India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రానున్న 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. నరసాపురం, మొగల్తూరు, ఆచంట మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. సహాయం కోసం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 08816-299181 ను సంప్రదించవచ్చు.
ప.గో.జిల్లా వ్యాప్తంగా గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడనున్న కారణంగా రానున్న 48 గంటలు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఉండి మండలం మహాదేవపట్నంలో మహిళా సమైక్య సభ్యులు నెలకొల్పిన స్లో బీన్ చాక్లెట్ ఫ్యాక్టరీని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. రూ.25 లక్షల వ్యయంతో స్థాపించిన ఈ ఫ్యాక్టరీకి పీఎంఎఫ్ఎంఈ పథకం కింద రూ.8.75 లక్షల సబ్సిడీ లభించింది. మహిళలు పరిశ్రమలు స్థాపించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు సూచించారు.
‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా భీమవరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. అనంతరం ఆమె సెల్ఫీ దిగారు. ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం రెండేళ్లలో జాతీయ ఉద్యమంగా మారిందని ఆమె కొనియాడారు.
మాజీ సీఎం వైసీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, విఎస్స్ గార్డెన్స్‌లో జరిగే వేడుకకు హాజరు అవుతారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జగన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి రూ.లక్ష డ్రాఫ్ట్‌ను అందించిన పోడూరు తహశీల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్‌ను జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం అభినందించారు. తహశీల్దార్లందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని, పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి రెడ్ క్రాస్‌కు అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
చినఅమిరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని కలెక్టర్ నాగరాణి మంగళవారం ప్రారంభించారు. ఆమె విద్యార్థులకు స్వయంగా నులిపురుగుల మాత్రలు వేశారు. పిల్లలు ఈ మాత్రలు వేసుకోవడం ద్వారా రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని కలెక్టర్ సూచించారు. నులిపురుగులు ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిపారు.
మద్యం సేవించి వాహనం నడిపిన నలుగురుకు భీమవరం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సోమవారం జరిమానా విధించారు. రూరల్ ఎస్సై వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన కొవ్వాడ సెంటర్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నాగరాజు, సురేశ్, వెంకన్న, చిన్న మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పట్టుపడ్డారరు. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున నలుగురికి రూ.40,000 జరిమానాను మెజిస్ట్రేట్ విధించారు.
భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిశీలించారు. అర్జీదారుడికి సంతృప్తి కలిగేలా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సైతం సంబంధిత శాఖలకు పంపించాలని వారికి సూచించారు.
జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం విజయవంతానికి అధికారులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల12న జిల్లాలో నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం గోడ పత్రికను సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. పిల్లలు, కిశోర్ బాలల కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే పౌష్టికాహార లోపం, రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారన్నారు.
Sorry, no posts matched your criteria.