Vizianagaram

News December 28, 2024

రామతీర్థంలో ఘనంగా సహస్ర దీపాలంకరణ సేవ

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలోని ఊయలలో స్వామివారి విగ్రహం వేంచేపుచేసి సుందరంగా అలంకరించారు. వెయ్యి దీపాలు వెలిగించారు. స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

News December 27, 2024

ఒక సీసీ కెమెరా 20 మంది పోలీసులతో సమానం: ఎస్పీ

image

ఒక సీసీ కెమెరా 20 మంది పోలీసులతో సమానమని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విజయనగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, జిల్లాలో ఇప్పటికీ 620 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 38 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News December 27, 2024

పార్వతీపురం వరకు మెము ట్రైన్

image

రేపటి నుంచి మార్చి 31 వరకు పార్వతీపురం పట్టణానికి మెము ట్రైన్ వేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ- విజయనగరం – పలాస- విజయనగరం మెము రైలును పార్వతీపురం వరకు పొడిగించారు. విజయనగరంలో రాత్రి 7. 55 గంటలకు బయలుదేరి పార్వతీపురం రాత్రి పది గంటలకు చేరుకుంటుందని తెలిపారు. తిరిగి పార్వతీపురంలో ఉదయం నాలుగు గంటలకు బయలుదేరి విజయనగరం 6 గంటలకు చేరుకుంటుందన్నారు.

News December 27, 2024

విజయనగరం జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన 2024..!

image

‘2024’..ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. గత ఎన్నికల్లో 9స్థానాల్లోనూ YCPఅభ్యర్థులను గెలిపించిన ప్రజలు.. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టారు. దీంతో YCP కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొనగా..TDP ఫాలోవర్లు ఆనందంలో మునిగిపోయారు. బొత్స, కోలగట్ల, శంబంగి, రాజన్నదొర లాంటి సీనియర్లు ఓడిపోగా.. బేబినాయన, మాధవి, జగదీశ్వరి, అతిది గజపతి, విజయచంద్ర మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

News December 27, 2024

ఉమ్మడి జిల్లాలో వైసీపీ ఆధ్వర్యంలో నేడు నిరసనలు

image

విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద ర్యాలీలు నిర్వహిస్తారు. విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకుని వైసీపీ ఈ కార్యక్రమం చేపట్టనుంది.

News December 27, 2024

VZM: షెడ్యూల్డు కులాల సర్వే నివేదిక సచివాలయాల్లో ప్రదర్శన

image

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు షెడ్యూల్డ్ కులాల సర్వే నివేదికను జిల్లా వ్యాప్తంగా ఉన్న 530 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లోని 96 వార్డు సచివాలయాల్లో గురువారం ప్రదర్శించారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలపవచ్చని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ నెల 31వ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి జనవరి 6వ తేదీలోగా ఆన్లైన్ చేస్తామన్నారు.

News December 26, 2024

విజయనగరం: పోలీస్ ఉద్యోగమే లక్ష్యం

image

రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి సంబంధించి ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేయడంతో కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విజ్జీ, రాజీవ్, అయోధ్య, మైదానాలన్నీ అభ్యర్థులతో నిండిపోయాయి. వర్షంతో మైదానాలు బురదమయం కాగా ఖాకీ కొలువు కోసం యువత అవరోధాలను అధిగమించి ప్రాక్టీస్ ముమ్మరం చేస్తున్నారు. వీరికి ఈనెల 30వ తేదీ నుంచి జిల్లా పెరేడ్ గ్రౌండ్లో ఈవెంట్స్ జరగనున్నాయి.

News December 26, 2024

విజయనగరం మీదుగా వెళ్లే రైళ్లకు అదనపు కోచ్‌లు

image

సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డిఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ పాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.

News December 26, 2024

పార్వతీపురం: నేడు విద్యా సంస్థలకు సెలవు

image

తుఫాన్ ప్రభావంతో పార్వతీపురం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలకు గురువారం సెలవు ప్రకటించినట్లు డీఈవో ఎన్.టీ.నాయుడు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు డీవైఈవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు తెలియజేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా క్లాసులు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

News December 26, 2024

రాష్ట్ర స్థాయి పోటీల్లో రన్నర్లుగా నిలిచిన జిల్లా జట్లు

image

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఈనెల 22 నుంచి జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్‌ అంతర్‌ జిల్లాల బాల, బాలికల కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో విజయనగరం బాల, బాలికల జట్లు ద్వితీయ స్థానం సాధించాయి. వివిధ జిల్లాలకు చెందిన జట్లతో హోరాహోరీగా తలపడి రన్నర్లుగా నిలిచారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పలువురు అభినందనలు తెలిపారు.