India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వినాయక చవితి ఉత్సవాలను పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలు నిషేధించామని, ఊరేగింపులో డీజే సౌండ్ సిస్టం వినియోగించరాదన్నారు.
ప.గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబితా సవరణ, అదనపు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, తదితర అంశాలపై చర్చించారు. గత సంవత్సరం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ స్టేషన్ల నందు ఎక్కువ సమయం పోలింగ్ ను నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఇటువంటి విషయాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళకు రూ. 9లక్షలకుపైగా టోకరా వేసిన ఘటన భీమవరంలో చోటు చేసుకుంది. ఎస్సై రెహ్మాన్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న రాణికి తోటి ఉద్యోగి ప్రసాద్ ప్రభుత్వ హాస్పిటల్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.9 లక్షల్ల నగదును తీసుకొని ముఖం చాటేశాడు. మోసపోయానని తెలుసుకొని బాధితురాలు మంగళవారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి,ఇంటర్ ప్రవేశానికి ఫీజు చెల్లించేందుకు ఈనెల 16 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు అవకాశం ఉందని డీఈఓ నారాయణ తెలిపారు. రూ.200 అపరాద రుసుము 15 సెప్టెంబర్ లోపు చెల్లించాలని అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కంటి చూపు ఎంత ప్రధానమో చూపు తగ్గిన వారు దాని నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉచిత కళ్ల జోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కంటి పరీక్షలు నిర్వహించిన వారికి కంటె అద్దాలు అందజేశారు. కంటిచూపు పోతే తిరిగి పొందలేం అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
చించినాడ వంతెన మరమ్మతుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను ఆగస్టు 21 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో సాయంత్రం 7 గంటల వరకు ఉన్న ట్రాఫిక్ బ్లాక్ సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పొడిగించామన్నారు. ప్రజలు ఈ ఆంక్షలకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి 10వ వరకు ఒరిస్సాలోని చిలుక నేవల్ బేస్లో నరసాపురం ఆంధ్రా యూనిట్ ఆధ్వర్యంలో సైలింగ్ బోటింగ్ సాహస యాత్రను నిర్వహించనున్నారు. ఈ యాత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది క్యాడెట్లు పాల్గొనన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను యూనిట్ కమాండర్ సంజిత్ రౌత్రే, డిప్యూటీ క్యాంపు కమాండర్ అనిల్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలోని కల్లుగీత కార్మికులకు కొత్తగా మంజూరైన 3 బార్లకు కులాల వారి రిజర్వేషన్ ప్రక్రియను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో కల్లు గీత కార్మికులకు కేటాయించిన బార్ల ఎంపిక రిజర్వేషన్ ప్రక్రియను లాటరీ తీసి ఎంపిక చేశారు. శెట్టి బలిజలకు -2, గౌడ – 1ను భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో కేటాయించడం జరిగిందన్నారు.
ఆకివీడుమండలం దుంపగడప వీవీ గిరి ప్రభుత్వ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ, కలెక్టర్ నాగరాణీలు శంకుస్థాపన చేసారు. భారత జీవిత భీమా సంస్థ సామాజిక బాధ్యత విభాగం గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ వీవీ.గిరి ప్రభుత్వ కళాశాలకు ఎక్స్టెన్షన్ బ్లాక్ నిర్మాణానికి రూ. 1.06 కోట్లు నిధులు ఇచ్చారు. విద్యాసంస్థల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పనతో బలోపేతానికి ఐసీడీఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 489 అంగన్వాడీలకు ఒక్కొక్క అంగన్వాడికి రూ.16 వేలు చొప్పున కేటాయించిన నిధులతో గుర్తించిన పనులను పూర్తి చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.