WestGodavari

News August 16, 2024

ఏలూరు: ముఖంపై అవాంఛిత రోమాలు.. యువతి సూసైడ్

image

ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. నూజివీడు పట్టణంలోని ఓ యువతి (18) ఇంటర్ పూర్తిచేసింది. ముఖంపై అవాంఛిత రోమాలు రావడంతో వాటిని బ్లేడుతో తీసివేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకు ఎక్కువగా రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదైంది.

News August 16, 2024

ప.గో.: YSR ఉద్యానవర్సిటీ ఉపకులపతిగా గోపాల్

image

తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెం డా.వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్.కే.గోపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉద్యాన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా గోపాల్ పని చేశారు. ఈ సందర్భంగా ఆయనకు విశ్వవిద్యాలయ అధ్యాపక సిబ్బంది స్వాగతం పలికారు.

News August 15, 2024

ప.గో.: రెండు గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదన 

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామానికి చెందిన బాలిక 14వ తేదీ (నిన్న) రాత్రి కిడ్నాప్‌కు గురైంది. బాలిక తండ్రి పాలకోడేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. రాత్రివేళ బొలెరో వాహనంలో వచ్చి తన కూతురుని కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు రంగంలో దిగారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి పాలకోడేరుకు చెందిన హనుక్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా SP సిబ్బందిని అభినందించారు.

News August 15, 2024

తణుకులో యథేచ్ఛగా చికెన్, మటన్ అమ్మకాలు

image

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జీవహింస చేయరాదని అందుకు మాంసాహారం అమ్మకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయితే కొందరు వ్యాపారులు ఈ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ప్రధాన రోడ్డు అనుకొని పలు చికెన్, మటన్ దుకాణాల్లో గురువారం  విక్రయాలు సాగిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు.

News August 15, 2024

ఏలూరు జిల్లా రైతుకు లక్కీ ఛాన్స్

image

ఏలూరు జిల్లాకు కొయ్యలగూడెంకు చెందిన రైతుకు ఢిల్లీలో ప్రధాని చేతుల మీదుగా జరిగే జాతీయ పతాక ఆవిష్కరణకు అతిథిగా అందింది. ఆదర్శరైతుగా గుర్తింపు పొందిన ఆయన తన కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. సేంద్రియ ఎరువులను వినియోగించి యాంత్రీకరణతో అధిక దిగుబడి సాధించడం, బిందు సేద్యంతో పంటలు పండించడం వంటివి చేశేవారు. దీంతో పీఎం కిసాన్ పథకంలో ఈ వేడుకలకు ఎంపికయ్యారు.

News August 15, 2024

ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా: ప.గో కలెక్టర్‌

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప.గో జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి పిలుపు నిచ్చారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News August 14, 2024

గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టాలి: మంత్రి

image

జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులపై శాసనసభ్యులు, అధికారులతో మంత్రి సమీక్షించారు.

News August 14, 2024

స్నేహానికి ప్రతిరూపం పితాని: మాజీ సీఎం

image

చిరకాల మిత్రుడు, విద్యావేత్త పితాని సూర్యనారాయణ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. పోడూరు మండలం కొమ్ము చిక్కాలలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పితాని సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పితాని సూర్యనారాయణతో ఉన్న స్నేహాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

News August 14, 2024

తణుకులో భారీ అగ్ని ప్రమాదం

image

తణుకు మండలం తేతలిలోని  గౌతమి స్పిన్ టెక్ స్పిన్నింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాటన్ బేళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంటలను అదుపు చేశారు. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ కర్మాగారానికి ఫైర్ అనుమతులు లేనట్లు తెలుస్తోంది.

News August 14, 2024

ఏలూరు వద్ద ప్రమాదం.. ఒకరు మృతి

image

ఏలూరు జిల్లాలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై చోదిమెళ్ల వద్ద బైకును పాల వ్యాను ఢీకొట్టింది. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు, గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.