WestGodavari

News March 7, 2025

ప.గో జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ప.గో జిల్లా వాసులు ఎక్కువగా ఏలూరు, తూ.గో జిల్లాకు వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లాలలోని విద్యాసంస్థలతో చదివేవారు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా ప.గో జిల్లా దాటి పక్క జిల్లాలకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.

News March 7, 2025

ఏలూరు : ఘోర ప్రమాదం.. కుటుంబాల్లో కన్నీరు

image

చొదిమెళ్ల <<15665845>>ప్రమాదం <<>>పలువురి కుటుంబాల్లో విషాదం నింపింది. జగ్గంపేట(M) కాట్రావులపల్లికి చెందిన దుర్గాభవాని(23) సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా HYDలో పనిచేస్తోంది. తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ మధ్యలోనే కన్నుమూసింది. ఉదయానికే వచ్చేస్తానంటూ ఫోన్ చేసి చెప్పిన భీమేశ్వరరావు(భీమడోలు), కాకినాడ జిల్లాలో బంధువుల పెళ్లికి బయల్దేరిన భవాని(28) చనిపోయారు. సగం దూరం బస్ నడిపి రెస్ట్ తీసుకున్న మధుసూదన్(కాకినాడ) చనిపోయాడు.

News March 7, 2025

చినతాడేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చేబ్రోలు నుంచి ఎల్.అగ్రహారం మోటార్ సైకిల్‌పై వస్తున్న తిరుపతి వెంకటరమణ (66) ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుని భార్య తిరుపతి వెంకట సూర్య కుమారి ఫిర్యాదు మేరకు ఏఎస్సై దుర్గారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 7, 2025

ఆకివీడు: లారీ ఢీకొని యువకుడు మృతి

image

ఆకివీడు శివారు దుంపగడప గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఏలూరు జిల్లా కొట్టాడ ప్రాంతానికి చెందిన మద్దా మరియదాస్ (20) యువకుడు ఇంటికి వెళ్తుండగా ఆకివీడు వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. మరియదాసు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించారు.

News March 7, 2025

భీమవరం: జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం -2025 సందర్భంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో 6వ రోజు మహిళా సాధికారిత వారోత్సవాలను ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న అధికారులు విద్యార్థినులతో సరదాగా ముచ్చటించి పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్లలో వాడే పరికరాలు, పలు రికార్డుల నిర్వహణ, ఆయుధాలు, కమ్యూనికేషన్ సాధనాల గురించి తదితర విషయాలపై క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో వివరించారు.

News March 6, 2025

పోలవరంపై YCPకి మాట్లాడే అర్హత లేదు: షర్మిల

image

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ప్రచారం అవాస్తవం అయితే కేంద్రంతో ప్రకటన చేపించాలని ప్రభుత్వాన్ని YS షర్మిల డిమాండ్ చేశారు. ‘పోలవరంపై YCPకి మాట్లాడే అర్హత లేదు. ఈ ప్రాజెక్టు పేరు వింటే YSR గుర్తుకొచ్చే మీకు.. 5 ఏళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా? నాడు తట్టెడు మట్టి అయినా తీశారా? ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకుంది మీరు కాదా?’ అని ఆమె Xలో నిలదీశారు.

News March 6, 2025

పెదపాడు: సహజీవనం చేస్తున్న మహిళ కూతురిపై లైంగిక దాడి

image

తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన కుమార్తె(16)పై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పెదపాడు మండలానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై శారద సతీశ్ వివరాల ప్రకారం.. భర్తతో విడిపోయి ఇద్దరు కుమార్తెలతో ఉంటున్న మహిళ నాని అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. తన పెద్ద కుమార్తెపై ఇటీవల నాని లైంగిక దాడికి పాల్పడ్డాడన్న మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News March 6, 2025

భయం లేకుండా చికెన్ తినండి: కలెక్టర్

image

ప.గో జిల్లా ప్రజలు ఎలాంటి భయం లేకుండా చికెన్ తినొచ్చని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం తణుకులో నిర్వహించిన చికెన్ మేళాలో ఆమె పాల్గొన్నారు. దాదాపు 10 వేల మందికి ఉచితంగా అందిచారు. ఫౌల్ట్రీ రైతులను రుణాల రీషెడ్యూల్‌కు ప్రయత్నిస్తామని కలెక్టర్, MLA రాధాకృష్ణ తెలిపారు. వేల్పూరు కృష్ణానందం కోళ్లఫారం, పెదతాడేపల్లిలో రామలక్ష్మి ఫారం నుంచి కి.మీ పరిధిలో మినహా జిల్లా మొత్తం చికెన్ తినొచ్చన్నారు.

News March 6, 2025

సిద్ధాంతం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

సిద్ధాంతం అయ్యప్ప స్వామి గుడి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధాంతం చెరువుపేటకు చెందిన పమ్మి చినబాబు (30)మృతి చెందాడు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఈతకోట రొయ్యల ఫ్యాక్టరీలో డ్యూటీ ముగించుకుని మోటార్ సైకిల్ పై ఇంటికి తిరిగి వెళ్తూండగా బస్సును తప్పిస్తూ, ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టాడంతో తలకు బలమైన గాయం అవ్వగా ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News March 6, 2025

భీమవరం: మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

image

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని మాట్లాడుతూ.. స్థానిక బీవీ రాజు కళాశాలలో పండుగ వాతావరణంలో మహిళా దినోత్సవం వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరు హాజరవుతారన్నారు.

error: Content is protected !!