news

News April 10, 2025

ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికాను వీడాలంటే ఆందోళన

image

వలసదారులపై US అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న కఠిన వైఖరితో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం అమెరికాను విడిచి వెళ్తే తిరిగి రాలేమన్న భావన చాలా మందిలో ఉంది. స్వదేశం వెళ్దామనుకున్న చాలామంది భారతీయులు ఆ భయంతోనే ఇండియాకు రావాలంటే జంకుతున్నారు. అటు అక్కడి వీసా ఉన్న ఉద్యోగులు US వెలుపల ప్రయాణాలు పెట్టుకోవద్దని అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి సంస్థలు అలర్ట్ చేశాయి.

News April 10, 2025

BREAKING: రికార్డు స్థాయిలో పెరిగిన గోల్డ్ రేట్

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ రికార్డు స్థాయిలో పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ.2,700 పెరగడంతో రూ.85,600కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,940 పెరిగి రూ.93,380 పలుకుతోంది. ఈ మధ్యకాలంలో ఒకేసారి ఇంత రేటు పెరగడం ఇదే తొలిసారి. ఇక కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.1,04,000కు చేరింది.

News April 10, 2025

YS భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు.. వైసీపీ తీవ్ర ఆగ్రహం

image

AP: మాజీ సీఎం జగన్ సతీమణి భారతీరెడ్డిపై టీడీపీ సానుభూతి పరుడు చేబ్రోలు కిరణ్ <>అసభ్యకర వ్యాఖ్యలు<<>> చేయడంపై వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇలాంటి దూషణలు ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని దుయ్యబట్టింది. రాజకీయ విద్వేషాన్ని మించి ఈ వ్యాఖ్యలు ఉన్నాయంది. వెంటనే అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. కాగా తాను తప్పు చేశానని, భారతి కాళ్ల మీద పడి క్షమాపణ కోరుతానని కిరణ్ మరో వీడియో రిలీజ్ చేశాడు.

News April 10, 2025

YS జగన్‌పై ఫిర్యాదులు

image

AP: టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే పోలీసుల బట్టలూడదీసి నిలబెడతానంటూ YCP అధినేత, మాజీ సీఎం YS జగన్ చేసిన <<16030703>>వ్యాఖ్యలపై <<>> తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన జగన్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ నేతలు విశాఖ గాజువాక పీఎస్‌తో పాటు పీఎం పాలెం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

News April 10, 2025

3 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

image

AP: తిరుమలలో నేటి నుంచి 12వ తేదీ వరకూ శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. సాలకట్ల వసంతోత్సవాలు ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ముగిసేటట్లుగా నిర్వహిస్తారు.

News April 10, 2025

రేపు ఓటీటీలోకి ‘కోర్ట్’ మూవీ

image

చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ మూవీ రేపు ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, రోహిణి, ప్రియదర్శి, హర్ష్ రోషణ్, శ్రీదేవి, హర్షవర్ధన్, సాయి కుమార్, సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని హీరో నాని నిర్మించడం విశేషం.

News April 10, 2025

BIG NEWS: ఒలింపిక్స్‌లో T20 ఫార్మాట్‌ క్రికెట్

image

లాస్ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్‌లో T20 ఫార్మాట్‌లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో 6 టీమ్స్ చొప్పున పాల్గొంటాయి. ఒక్కో జట్టు నుంచి 15 మంది చొప్పున 90మంది క్రికెటర్లకు అనుమతినిస్తూ IOC నిర్ణయం తీసుకుంది. T20 ర్యాంకింగ్స్‌లో టాప్-6 జట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. చివరిసారిగా 1900 పారిస్ ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది.

News April 10, 2025

స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

image

TG: ఈ నెల 24 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించింది.

News April 10, 2025

టెంపుల్ సిటీలో వేద పాఠశాల నిర్మాణం

image

TG: యాదాద్రి టెంపుల్ సిటీలో వేద పాఠశాల నిర్మాణానికి రూ.23.78 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అదే విధంగా 15 ఎకరాల స్థలం కేటాయించింది. సాంస్కృతిక పాఠశాలను సైతం టెంపుల్ సిటీలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి వేద పాఠశాల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం రాయగిరిలో వేద పాఠశాల నిర్మాణం చేపట్టాలని భావించగా సాధ్యపడలేదు.

News April 10, 2025

ఇవాళ YIPSను ప్రారంభించనున్న సీఎం

image

TG: HYD శివారు మంచిరేవులలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌(YIPS)ను సీఎం రేవంత్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఇందులో పోలీసులు, అమరవీరులు, హోంగార్డుల పిల్లలకు 50 శాతం, సాధారణ పౌరుల పిల్లలకు 50 శాతం సీట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం 200 సీట్లు ఉండగా, భవిష్యత్తులో 5వేలకు పెంచుతారు. అలాగే 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 1,750 పడకలతో హాస్టల్‌ను నిర్మిస్తారు.