India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా అక్టోబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ప్రభుత్వ పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే.
*పార్వతీపురం కలెక్టరేట్ వద్ద సర్పంచుల ఆందోళన
*స్వగ్రామానికి చేరుకున్న మెడికో అమృత మృతదేహం
*పడాల శరత్ మృతి బాధాకరం: పవన్ కళ్యాణ్
*చీపురుపల్లి: గణేశుడి నిమజ్జనంలో వైసీపీ పాటలకు డ్యాన్సులు (VIDEO)
*పూసపాటిరేగ: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష
*విజయనగరంలో భారీ వర్షం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం
*జిల్లాలో దెబ్బతిన్న ఇళ్లకు ఈ నెల 25న పరిహారం: కలెక్టర్
*VRD కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ
విజయనగరంలో జిల్లా పూసపాటిరేగ మండలంలోని స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో 2023లో నమోదైన పోక్సో కేసు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.7వేలు జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. పెద్దపతివాడ గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, కుటుంబసభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేయగా నేరం రుజువైందని చెప్పారు.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని విజయనగరం పైడిమాంబ, రామతీర్థం రామస్వామి ఈ రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఆయా దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి అవసరమైన సామగ్రిని పంపిణీ చేసేందుకు ఏడాదికి ఒక సారి టెండర్లు నిర్వహిస్తుంటారు. ఎవరైతే తక్కువ ధరకు వస్తువులు పంపిణీ చేస్తామని కోట్ చేస్తారో వాళ్లకే టెండర్ దక్కుతుంది. ఇది ఏళ్ల కాలం నుంచి జరుగుతున్న ప్రక్రియ అని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
మారేడుమిల్లి జలపాతంలో బాడంగి మండలం డొంకినవలసకు చెందిన బాలి అమృత గల్లంతై మృతి చెందింది. ఏలూరులో మెడిసిన్ చదుతున్న ఆమె.. స్నేహితులతో కలిసి టూర్‌కి వెళ్లింది. భారీ వర్షాల కారణంగా జలపాతం పొంగడంతో వాగులో కొట్టుకుపోయింది. సోమవారం ఉదయం ఆమె మృతదేహం వెలికితీశారు. ఆమె తండ్రి రైల్వే బాలి శ్రీనివాసరావు గ్యాంగ్ మెన్ పనిచేస్తున్నారు. కాగా.. ఇదే ప్రమాదంలో బొబ్బిలికి చెందిన కే.సౌమ్య మృతి చెందిన సంగతి తెలిసిందే.
మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద వాగులో ముగ్గురు ఏలూరు ఆశ్రమ్ కళాశాల మెడికల్ విద్యార్థులు ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరి మృతదేహాలు సోమవారం ఉదయం బయటపడ్డాయి. వాటర్ ఫాల్స్ దిగువన ఇద్దరి యువతుల మృతదేహాలు దొరికాయి. వీరిలో బొబ్బిలికి చెందిన కె.సౌమ్య ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని బొబ్బిలి రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు, మాజీ మంత్రి పడాల అరుణ కుమారుడు పడాల శరత్ మరణం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శరత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. పుత్ర శోకాన్ని తట్టుకోగల ధైర్యాన్ని అరుణ గారికి ప్రసాదించాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నానని అన్నారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు.
అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతంలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే. గల్లంతైన వారిలో జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని ఉన్నట్లు తెలిసింది. బొబ్బిలి పట్టణంలోని రావువారి వీధికి చెందిన కొసిరెడ్డి అప్పలనాయుడు కుమార్తె సౌమ్య ఉన్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. సౌమ్య ఏలూరులోని ఓ కళాశాలలో మెడిసిన్ చదువుతున్నారు.
పైడితల్లమ్మ ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలు అక్టోబర్ 14,15 తేదీల్లో జరిగే తోల్లేళ్లు, సిరిమానోత్సవం రోజున భక్తులకు ఉచిత దర్శనం కల్పించేందుకు నిర్ణయించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. గతంలో ఈ రెండు రోజుల్లో రూ.50,రూ.100,రూ.300 చొప్పున టికెట్లు వసూలు చేసేవారు. ఈ ఏడాది మాత్రం భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ఉచిత దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. >Share it
ఉమ్మడి విజయనగరం జిల్లాలో నలుగురు ఎంపీడీవోలకు బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం ఎంపీడీవో షేక్ మహమ్మద్ అఖీబ్ జావేద్‌కు ప్రకాశం జిల్లాకు, పాచిపెంట ఎంపీడీఓ పీ.లక్ష్మీకాంత్ చిత్తూరు జిల్లా, పీ.శ్రీనివాసరావుకు శ్రీకాకుళంజిల్లా, వీవీఎన్ ఆంజనేయులకు విశాఖపట్నం జిల్లాకు బదిలీ చేసింది. వీరి స్థానంలో కొత్తగా ఎంపీడీవోలను నియమించాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.