India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లా మైలవరం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదుగురు యువకులు గాలి మరల రిపేర్ పనుల కోసం వచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అందులో మహ్మద్ అలీ(35) అనే యువకుడు 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. అత్యాచార యత్నం చేయడంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కడప జిల్లాలో ఆదివారం వినాయక నిమజ్జనం చేసి తిరుగు ప్రయాణం చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చక్రాయపేట మండలం మహాదేవపల్లె వాసులు గ్రామంలో గణనాథుని ఊరేగించి సమీప చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మంత్రి లోకేశ్ సెప్టెంబర్ 2న కమలాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ సందర్భంగా ఆయన కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ను సందర్శిస్తారని వారు తెలిపారు. కొప్పర్తికి త్వరలో మరిన్ని పరిశ్రమలు రానున్నాయని, ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వారు తెలిపారు.

కడప జిల్లాలో మూడు రోజులపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించానున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ మధ్యాహ్నానికి పులివెందుల చేరుకోనున్న జగన్, రెండో తేదీ ఉదయం తన తండ్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలలో నివాళులర్పిస్తారు. అనంతరం లింగాల మండలం అంబకంపల్లి చేరుకొని జలహారతిలో పాల్గొంటారు. పులివెందుల చెరుకుని రాత్రికి బస చేసి మూడవ తేదీ ఉదయం అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

కడప జిల్లాలో మూడు ప్రాంతాల్లోనే రేపటి నుంచి కొత్త బార్లు ఏర్పాటు కానున్నాయి. కడపలో 8, ప్రొద్దుటూరులో 5, బద్వేల్‌లో 1 కొత్త బార్లు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలోని మిగతా బార్లను నేటి అర్ధరాత్రి నుంచి క్లోజ్ కానున్నాయి. నూతన బార్ పాలసీ మేరకు జిల్లాలో జనరల్ కేటగిరిలో 27, గీత కులాల కేటగిరీలో 2, మొత్తం 29 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. 14 వాటికే దరఖాస్తులు రాగా వాటిని డ్రా ద్వారా అధికారులు కేటాయించారు.

చౌకా దుకాణాల ద్వారా సెప్టెంబరు నుంచి లబ్ధిదారులకు ఉచితంగా జొన్నలు అందించనున్నట్లు జేసీ అతిథి సింగ్ శనివారం తెలిపారు. బియ్యం కార్డులో ముగ్గరు సభ్యులు కన్నా తక్కువ ఉంటే ఒక కిలో మాత్రమే ఇస్తామన్నారు. సభ్యులు ఎక్కువ ఉంటే రెండు కిలోలు జొన్నలు బియ్యానికి బదులుగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంత్యోదయ, అన్నయోజన వారు కూడా అర్హులన్నారు.

బద్వేల్ నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్ బసవి రమేశ్ ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. కాగా కొద్దిసేపటి క్రితం అతను మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అంతకుముందు ఆయన అనారోగ్య పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. అనంతరం చికిత్స కోసం రూ.2 లక్షల సాయం చేశారు. అతని మృతి బాధాకరమని కార్యకర్తలు అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నం మృతి చెందారు. హైదరాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు & కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబీకులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో సెప్టెంబర్ 1, 2 వ తేదీలలో పర్యటించనున్నారు. లింగాలలోని అంబకబల్లె గ్రామంలో స్థానికులతో సమావేశమై సమస్యలు తెలుసుకోనున్నారు. కార్యకర్తలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.

బ్రహ్మంగారిమఠంలోని జగద్గురు శ్రీ మద్వివిరాట్ పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని శుక్రవారం పుష్ప సినిమా నటుడు కేశవ దర్శించుకున్నారు. ఆయనకు మఠం యాజమాన్యం ప్రత్యేక స్వాగతం పలికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన దర్శనానికి రావడంతో అభిమానులు సెల్ఫీలు దిగారు.
Sorry, no posts matched your criteria.