India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బైక్ అదుపుతప్పి ఓ యువకుడు మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి తణుకు పట్టణంలో జరిగింది. ఉండ్రాజువరం జంక్షన్ సమీపంలో జరుగుతున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా ట్రాఫిక్ మళ్లించేందుకు రోడ్డుకు అడ్డంగా తాడు కట్టారు. అటుగా బైక్‌పై వెళ్తున్న పాలంగికి చెందిన గంగులకుర్తి పూర్ణచంద్ర సాయికుమార్ (22) తాడును గమనించకపోవడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలవడంతో మృతి చెందాడు. కేసు నమోదైంది.
ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ధాన్యం బకాయి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రైతు సంఘం జిల్లా నాయకులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు సమస్యలను మంత్రికి వివరించారు. సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పంట పండించడం కంటే అమ్ముకోవడానికి రైతులు ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వాతావరణ మార్పుల కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనం రోగాల బారిన పడుతున్నారు. భీమవరం, ఆకివీడు, పెనుమంట్ర ప్రాంతాల్లో జ్వర బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. భీమవరం ఆసుపత్రికి రోజుకు దాదాపు 20 మంది వరకు జ్వరంతో వస్తున్నారు. కొందరిలో డెంగీ అనుమానాలు కనిపిస్తున్నాయి. అయితే.. పలు ఆసుపత్రులు దీన్ని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నారు. రూ.వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్నారట.
కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నిడదవోలు మండలం గోపవరంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గోపవరానికి చెందిన మారిశెట్టి మహేశ్వరరావు(30) కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం అతడిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
నీట్ పీజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. తాడేపల్లిగూడెంలోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో ఉదయం, సాయంత్రం నిర్వహించిన పరీక్షలకు 222 మందికి గానూ 216 మంది హాజరైనట్లు ప్రిన్సిపల్ రత్నాకరరావు తెలిపారు. భీమవరం డీఎన్నార్ కళాశాల కేంద్రంలో 173 మందికి గానూ 165 మంది హాజరైనట్లు ప్రిన్సిపల్ జి.మోజెస్ తెలిపారు. ఏలూరులో 492 మంది ఈ పరీక్షలు రాశారు.
థియేటర్‌లో జరిగిన చిన్న గొడవ హత్యాయత్నం వరకు వెళ్లింది. భీమవరంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మురారి రీ-రిలీజ్ సందర్భంగా ఓ థియేటర్‌లో సినిమా చూస్తుండగా హర్షప్రవీణ్- రాహుల్ మధ్య గొడవ జరిగింది. దాన్ని మనుసులో పెట్టుకొని అదే రోజు సాయంత్రం హర్షను రాహుల్ చాక్‌తో పొడిచి పారిపోయాడు. సహచరులు అతడిని ఆసుపత్రికి తరలించగా.. హర్ష ఫిర్యాదు మేరకు కేసు నమోదు SI వీర్రాజు తెలిపారు.
పాలకొల్లు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చూడాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి జల జీవన మిషన్ పనుల ప్రగతిపై సంబంధిత RWS అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
దేవాదాయ శాఖ ఉమ్మడి ప.గో. జిల్లా సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం తణుకులో ఎన్నుకున్నారు. స్థానిక సీతారామాంజనేయస్వామి దేవస్థానంలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా నల్లం రామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా జగదీశ్వరరావు, కార్యదర్శిగా శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిగా నాగేశ్వరరావు, కోశాధికారిగా కుసుమకుమార్, కార్యవర్గ సభ్యులుగా ఎంవీవీఎస్ నందకుమార్, జీవీ రమణ, ఎస్‌కే నబీ, సాంబశివరావు ఎన్నికయ్యారు.
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ను పొగాకు రైతులు ఆదివారం ఘనంగా సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకు పంటకు ఫెనాల్టీ రద్దుచేసేందుకు కృషిచేసిన ఎంపీని అభినందించారు. పంటకు ఫెనాల్టీ రద్దుతో జిల్లాలో సుమారు 15 వేల మంది పొగాకు రైతులు రూ.15 కోట్లు, రాష్ట్రంలో లక్ష మంది పొగాకు రైతులు రూ.110 కోట్లు లబ్ధి పొందామన్నారు. నకిలీ సిగరెట్ల దిగుమతులని అరికట్టాలని కోరారు.
విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఓ సచివాలయ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో నిర్లక్ష్యం వహించినందుకు ప.గో జిల్లా భీమవరంలోని 11వ వార్డు సచివాలయ ఉద్యోగి (ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ) ఎం.రాఘవను సస్పెండ్ చేశారు. ఈ మేరకు పురపాలిక కమిషనర్ శ్యామల ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని ఆమె పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.