India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరికాసేపట్లో కడపకు రానున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో కడపకు రానున్నారు. పర్యటనలో భాగంగా పెండ్లిమర్రి మండలంలోని మాచునూరుతో పాటు మరో గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన పులివెందులలోని ఆయన నివాసానికి చేరుకుంటారు.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే పెన్షన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. కడప నగరంలోని నాగరాజు పేటలో జిల్లా కలెక్టర్ శివశంకర్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. జిల్లా వ్యాప్తంగా నేడు 2,63,283 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి రూ.112.22 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 100శాతం ఫించన్లను నేడే అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పంపిణీ ప్రక్రియను జిల్లాలో నిర్దేశించిన బుకింగ్ కేంద్రాల్లో సజావుగా చేపడుతున్నట్లు కడప కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని స్టాక్ యార్డుల వద్ద ఇసుక పంపిణీ, వినియోగదారుల సంతృప్తి, రవాణా పై.. రాష్ట్ర మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప నుంచి కలెక్టర్ పాల్గొన్నారు.
వైసీపీ అధినేత జగన్ రేపు కడప జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను జగన్ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ తెలిపారు. బెంగళూరు నుంచి కడపకు ఆయన హెలికాఫ్టర్ ద్వారా చేరుకుని, రోడ్డు మార్గన పెండ్లిమర్రి మండలం మాచనూరుకు వెళ్లనున్నారు. ఇటీవల మృతి చెందిన మండల అధ్యక్షుడు మాచనూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. జిల్లాలో జగన్ మూడు రోజులు పర్యటించనున్నట్లు తెలిపారు.
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లుగా IASలను నియమించింది. కడప జిల్లాకు ఏపీ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు(2011)ను నియమించారు. అన్నమయ్య జిల్లాకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్యకుమారి IAS(2008)ని కేటాయించింది.
సీఎం చంద్రబాబును సచివాలయంలో శుక్రవారం రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. రోడ్లు, రైల్వే కోడూరు ఆర్టీసీ బస్టాండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కోడూరు నుంచి వెంకటగిరి రోడ్డు, గాలేరు-నగరి కాలువ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు.
కడప జిల్లా వ్యాప్తంగా రేపు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. 1వ తేదీన ఆదివారం అవడంతో ముందు రోజునే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. వంద శాతం పింఛన్ పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు
మైదుకూరు పట్టణానికి చెందిన జర్నలిస్ట్ నాగ శివారెడ్డి రెండో కుమార్తె మానస రెడ్డి 86 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా నాగశివారెడ్డి మాట్లాడుతూ.. అమెరికాలో ఎం.యస్ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. భారీ వేతనంతో మానస ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందిస్తున్నారు.
సెప్టెంబరు నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ నెల 31వ తేదీన పంపిణీ చేయనున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సెప్టెంబరు 1న ఆదివారం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 31వ తేదీన పెన్షన్లు అందకపోతే సెప్టెంబరు 2వ తేదీన పింఛన్లు అందజేస్తామన్నారు. 2 వ తేదీ తర్వాత పింఛన్లు అందవని, కావున పింఛనర్లు ఈ నెల 31న గ్రామాల్లో అందుబాటులో ఉండాలన్నారు.
కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేయర్ సురేష్ బాబు ఇంట్లోకి చెత్త వేసేందుకు టీడీపీ కార్యకర్తలను ప్రోత్సహించాడనే ఫిర్యాదు మేరకు కడపలోని ఓ టీవీ ఛానల్ రిపోర్టర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తేజమూర్తి తెలిపారు. ఈనెల 27న మేయర్ ఇంటి ముందు చేసిన ఆందోళనకు సంబంధించి మేయర్ ఫిర్యాదు మేరకు టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు తిరుమలేష్‌తో పాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.