India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనుకూల వాతావరణం లేనందు వల్ల ఈ నెల 9న సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా కేఆర్.పురం ఐటీడీఏ పర్యటన రద్దయినట్లు MLA చిర్రి బాలరాజు తెలిపారు. బుట్టాయిగూడెం మండలం ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుందని స్పష్టం చేశారు.
ఉమ్మడి ప.గో. జిల్లా పరిధిలో BSNL 4జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ జీఎం శ్రీను తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మెరుగైన టెలికం సేవల కోసం వినియోగదారులు తమ సిమ్‌లను 4జీ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం 2జీ, 3జీ సిమ్‌లు వినియోగిస్తున్నవారు ఉమ్మడి ప.గో.లో 60 వేల మంది వరకు ఉన్నారని చెప్పారు. వీరికి ఉచితంగా సిమ్‌లు అందజేస్తున్నామని తెలిపారు.
ప.గో. జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం నుంచి భీమవరం మీదుగా తాడేపల్లిగూడెం- నిడదవోలు – విజ్జేశ్వరం మీదుగా కొవ్వూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి DPR పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. పేరుపాలెం బీచ్ నుంచి తాడేపల్లిగూడెం వరకు 2 వరసల రహదారి నిర్మించాలన్నది ప్రజల కోరిక. ఈ రహదారిని జాతీయరహదారిగా గుర్తించి అభివృద్ధి చేస్తే తీరప్రాంత గ్రామాల్లో ఉత్పత్తుల రవాణా సులభతరం కానుంది.
మొగల్తూరు మండలంలోని కేపీపాలెం సౌత్ గ్రామంలో చిట్టీల పేరిట ఘరానా మోసం జరిగింది. గ్రామానికి చెందిన ఎస్.శ్రీనివాస్ నమ్మించి మోసం చేశాడని మంగళవారం పలువురు ఆరోపించారు. సుమారు 150 మంది సభ్యుల నుంచి గత కొన్నేళ్లుగా చిట్టీలు వసూలు చేస్తూ సుమారు రూ.4 కోట్ల మేర ముంచేశాడని బాధితులు వాపోయారు.
భీమవరం MLA పులపర్తి రామాంజనేయులు అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల పలువురు వ్యాపారులు MLAను కలిసి వారి ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. కొందరు అధికారులు లంచాలు ఇవ్వాలంటూ తమను ఇబ్బంది పెడుతున్నారని, లేదంటే వ్యాపారానికి సంబంధించిన వస్తువులను తీసుకెళ్తున్నారని వాపోయారు. దీనిపై స్పందించిన MLA.. ఎవరైనా అధికారులు ఇకపై వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో తాత, అమ్మమ్మ దగ్గర నిద్రిస్తున్న బాలికను గుర్తుతెలియని అగంతకుడు అపహరించి అత్యాచారం చేసిన ఘటనపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎస్పీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని, దోషిని కఠినంగా శిక్షించాలన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో అటవీ ప్రాంతాన్ని పెంచుతామని, అటవీ సంరక్షణ చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ప.గో. జిల్లా కలెక్టర్ నాగరాణి, ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు.
బుట్టాయిగూడెం మండలం కేఆర్ పురం ఐటీడీఏలో పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆర్గనైజింగ్ కమిటీతో సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన తెలిపారు. రూ.లక్ష విరాళం ప్రకటించగా.. టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బోరగం శ్రీనివాసులు రూ.50 వేలు ప్రకటించారు.
కుమారదేవంలోని ‘సినిమా చెట్టు’ ఇకనుంచి ఓ చరిత్ర. కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో ఈ నిద్ర గన్నేరు చెట్టును గోదావరి ఒడ్డున సింగలూరి తాతబ్బాయి నాటినట్లు స్థానికులు చెబుతుంటారు. 150 ఏళ్లుగా ఎన్నో వరదలు, తుఫాన్‌లను తట్టుకుంటూ.. తరతరాల్ని చూసుకుంటూ పెరిగి మహా వృక్షమైంది. షూటింగ్స్ ఎక్కువగా జరగడం వల్ల ‘నిద్ర గన్నేరు’ అనే అసలు పేరును కూడా మర్చిపోయి ‘సినిమా చెట్టు’ అని పిలుస్తారు అక్కడి జనాలు.
ఏలూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. నూజివీడు రూరల్ మండలానికి చెందిన ఐదేళ్ల చిన్నారిని గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేశారు. తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న చిన్నారిని సమీపంలోని పామాయిల్ తోటలోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి పారిపోయారు. బాలికను కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుణ్ని అరెస్ట్ చేసి శిక్షించాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.