India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప సెంట్రల్ జైలు పూర్వ అధికారులు ప్రకాష్, జవహర్ బాబు, డాక్టర్ పుష్పలతలపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ క్యాంపుల పేరుతో ఖైదీలను బెదిరించిన ఘటనలకు బాధ్యులైన వారిపై విచారణ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం GO ఇచ్చింది. కర్నూల్ SP విక్రాంత్ పాటిల్, కడప DMHO డాక్టర్ నాగరాజు, జైళ్లశాఖ అధికారి ఇర్ఫాన్, RDO ఇర్విన్ విచారణాధికారులుగా వ్యవహరించనున్నారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. పులివెందులలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీనికి అనుసంధానం చేసి సీసీ కెమెరాల ఫుటేజీని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం పరిశీలించారు. తుమ్మలపల్లి, నల్లపురెడ్డిపల్లి, కొత్త మాధవరం, ఒంటిమిట్ట ప్రాంతాల పోలింగ్ సరళిని ఇక్కడినే వీక్షించి పోలీసులకు పలు సూచనలు చేశారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటలకు పులివెందులలో 71.36శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 7,565 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో 66.39శాతం ఓటింగ్ జరగ్గా.. 24, 606 ఓట్లకు 16,336 ఓట్లు పోలయ్యాయి. 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంటకు పులివెందులలో 62.26 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 10,601 ఓట్లు ఉండగా.. ఇప్పటి వరకు 6,600 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో 55.06 శాతం మంది ఓటు వేశారు. 24, 606 ఓట్లకు గాను ఇప్పటి వరకు 13, 549 ఓట్లు పోలయ్యాయి.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీధర్ ప్రజలను కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగబోయే పోలింగ్‌లో ప్రతి ఒక్క ఓటరూ ముందుకు వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే అధికారులను సంప్రదించాలన్నారు.
వినాయక ఉత్సవాల నేపథ్యంలో మట్టి విగ్రహాలను పూజించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కడప కార్పొరేషన్ కార్యాలయంలో CPM కార్మిక అనుబంధ సంఘాల నేతలు మట్టి వినాయక విగ్రహాల గోడ పత్రాలను రూపొందించగా వాటిని కమీషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలనే పూజించాలన్నారు. కార్మికులు ఇలాంటి కార్యక్రమాలకు ముందుకురావడం అభినందనీయమన్నారు.
కడప జిల్లాలోని 10 AMCలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.11.99 కోట్లు ఆదాయాన్ని ఆర్జించాయి. కడప AMC నుంచి రూ.1.61 కోట్లు, ప్రొద్దుటూరు రూ.1.74 కోట్లు, బద్వేల్ రూ.2.05 కోట్లు, జమ్మలమడుగు రూ.1.04 కోట్లు, పులివెందుల రూ.98 లక్షలు ఆదాయం వచ్చింది. మైదుకూరు రూ.2.26 కోట్లు, కమలాపురం రూ.86.80 లక్షలు, సిద్దవటం రూ.28.20 లక్షలు, ఎర్రగుంట్ల రూ.71.83 లక్షలు, సింహాద్రిపురం రూ.16.78 లక్షలు ఆదాయాన్ని ఆర్జించాయి.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే తాట తీస్తామని ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. నాయకులు ఎవరూ గ్రామాల్లో తిరగరాదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. 12వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని జలాశయాలు నీటినిల్వతో కళకళ లాడుతున్నాయి. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను కడప జిల్లాకు వదులుతున్నారు. దీంతో ప్రస్తుతం గండికోటలో 18.57 TMCలు, మైలవరంలో 5.48, బ్రహ్మసాగర్‌లో 6.32, బద్వేల్ ట్యాంక్‌లో 0.01, CBCలో 4.41, పైడిపాలెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 4.46, సర్వరాజ సాగర్‌లో 1, వామికొండ సాగర్‌లో 0.79, బుగ్గవంకలో 0.04 TMCల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆగస్టు 12న పులివెందుల, ఒంటిమిట్టలో ZPTC ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం కడపలో వారు మాట్లాడారు. క్రిటికల్ స్టేషన్లలో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు ఏర్పాటు చేశామన్నారు. 13 చెక్‌పోస్టులు, డ్రోన్లు, వజ్రా వెహికల్స్‌తో భద్రత కల్పించామన్నారు. హింసాత్మక చర్యలపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.