India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాకు నీతి ఆయోగ్ అత్యుత్తమ పురస్కారం లభించింది. ఆకాంక్షిత జిల్లాలలో అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు కడప జిల్లాకు కేంద్ర ప్రభుత్వం “నీతీ ఆయోగ్” ద్వారా అత్యుత్తమ పురస్కారంతో రూ. 3 కోట్లను కేటాయించిందని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి శుక్రవారం తెలిపారు. జిల్లాలో ఆర్థిక పరిపుష్టి, నైపుణ్య అభివృద్ధి అనే అంశాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఈ పురస్కారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
కడప జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు పబ్లిక్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి పూర్తి బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో పనిచేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో బద్వేల్, కడప రెవెన్యూ డివిజన్ల పరిధిలోని రెవెన్యూ అధికారులకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన చట్టాలపై సిబ్బందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.
పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. శుక్రవారం కడపలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న కేసులపై నిశితంగా సమీక్ష జరిపి పోలీస అధికారులకు పలు సూచనలు చేశారు.
దామోదరం సంజీవయ్య యావత్ భారత దేశానికే ఆదర్శం అని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కడప కలెక్టరేట్‌లో దామోదరం సంజీవయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ, నిరడంబర నేత దామోదరం సంజీవయ్య అని కొనియాడారు.
నిజాయితీకి, నిరాడంబరత్వానికి, విలువలకు మారుపేరైన మహనీయుడు శ్రీ దామోదరం సంజీవయ్య అని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కొనియాడారు. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు
కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్లం మండివీధిలో గురువారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. తన భార్య జమీల భాను(32) తలపై భర్త ఇమ్రాన్ సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. వీరికి ముగ్గురు సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే కారణమని.. ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది. ఘటనా స్థలంలో కడప టూ టౌన్ సీఐ బి. నాగార్జున, ఎస్సై ఎస్.కె.ఎం హుస్సేన్ తమ సిబ్బందితో కలిసి విచారిస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కడపకు రానున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి వివాహ వేడుకలకు జగన్ రానున్నారు. ఉదయం 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకుని రోడ్డు మార్గాన నగర శివారులోని మేడా ఫంక్షన్ హాల్‌కు వెళ్తారు. నూతన వధూవరులను ఆశీర్వదించి తిరిగి 11.30 గంటలకు కడప నుంచి బెంగళూరుకు బయల్దేరి వెళ్లనున్నారు.
శ్రీ వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా పులివెందుల పట్టణంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం స్వామివారికి స్నపన తిరు మంజనసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారికి చక్రస్నానం చేయించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉత్తమ చదువులతో అత్యున్నత స్థానాలకు చేరుకొని సమాజంలో ఆదర్శంగా నిలవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు గురువారం ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని అత్యున్నత స్థానాలకు చేరుకోవాలని, సమాజంలో నలుగురికి ఆదర్శంగా నిలిచి మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
Sorry, no posts matched your criteria.