India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల ప్రకారం 24, 25, 26 తేదీల్లో జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో 24/7 పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఏలూరు జిల్లాలో సోమవారం విషాద ఘటన జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్ల గూడేనికి చెందిన కవులూరి చరణ్(20) గురవాయిగూడెంలో కర్ర కోత మిషన్ పనికి వెళ్లాడు. ఈక్రమంలో అక్కడ షాక్ తగిలి మృతిచెందాడు. కోత మిషన్ యజమాని మేకల గంగాధర్ తిలక్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి ప.గో జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తణుకు మండలం పైడిపర్రుకు చెందిన వెంకటేశ్వర రావు(60), దుర్గ(50) కొవ్వూరు మండలం మద్దూరులో జరిగే శుభకార్యానికి బైకుపై బయల్దేరారు. ఈక్రమంలో నిడదవోలు మండలం గోపవరం వద్ద ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పల్లె పండగ వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. అక్టోబర్ 14న ప్రారంభమైన ఈ వారోత్సవాలు 20వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఆయా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ఏలూరు జిల్లాలో 2,523 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా ₹.173.87 కోట్లు మంజూరు చేశారు.
ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయమై రైతులకు తగిన సలహాలు, సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జేసీ ధాత్రి రెడ్డి వెల్లడించారు. రైతులకు ఎటువంటి సమాచారం కావాలన్నా 08812-230448, 7702003584 నంబర్లను సంప్రదించాలని కోరారు. అలాగే టోల్ ఫ్రీ 18004256453కు సైతం కాల్ చేయవచ్చన్నారు. క్వింటాకి కామన్ రకం రూ.2300, గ్రేడ్-ఏ రకానికి రూ.2320 కనీస ధరగా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు ఫొటోను అసభ్యంగా మార్చిన ఓ వ్యక్తిపై ఏలూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. లింగపాలెం మండలం బోగోలుకు చెందిన సాతునూరు లక్ష్మీనవదీప్ సీఎం చంద్రబాబు ఫొటోను అసభ్యకరంగా మార్చాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదే విషయమై కె.యోహాన్ అనే వ్యక్తి లక్ష్మీనవదీప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లింగపాలెం ఎస్ఐ వెంకన్న కేసు నమోదు చేశారు.
వైసీపీ మద్దతుదారుడు బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై ఏలూరులోనూ కేసు నమోదైంది. దెందలూరు MLA చింతమనేని ప్రభాకర్‌కు 2023లో బోరుగడ్డ ఫోన్ చేశారు. ‘మా పార్టీ తలచుకుంటే నీ అంతు చూస్తుంది. మీ సామాజికవర్గాన్ని ఖతం చేస్తాం’ అని బెదిరించారు. ఈక్రమంలో చింతమనేని ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో నిన్న రాత్రి కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి సురేశ్ రెడ్డి ఆదివారం ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లా కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.వెట్రి సెల్వి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం పలు జిల్లాకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్‌ను ఖరారు చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం సందిగ్ధత నెలకొంది. దీంతో నేడు విడుదల చేసిన ప్రకటనతో ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిపై స్పష్టత వచ్చింది.
ఏలూరు నగరంలోని శనివారపుపేటవై జంక్షన్లోని అబ్బిరెడ్డి అపార్టుమెంట్లో కొంతమంది పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు శనివారం తన సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. ఈ దాడుల్లో 11 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.2.37 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే వారిలో వివిధ చోట్ల పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు ఉండటం గమనార్హం.
Sorry, no posts matched your criteria.