India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భీమవరంలోని గరగపర్రు రోడ్డులో శుక్రవారం రాత్రి ఇద్దరు బీటెక్ విద్యార్థులు బైక్‌పై వెళుతూ ఎదురుగా వస్తున్న బైకుని తప్పించిపోయి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన జ్ఞాన సాగర్(21) తలకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఇజ్రాయెల్ శనివారం తెలిపారు. మరో విద్యార్థి సాయి భరత్ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 16347 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా ఉమ్మడి ప.గోలో 1035 కొలువులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎస్ఏ తెలుగు 49, హిందీ 48, ఇంగ్లీష్ 85, మ్యాథ్స్ 45, ఫిజిక్స్ 42, జీవశాస్త్రం 59, సోషల్ 102, పీడీ 185, ఎస్జీటీ 417, ఎస్జీటీ ఉర్దూ 3 పోస్టులున్నాయి.
మార్ఫింగ్ ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కించపరిచే విధంగా వాఖ్యలు చేసిన చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిని శనివారం భీమవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. పట్టణానికి చెందిన పత్తి హరివర్ధన్ ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం సెతేరికి చెందిన చింతలపూడి పవన్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. అతనికి 41 నోటీసు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఉండి పోలీస్ స్టేషన్‌లో గంజాయి అమ్ముతున్న 11 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ జై సూర్య శనివారం తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వారంతా జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో మాదకద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. 25 కేసుల్లో నిందితులుగా ఉన్న 11 మందిని అరెస్టు చేసి 16,500 విలువైన 1650 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
డ్రోన్ కొనుగోలుకు రైతు గ్రూపులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు, డ్రోన్ గ్రూపు సభ్యులు కన్వీనర్, కో కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. డ్రోన్ పైలెట్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డ్రోన్ కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రూ.10 లక్షల రుణం అందిస్తామన్నారు.
ఉండి రాజుల పేటలో ఉంటున్న అగ్ని మాత్రం వరలక్ష్మి మెడలోని 4 కాసుల బంగారు తాడును శనివారం గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. వరలక్ష్మి గత పది సంవత్సరాలుగా ఉండిలో నివాసం ఉంటుంది. శనివారం వేకువజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి డోర్ తీసుకొని వచ్చి అటు ఇటు చూస్తుండగా వరలక్ష్మి ఎవరు అని అడగగా, తన నోరునొక్కి మెడలోని బంగారు తాడును లాక్కెళ్లాడు. పోలీసులు విచారణ చేపట్టారు.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘మధురం’ చిత్ర యూనిట్ ఆచంట మండలం వల్లూరులో సందడి చేసింది. తాను తీసిన మొదటి సినిమాను ప్రేక్షకులు అందరూ విజయవంతం చేయాలని వల్లూరుకు చెందిన హీరో ఉదయ్ రాజ్ కోరారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో మొత్తం షూటింగ్ జరిగిందన్నారు. తనను ఆదరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన అడ్డాల చిన్న (24) భీమవరం రూరల్ మండలంలో లోసరి హైవేపై వ్యాన్ ఢీకొనడంతో తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు చిన్న హైదరాబాదులో జిమ్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడని, బైక్‌పై హైదరాబాద్ నుంచి ప్రత్తిపాడు వెళుతుండగా లోసరిలో ఈ ప్రమాదం సంభవించింది అని తెలిపారు.
మరో కొద్ది రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి ప.గో జిల్లాలో భర్తీ అయ్యే పోస్టులను ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలో 725, మున్సిపల్ యాజమాన్య పాఠశాలకు సంబంధించి 310, ఎస్జీటీ కేడర్‌లో ఉన్న 260 పోస్టులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
షాపులు నిర్వాహకులు రోడ్ల పక్కన చెత్త వేస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం జేసీ భీమవరం పట్టణంలో పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డు పక్కన వ్యాపారస్తులు వద్దకు వెళ్లి చెత్త ఎక్కడ వేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ కవర్లను వాడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.