India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర మంత్రుల బృందం సోమవారం ఒంటిమిట్టకు వస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత, మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒంటిమిట్టలో కోదండ రామునికి పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అనంతరం మహానాడు ఏర్పాట్లను పరిశీలిస్తారని చెప్పారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం శ్రీరామ నవమి రోజు ధ్వజారోహణం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వేడుక నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలి వచ్చి కార్యక్రమాన్ని తిలకించారు.
మైనర్ బాలికను మోసంచేసి పిల్లలు కలిగేలా చేసిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు బీ కొత్తకోట సీఐ జీవన్ గంగానాథ బాబు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామంలోని వ్యక్తి మాయమాటలతో లొంగదీసుకుని గర్భం దాల్చేలా చేసినట్లు చెప్పారు. అనంతరం ఆమెను తీసుకెళ్లి కర్ణాటకలో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించడంతో అక్కడి పోలీసులు, బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే సీతారామలక్ష్మణ మూర్తులను అర్చకులు పట్టు వస్త్రాలు పుష్పాలతో సుందరంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉదయం 9-30 గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.
సిద్దవటం మండలంలోని ముమ్మడిగుంటపల్లిలో శనివారం విషాదం నెలకొంది. గ్రామస్థుల వివరాల ప్రకారం వ్యవసాయ పొలాల్లోని బావిలో శనివారం ఈతకొడుతూ 10వ తరగతి విద్యార్థి తమ్మిశెట్టి శ్రీనివాసులు మృతి చెందాడు. ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లికి చెందిన తమ్మిశెట్టి శ్రీనివాసులు స్నేహితులతో కలిసి ముమ్మడిగుంటపల్లి వ్యవసాయ పొలాల్లోని బావిలో ఈతకొడుతూ బయటకు రాగానే ఫిట్స్ వచ్చి మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.
కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన నాగరాజు అరుదైన అవకాశాన్ని కైవసం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కూటమి ప్రభుత్వం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌లను ప్రకటించింది. అందులో 31 టీడీపీ, 6 జనసేన, బీజేపీకి ఒకటి కేటాయించింది. ఇందులో బీజేపీ తరఫున యర్రగుంట్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా రామిరెడ్డికి ఈ అవకాశం లభించింది. దీంతో ఆయనకు బీజేపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపాయి.
కడప జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడించారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమానికి జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కడప జిల్లా పరిధిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ యాజమాన్యాల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఇతర కేటగిరి నుంచి పాఠశాల సహాయకులుగా పదోన్నతి పొందడానికి సీనియార్టీ జాబితాను రూపొందించినట్లు DEO షేక్ శంషుద్దీన్ తెలిపారు. సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాత పూర్వకంగా ఆధారాలతో సంప్రదించాలని సూచించారు.
కడప జిల్లా పరిధిలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు తమ పేర్లు ఈ శ్రమ్ పోర్టల్ నందు పేర్లు నమోదు చేసుకోవాలి అని ఉప కమిషనర్ శ్రీకాంత్ నాయక్ పేర్కొన్నారు. ఈ శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకొనుటకు ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలని సూచించారు. 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల వారు అర్హులని తెలిపారు.
మైదుకూరు నుంచి కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌కు నీరు సరఫరా చేసే పైపులైన్ పనుల్లో కాజీపేట రావులపల్లె చెరువులో పాత మృతదేహాలు వెలికితీయడం కలకలం రేపింది. శ్మశానం లేక చెరువులో పూడ్చిన మృతదేహాలు బయటపడడంతో దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆరోపించారు. శ్మశానం నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో.. విమర్శిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.