగా రూ.20 లక్షలను కేటుగాడు లాగేశాడు. నిందితుడి బ్యాంక్ ఖాతాలో 9సార్లు బాధితుడు నగదు జమ చేయించుకున్న అనంతరం ఫోన్ నంబర్ బ్లాక్‌లో పెట్టేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వన్ టౌన్ సీఐ చౌదరి తెలిపారు.
మోటారు వాహనాల చట్ట ఉల్లంఘనలకు సంబధించి పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్లను వారం రోజులలోగా చెల్లించాలని ఉప రవాణా కమిషనర్ మణికుమార్ తెలిపారు. https://echallan.parivahan.gov.in/index/accused-challan#challan_list వెబ్సైట్ ద్వారా చెల్లించాలని సూచించారు. ఈ-చలాన్లను చెల్లించని పక్షంలో చట్ట ప్రకారం వారి వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు.
విజయనగరం జిల్లాలో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్.కోట, గజపతినగరం, నెల్లిమర్ల, బొబ్బిలి నియోజకవర్గాల్లో రెండు రోజులపాటు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నియోజకవర్గాల అధికారులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.
విజయనగరం మహిళ పోలీసు స్టేషన్‌లో 2023లో నమోదైన పొక్సో కేసులో కొత్తపేటకు చెందిన యువకుడికి ఏడాది జైలు, రూ.1000 ఫైన్‌ను కోర్టు విధించిందని DSP గోవిందరావు తెలిపారు. లక్ష్మణరావు అనే యువకుడు ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక నేరానికి పాల్పడి మోసగించాడన్నారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైనట్లు పేర్కొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 27 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. భూ తగాదాలకు సంబంధించి 7, కుటుంబ కలహాలకు సంబంధించి 5, మోసాలకు పాల్పడినట్లు 4, ఇతర అంశాలకు సంబంధించి 11 ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేసేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు.
నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం సూచించారు. గ్రామాల్లో పర్యటించి పరిస్థితులపై నివేదికలు సమర్పించాలని, పారిశుద్ధ్య వ్యవస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. నాగావళి పరివాహక ప్రాంతాలైన సంతకవిటి, రేగిడి, వంగర, ఆర్.ఆముదాలవలస మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.