India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోల్‌కతాలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా వైద్యులు నేటి నుంచి నిరసన చేపట్టనున్నారు. జాతీయ వైద్యసంఘం పిలుపు మేరకు నేటి ఉదయం నుంచి 24 గంటల పాటు ఉమ్మడి జిల్లాలో 1,350 ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యులంతా సేవలు నిలిపివేయనున్నారు. అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరవుతారు.
బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. SI జ్యోతిబసు తెలిపిన వివరాలు.. కాళ్ళ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17)ను అదే గ్రామానికి చెందిన రాజేశ్ పెళ్లి చేసుకుంటానని వేధించాడు. ఈ విషయంలో గొడవలవగా బాలికను జంగారెడ్డిగూడెంలోని బంధువుల ఇంటికి పంపారు. ఈ నెల 7న రాజేష్ బాలికకు ఫోన్ చేసి తనవెంట తీసుకెళ్లాడు. అనంతపురం, లంబసింగిలో ఉంచి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
అన్న క్యాంటీన్లపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు ఓసారి వాటి వద్దకు వెళ్లి భోజనం చేయాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్లపై చౌకబారు విమర్శలు చేయొద్దని ఆయన అన్నారు.
ఉమ్మడి ప.గో జిల్లాలోని ఇసుక నిల్వల వివరాలను కలెక్టర్ నాగరాణి శుక్రవారం వెల్లడించారు. పెరవలి మండలం ఉసులుమర్రు – 5,603 మెట్రిక్ టన్నులు, పెండ్యాల – 1,06,758 మెట్రిక్ టన్నులు, నిడదవోలు మండలం పందలపర్రు – 38,566 మెట్రిక్ టన్నులు, ఆయా స్టాక్ పాయింట్లు వద్ద నిలువ ఉందని అన్నారు. స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఒక్కింటికి రూ.270/- అని తెలిపారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని వట్లూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉపాధి శిక్షణా కోర్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి గంటా సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. మరిన్ని వివరాల కొరకు 89785 24022 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పశ్చిమ బెంగాల్‌లోని RG Kar మెడికల్ కాలేజ్‌లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా ఈనెల 17న ఉదయం 6 గంటల నుంచి 18న ఉదయం 6 గంటల వరకు భీమవరంలో వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకరోజు పూర్తిగా వైద్య సేవలు, లేబరేటరీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ నిలిపి వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. రూ.28 లక్షల వ్యయంతో ఏలూరులో నిర్మించిన ఈ భవనాన్ని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సొసైటీలో సభ్యత్వం కలిగిన వారికి రూ.2 లక్షల వరకు రుణం మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ స్వరూపారాణి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తన భార్య మృతిని తట్టుకోలేని భర్త శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు నగరంలో చోటు చేసుకుంది. ఏలూరు చాణిక్యపురి కాలనీకు చెందిన దళాయి కృష్ణ (65) భార్య గతేడాది మే నెలలో మృతి చెందారు. అప్పటినుంచి తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణ ఒంటరిగా ఉంటూ శుక్రవారం శ్రీనివాస థియేటర్ రైల్వేలో బ్రిడ్జిపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే ఎస్సై సైమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ రాజభవన్లో నిర్వహించే విందుకు గురువారం నరసాపురం పట్టణానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు స్వామి నాయుడు ఎంపికయ్యారు. ఈయన పట్టణంలో 12, 13వ వార్డుల్లో పారిశుధ్య కార్మికుడిగా సేవలు అందిస్తున్నారు. వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న పలు వర్గాలకు చెందిన వ్యక్తులకు గవర్నర్ స్వాతంత్య్ర దినోత్సవాన గవర్నర్ ఎట్ హెూమ్ కార్యక్రమంలో భాగంగా విందు ఇచ్చారు.
చరిత్రలో ముషారఫ్, హిట్లర్ వంటివారు కూడా చేయని నియంత పాలన జగన్ చేశారని అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పాలకొల్లులో అన్న క్యాంటీన్‌ను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్లను జగన్ పాలనలో ధ్వంసం చేశారని, అందుకే ప్రజలు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని చెప్పారు.
Sorry, no posts matched your criteria.