India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జూన్‌కు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 టికెట్) కోటా, వసతి టికెట్ల కోటా విడుదల తేదీని ప్రకటించింది. రేపు ఉదయం 10గంటల నుంచి దర్శనం టికెట్లు, రేపు మధ్యాహ్నం 3గంటల నుంచి వసతి టికెట్ల బుకింగ్‌ను ఓపెన్ చేయనుంది. ముందుగా రూ.300 టికెట్లు లేదా ఇతర దర్శనం టికెట్లు పొందినవారికి మాత్రమే వసతి గదుల బుకింగ్ సదుపాయం లభిస్తుంది.

TG: బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు పెంచి, దక్షిణాదిలో తగ్గించే కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ మెడలు వంచైనా ఇక్కడ సీట్లు పెంచుకుంటామని చెప్పారు. ‘డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సౌత్ స్టేట్స్ ఏం తప్పు చేశాయి? జనాభా నియంత్రణ పాటించినందుకా ఈ శిక్ష? దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం’ అని ఆయన ఫైర్ అయ్యారు.

IPL 2025 సీజన్‌లో RCBకి తొలి గెలుపు అందించిన కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడారు. ‘టోర్నీలో ఇలాగే గెలుచుకుంటూ పోతే టైటిల్ మాదే. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కావడంతో కొంత ఒత్తిడికి గురయ్యా. కోహ్లీలాంటి ఆటగాడు జట్టులో ఉండటం అదృష్టం. అతడు క్రీజులో ఉంటే కెప్టెన్ పని సులువవుతుంది. విరాట్ నుంచి నేర్చుకునేందుకు ఇది నాకు ఓ గొప్ప అవకాశం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా KKRతో మ్యాచులో పాటీదార్ 34 పరుగులు చేశారు.

భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్ గురు.. ఈ మూడు పేర్లు వింటేనే భారతీయుడి ఒళ్లు పౌరుషంతో పులకరిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వ పునాదుల్ని కదిలించడంలో ఈ అమరులది మరచిపోలేని పాత్ర. 1928, డిసెంబరు 17న బ్రిటిష్ అధికారి శాండర్స్ హత్య, పార్లమెంటుపై బాంబుదాడి ఆరోపణలపై ముగ్గుర్నీ 1931, మార్చి 23న బ్రిటిషర్లు ఉరి తీశారు. ఆ అమరుల త్యాగాలకు గుర్తుగా షహీద్ దివస్‌ను భారత్ ఏటా మార్చి 23న జరుపుకుంటోంది.

AP: తనపై నమోదైన ఏసీబీ కేసుపై మాజీ మంత్రి, వైసీపీ నేత <<15855614>>విడదల రజిని <<>>స్పందించారు. ‘నాపై కూటమి సర్కార్ కక్ష గట్టింది. అందుకే ఆధారాలు లేకుండా కేసులు పెడుతోంది. ఒక బీసీ మహిళ రాజకీయంగా ఎదగడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి కేసులకు భయపడను. న్యాయ పోరాటం చేస్తా’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఓ క్రషర్ స్టోన్ యజమానిని బెదిరించిన కేసులో రజినిపై ఏసీబీ కేసు పెట్టిన విషయం తెలిసిందే.

TG: రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా చిరువ్యాపారాలు చేసే ఈబీసీలకు ప్రభుత్వం 100% రాయితీతో రూ.50వేల రుణం అందిస్తోంది. రూ.లక్షలోపు రుణాలకు 90% రాయితీ ఇవ్వనుంది. ఓ లబ్ధిదారుడు రూ.లక్ష తీసుకుంటే కేవలం రూ.10వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక రూ.లక్ష నుంచి రూ.2లక్షల్లోపు రుణాలకు 80శాతం, రూ.2-4లక్షల్లోపు రుణాలకు 70శాతం రాయితీ ఇవ్వనుంది. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
వెబ్‌సైట్:<

TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 22లోగా సమాధానం ఇవ్వాలని తొలుత ఆయనకు ఆదేశాలు ఇవ్వగా స్పందించలేదు. దీంతో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను BRS కోరినా ఫలితం లేకపోవడంతో ఆ పార్టీ SCని ఆశ్రయించింది. ఈనెల 25న ఈ కేసును ధర్మాసనం విచారించనుంది.

తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నీటి సీసాలకు బదులు గాజు సీసాలను విక్రయిస్తున్నారు. భక్తులు ఆ సీసాలను వాడాక విసిరేస్తుండటంతో అవి ఇతరులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇక ఇటీవల కొంతమంది ఒకరిపై ఒకరు గాజు సీసాలతోనే దాడులు చేసుకోవడంతో TTD అప్రమత్తమైంది. బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ సీసాలు, ప్యాకెట్లను వాడటంపై దృష్టి సారించింది. త్వరలోనే ఈ విషయంలో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును CBI <<15854658>>క్లోజ్<<>> చేయడం సంచలనంగా మారింది. అతడి మృతికి ప్రేయసి రియా చక్రబర్తే కారణమంటూ మొదటి నుంచీ ఆరోపణలున్నాయి. కానీ ఆమెకు క్లీన్‌చిట్ వచ్చింది. దీంతో సుశాంత్‌కు న్యాయం జరగలేదంటూ అతడి అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఈ కేసుతో నాలుగేళ్లు నరకం అనుభవించిన రియాకు న్యాయం జరిగిందని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆమె పేరు SMలో ట్రెండ్ అవుతోంది.

SLBC టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని నెల దాటింది. అయినా ఇప్పటివరకు ఒకరి మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడంలేదు. దీంతో సహాయక చర్యలపై NDRF, SDRF, ఆర్మీ తదితర విభాగాలతో TG CM రేవంత్ రెడ్డి రేపు సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది.
Sorry, no posts matched your criteria.