news

News April 11, 2025

రేపు సెలవు రద్దు

image

AP: రేపు (రెండో శనివారం) సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు రద్దు చేసింది. ఏప్రిల్ 12ను వర్కింగ్ డేగా ప్రకటిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ మెమో జారీ చేసింది. రేపు ఉ.11 గం. నుంచి సా.5.30 వరకు ఆఫీసులు పని చేయనున్నాయి. హాలిడే సమయాల్లో రూ.5వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే రేపు మాత్రం రూ.5వేలు తీసుకోకుండానే రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది.

News April 11, 2025

కవితపై జనసేన నేత పృథ్వీ ఫైర్

image

పవన్ కళ్యాణ్‌ సీరియస్ పొలిటీషియన్ కాదని, దురదృష్టవశాత్తు <<16050257>>ఆంధ్రప్రదేశ్<<>> Dy.CM అయ్యారన్న MLC కవిత వ్యాఖ్యలపై జనసైనికులు భగ్గుమంటున్నారు. సోషల్ మీడియాలో కౌంటర్ అటాక్ మెుదలుపెట్టారు. ‘పొలిటికల్ సీరియస్ గురించి మేడం మాట్లాడటం బాగుంది. ఇచ్చిన శాఖకు 200% న్యాయం చేసిన ఆయనెక్కడ, పదవి అడ్డుపెట్టుకుని మద్యం కుంభకోణం చేసిన మీరెక్కడ’ అంటూ జనసేన నేత పృథ్వీ ట్వీట్ చేశారు.

News April 11, 2025

తత్కాల్ బుకింగ్ టైమింగ్స్‌పై IRCTC క్లారిటీ

image

రైల్వేలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్స్ మార్చారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని IRCTC స్పష్టం చేసింది. టికెట్ల బుకింగ్‌కు సంబంధించి టైమింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది. ట్రైన్ బయలుదేరే ముందు రోజు తత్కాల్ బుకింగ్ చేసుకునేవారికి ఏసీకి సంబంధించి ఉ.10 గంటలకు, నాన్ ఏసీ క్లాస్‌కు సంబంధించిన ఉ.11 గంటలకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

News April 11, 2025

టీవీల్లోకి బ్లాక్ బస్టర్ సినిమా

image

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈనెల 13, 14 తేదీల్లో దక్షిణాది భాషల్లో ప్రసారం కానుంది. ఈనెల 13న తెలుగులో స్టార్ మా (5.30pm), మలయాళంలో ఆసియా నెట్ (6.30pm), కన్నడలో కలర్స్ కన్నడ (7pm), 14న తమిళంలో స్టార్ విజయ్ (3pm) టీవీ ఛానల్‌లో రానుంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1800కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.

News April 11, 2025

గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యం కుదింపు

image

TG: యాదాద్రి(D) గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 TMCల నుంచి 1.41 TMCలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.575.56 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా అప్పటి BRS ప్రభుత్వం గంధమల్ల వద్ద 9.86 TMCలతో రిజర్వాయర్ నిర్మించాలనుకుంది. ముంపునకు గురయ్యే 5 గ్రామాల నుంచి వ్యతిరేకత రావడంతో 4.28 TMCలకు కుదించింది. తాజాగా INC సర్కార్ 1.41 TMCలకు పరిమితం చేసింది.

News April 11, 2025

జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు: అమిత్‌షా

image

తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి కోసం ఒకే నామినేషన్ దాఖలైనట్లు కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అన్నామలై సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని తెలిపారు. ప్రధాని మోదీ విధానాలను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లడంలో అన్నామలై భాగస్వామ్యం విలువైనవని పేర్కొన్నారు. కాగా ఒకే నామినేషన్ దాఖలు కావడంతో రేపు నైనార్ నాగేంద్రన్‌‌ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశముంది.

News April 11, 2025

నిఖితను చంపింది తల్లే.. వీడిన మిస్టరీ

image

AP: తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన బాలిక <<16045416>>నిఖిత(17)<<>> అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి సుజాత ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. అనంతరం గంటల వ్యవధిలోనే నిఖితకు అంత్యక్రియలు జరిపారు. వేరే కులానికి చెందిన అజయ్ అనే యువకుడిని నిఖిత ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఇది తెలిసి పేరెంట్స్ ఆమెను మందలించి, అబార్షన్ చేయించారు.

News April 11, 2025

స్టాక్ మార్కెట్లకు 2 రోజులు సెలవులు

image

వచ్చేవారం స్టాక్ మార్కెట్లు మూడు రోజులే నడవనున్నాయి. రెండు రోజులు సెలవులు ఉంటాయి. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లు తెరుచుకోవు. మంగళ, బుధ, గురువారం వర్కింగ్ డేస్ కాగా గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని శుక్రవారం హాలిడే ఉండనుంది. శని, ఆదివారం యథావిధిగా వారాంతపు సెలవులు కొనసాగనున్నాయి. కాగా ఇవాళ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసిన <<16065141>>విషయం<<>> తెలిసిందే.

News April 11, 2025

GREAT: సో‘హిట్’ కావాలి

image

MPలోని జబల్పూర్‌కు చెందిన 11ఏళ్ల ఆర్చర్ సోహిత్ కుమార్ అండర్-15 జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో 720 పాయింట్లకు 710 పాయింట్లు సాధించి నేషనల్ రికార్డు సృష్టించారు. ఆయన తండ్రికి ఓ కాలు లేదు. చేతికర్రలు, తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తండ్రి కష్టాలను అధిగమిస్తుంటే, ఆ కష్టానికి ప్రతిఫలంగా సోహిత్ ఆర్చరీలో రికార్డులు నెలకొల్పుతున్నారు. 2028ఒలింపిక్స్ లక్ష్యం అంటున్నారు.

News April 11, 2025

రోజంతా నగ్నంగా పాప్ సింగర్

image

హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ బీచ్‌లో రోజంతా నగ్నంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో తెలియజేశారు. ఎండవేడికి ఆమె చర్మం ప్రభావితమైనట్లు ఫొటోలో తెలుస్తోంది. కాగా గత ఏడాది స్వీయ వివాహం చేసుకొని ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న బ్రిట్నీ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు.