WestGodavari

News July 11, 2024

భీమవరం: పుణ్య క్షేత్రాల సందర్శనకు ‘భారత్ గౌరవ్’

image

భారతీయ రైల్వే సంస్థ (ఐఆర్సీటీసీ) దేశంలోని పర్యాటక ప్రదేశాలు, పుణ్య క్షేత్రాల సందర్శనకు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పేరుతో ప్రత్యేక రైళ్లు నడుపుతుందని ఏరియా మేనేజర్ ఎం. రాజు తెలిపారు. దీనికి సంబంధించి భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జ్యోతిర్లింగ దివ్య దక్షిణయాత్ర పేరుతో ఆగస్టు 4న ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News July 11, 2024

మృత్యు వారధిగా మారిన చించినాడ బ్రిడ్జి

image

ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించిన చించినాడ బ్రిడ్జి మృత్యు వారధిగా మారింది. నిర్వహణ లోపంతో 24 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన గోతులు పడి తరచు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. వంతెనపై ఎక్కడికక్కడ గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వంతెనపై ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు అలంకార ప్రాయంగా మారాయి. రహదారిని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

News July 11, 2024

తాడేపల్లిగూడెం: 77 ఏళ్ల వృద్ధురాలికి HIV సోకిందని డబ్బు డిమాండ్

image

తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు కంటి ఆసుపత్రిలో కంటి చికిత్సకు వెళ్లిన 77 వృద్ధురాలికి HIV ఉందని సొమ్ము డిమాండ్ చేశారు. ఆమె కంటి సమస్యతో గతనెల 28న ఆసుపత్రికి వెళ్లింది. ఈనెల 9న రక్త పరీక్షలు చేశారు. HIV సోకిందని చికిత్సకు మరో రూ.10వేలు డిమాండ్ చేశారు. నమ్మని కుటుంబీకులు మరో చోట పరీక్షలు చేయిస్తామనగా..మళ్లీ పరీక్షలు చేసి HIVలేదన్నారు.బాధితుల ఫిర్యాదుతో బుధవారం జిల్లా వైద్య సిబ్బంది వివరాలు సేకరించారు.

News July 11, 2024

ఏలూరు: ‘దత్తత తీసుకున్న పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలి’

image

తెలంగాణ రాష్ట్రానికి చెందిన సురేందర్, మహాలక్ష్మి దంపతులకు ఏలూరు శిశు గృహంలో ఆశ్రయం పొందుతున్న 3 నెలల వయస్సు గల మనోజ్ అనే బాబును జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సమక్షంలో దత్తత తల్లిదండ్రులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ నిబంధనల ప్రకారం 2021లో వీరు దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. దత్తత తీసుకున్న పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు.

News July 10, 2024

నిడదవోలు నుంచి విశాఖకు కొత్త సర్వీస్ ప్రారంభం

image

నిడదవోలు ఆర్టీసీ డిపో అభివృద్ధికి దశలవారీగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి విశాఖపట్నానికి నూతన సర్వీసును బుధవారం ఆయన ప్రారంభించారు. గత పాలనలో ఆర్టీసీ డిపో అభివృద్ధి వెనక్కి పోయిందన్నారు. తాము డిపో అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.

News July 10, 2024

ఏలూరులో జులై 11న జాబ్ మేళా

image

జులై 11న ఏలూరు కలెక్టరేట్ వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్థాయి శిక్షణ సంస్థ డీఎల్ సీ, ఐటీఐ సహాయ సంచాలకుడు రవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయ డైరీ ఎదురుగా ఉన్న జిల్లా స్థాయి శిక్షణా కేంద్రంలో ప్రముఖ కంపెనీలు హాజరయ్యే జాబ్ మేళాకు ఐటీఐ ఉత్తీర్ణులై, అప్రెంటిస్ పూర్తి చేసిన అభ్యర్థులు, ఐటీఐ చివరి సంవత్సరం చదువుతున్న ట్రైనీలు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు.

News July 10, 2024

ఆకివీడు: ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక సూసైడ్

image

 ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆకివీడు మండలం ఉప్పరగూడెంకు చెందిన కిరణ్‌ కుమార్‌ ప్రేమపేరుతో వేధిస్తున్నాడని.. దీంతో ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లి ఆరోపించారు. ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

News July 10, 2024

కొవ్వూరు: యువకుడిపై పోక్సో కేసు

image

ఓ బాలికను వరుసకు అన్న అయ్యే యువకుడు వేధిస్తున్న ఘటన కొవ్వూరు పట్టణంలో జరిగింది. ప్రతిరోజూ కళాశాలకు వెళ్లి వస్తున్న సమయంలో వెంట పడి, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మంగళవారం రాత్రి బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు
చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ సాంబశివమూర్తి తెలిపారు.

News July 10, 2024

ఎక్సైజ్ శాఖ మంత్రిని కలిసిన ఏలూరు MP

image

విజయవాడలో రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఏలూరు MP పుట్టా మహేశ్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి మంగళవారం వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలను గురించి చర్చించారు.

News July 9, 2024

ప.గో.: సొమ్ము కోసం హత్య.. 14 రోజుల రిమాండ్

image

ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం శివారులో మృతిచెందిన జానపాముల సత్యవతి (48) కేసులో నిందితుడు చిక్కాల శ్రీనును తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సొమ్ములు కోసం హత్యచేసినట్లు నేరం అంగీకరించడంతో తణుకు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించినట్లు పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం మంగళవారం తెలిపారు. మృతురాలికి చెందిన బంగారు ఆభరణాలు రికవరి చేసినట్లు వివరించారు.