India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో జిల్లా ఖరీఫ్ సీజన్లో రూ.361 కోట్లు పంట రుణాలను రైతులకు అందజేశామని జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సీజన్లో రూ.410 కోట్ల పంట రుణాలు మంజూరు చేయవలసి ఉండగా.. ఇప్పటికే రూ.162 కోట్ల రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. త్వరలోనే మిగిలిన రుణాలను పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
గోపాలపురం మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జగన్నాథపురంలో తారు లోడ్‌తో వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చిన మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీల ముందు భాగాలు పూర్తిగా నుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అతివేగంగా నిర్లక్ష్యంగా లారీ రావడమే ఈ ప్రమాదానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని తెలియాల్సి ఉంది.
ఏలూరు జిల్లాలో డిసెంబర్ 19 నుంచి 24 వరకు నిర్వహించే ప్రభుత్వ సుపరిపాలన వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. గుడ్ గవర్నెన్స్ కార్యక్రమానికి సంబంధించి కలెక్టరేట్ ఆవరణ గోదావరి సమావేశ మందిరంలో వర్క్ షాప్ ఏర్పాటు చేయాలన్నారు. సామాన్యుల సమస్యలకు పరిష్కారం అందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.
నల్లజర్లలోని దూబచర్లలోని రిటైర్డ్ అగ్రికల్చరల్ ఆఫీసర్ కృష్ణమూర్తి నివాసంలో తెల్లవారుజామున నిద్రలో ఉండగా ముగ్గురు ఆగంతకులు మాస్క్ ధరించి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లోని హెల్పర్, యజమానిని చీరతో కట్టేసి, మంచంపై కదల్లేని స్థితిలో ఉన్న మహిళ ఒంటిపై నగలు, బీరువాలో సొమ్ము దోచుకెళ్లారు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టామన్నారు.
గణపవరం మండలం వరదరాజపురం వద్ద బుధవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. తాడేపల్లిగూడెం నుంచి గణపవరం వస్తున్న వ్యాను వరదరాజపురం వద్ద చికెన్ షాపులోకి దూసుకెళ్లింది. ఘటనలో రెండు టూ వీలర్లు నుజ్జు నుజ్జు అయినట్లు తెలుస్తోంది. కాగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తొలుత ఆయన రాకను ఏలూరు నేతలంతా వ్యతిరేకించారు. అయితే అధిష్ఠానం చొరవతో నేతలంతా సర్దుమణిగారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని ఏలూరు MLA బడేటి చంటి సైతం స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే ఏలూరులోని వైసీపీ సీనియర్ నేతలంతా టీడీపీలో చేరారు. ఇప్పుడు ఆళ్లనాని చేరిక అక్కడి రాజకీయాల్లో పెద్ద మలుపు అని విశ్లేషకులు అంటున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన ఘటన రావులపాలెం(M)లో జరిగింది. బాధితురాలి వివరాల మేరకు.. ఝాన్సీ, హరికృష్ణ ప్రేమించుకున్నారు. NOV 10న ఎవరికీ తెలియకుండా ఝాన్సీని హరికృష్ణ పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల హరి తల్లిదండ్రులకు విషయం తెలిసి తాళి తెంచి ఝాన్సీని బయటకు పంపారు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. నిన్న ప్రియుడి ఇంటి వద్ద న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది.
న్యూఢిల్లీ నోయిడాలో సీఆర్‌పీఎఫ్ 100వ బెటాలియన్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లో ASIగా పని చేస్తున్న అత్తిలి గ్రామానికి చెందిన నేలపాటి జ్యోతికుమారి (56) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. ఢిల్లీ నుంచి విమానంలో ఆమె మృతదేహాన్ని గన్నవరం ఎయిర్‌పోర్టుకు సోమవారం ఉదయానికి చేరుకుంది. సీఆర్‌పీఎఫ్ జవాన్లు సైనిక వందనం చేసి ప్రభుత్వ లాంఛనాలతో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఉండి మండలం ఎండగండి గ్రామ రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ముఖాముఖి నిర్వహించారు. ధాన్యం రవాణాలో సమస్యలు ఏమైనా ఉన్నాయా, గోనె సంచులు రైతు సేవాకేంద్రంలో అందిస్తున్నారా, అనే అంశాలపై రైతుల నుంచి ఆరా తీశారు. జిల్లాలో 80 శాతం వరి కోతలు ముగిశాయని, అటు వర్షాల హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తామన్నారు.
పోలీసులపై దాడి చేసిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ రమేశ్ బాబు కథనం మేరకు.. రాజమండ్రిలో శ్రీకాకుళం పోలీసులపై దాడి చేసి.. రాపాక ప్రభాకర్‌ను తీసుకువెళ్లిన నిందితులను అరెస్టు చేశామన్నారు. దాడి చేసిన వారిలో భీమవరానికి చెందిన శ్రీకాంత్, వినోద్, రాజు, మహంకాళి, క్రాంతి, మొగల్తూరుకి చెందిన కామరాజుతో పాటు రాజమండ్రికి చెందిన మరో ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.