news

News March 9, 2025

అడుగంటిన నీరు.. ఎండుతున్న పైరు

image

వేసవి ఇంకా ముదరకముందే TGలో పంటలు ఎండుతున్నాయి. గతేడాది కృష్ణా, గోదావరిలో సమృద్ధిగా నీరు ఉండటం, ప్రాజెక్టులు సైతం కళకళలాడటం, భూగర్భజలాలు పెరగడంతో అన్నదాతలు వరిసాగు గణనీయంగా పెంచారు. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ పరిస్థితి దిగజారింది. ప్రాజెక్టుల్లో నీళ్లు ఖాళీ అయ్యాయి. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి బోర్లు అడుగంటాయి. దీంతో నీరందక పైర్లు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

News March 9, 2025

APలో మరో 2 ఎయిర్‌పోర్టులు?

image

AP: అమరావతి, శ్రీకాకుళంలో 2 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటి ప్రీ-ఫీజిబిలిటీని పరిశీలించేందుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానించింది. శ్రీకాకుళం నగరానికి 70కి.మీ దూరంలో సముద్ర తీరానికి సమీపంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రతిపాదిస్తోంది. అటు రాజధానిలో ఎక్కడ నిర్మించాలనేది కన్సల్టెన్సీ సంస్థే సూచించాలని ప్రభుత్వం పేర్కొంది.

News March 9, 2025

చిరంజీవి, పవన్ వద్ద అప్పు తీసుకున్న నాగబాబు

image

AP: కూటమి MLC అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగబాబు అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలు తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్/బాండ్లు రూ.55.37Cr, బ్యాంకులో నిల్వ రూ.23.53L, చేతిలో నగదు రూ.21.81L, ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.1.08Cr, బెంజ్ కారు, 950 గ్రా. బంగారం, 55 క్యారెట్ల వజ్రాలు, 20 KGల వెండి ఉంది. మొత్తం రూ.59Cr చరాస్తులు, రూ.11Cr స్థిరాస్తులు ఉన్నాయి. చిరంజీవి వద్ద రూ.28L, పవన్ వద్ద రూ.6L అప్పు తీసుకున్నారు.

News March 9, 2025

నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు

image

AP: ఇవాళ రాత్రి 7 గంటలకు శ్రీవారి వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనుండగా పుష్కరిణిలో భక్తులకు స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తెప్పోత్సవాల కారణంగా ఈ నెల 13 వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను అధికారులు రద్దు చేశారు.

News March 9, 2025

గ్రాడ్యుయేట్ MLC ఓటమిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్

image

TG: KNR-ADB-NZB-MDK గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు ఓటమికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. ‘రాష్ట్రంలో అధికారంలో ఉండి, ఉద్యోగాల భర్తీ, యువత సంక్షేమానికి కృషి చేస్తున్నా ఓడిపోవడం సరికాదు. దీని వల్ల పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఓటమిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వండి’ అని ఆదేశించినట్లు సమాచారం.

News March 9, 2025

‘ఛాంపియన్’గా నిలిచేదెవరో?

image

వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు CT ఫైనల్లో ఇవాళ న్యూజిలాండ్‌తో తలపడనుంది. మ.2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేయర్లంతా ఫామ్‌లో ఉండటం, ఒకే వేదికలో ఆడటం INDకు కలిసొచ్చే అంశాలు. ICC ఈవెంట్లలో భారత్‌పై కివీస్‌దే పైచేయి కావడం కలవరపెడుతోంది. కాగా ఇవాళ హిట్‌మ్యాన్ సేన విజయ పరంపరను కొనసాగించి కప్పు గెలవాలని కోరుకుందాం. మ్యాచ్ లైవ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో చూడొచ్చు.

News March 9, 2025

న్యాయం కోసం ప్రధానిని కలుస్తాం: హత్యాచార బాధితురాలి తల్లి

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్‌కి జనవరి 20న సెషన్ కోర్టు జీవితఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు వెనుక ఇంకా చాలామంది ఉన్నారంటూ మొదటి నుంచీ ఆరోపిస్తూ వస్తున్న బాధితురాలి తల్లి నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో మహిళలకు భద్రతే లేకుండా పోయిందన్నారు. తమ కూతురికి న్యాయం కోసం PM మోదీని కలుస్తామని చెప్పారు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలని కోరారు.

News March 9, 2025

లోక్ అదాలత్ ఎఫెక్ట్.. ఒక్క రోజులో 49,056 కేసుల పరిష్కారం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్‌లలో 49,056 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం బాధితులకు రూ.32.60 కోట్ల పరిహారం అందజేశారు. అన్ని న్యాయస్థానాల్లో 343 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించగా ఇరు వర్గాల ఆమోదంతో రాజీకి ఆస్కారం ఉన్న కేసులను పరిష్కరించారు.

News March 9, 2025

RRRకు త్వరలో ప్రధాని మోదీ భూమిపూజ: కిషన్ రెడ్డి

image

TG: రీజినల్ రింగ్ రోడ్డు(RRR)కు త్వరలో PM మోదీ భూమి పూజ చేస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు భూసేకరణకు నిధులు లేవన్నా తానే నితిన్ గడ్కరీని ఒప్పించినట్లు చెప్పారు. కొద్దిరోజుల్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందుతుందని తెలిపారు. RRRకు తమ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉండగా కేవలం రూ.100కోట్లే ఇచ్చి కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించారు.

News March 9, 2025

గ్రూప్-1 ఫలితాలు.. UPDATE

image

రేపు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనున్న సంగతి తెలిసిందే. ముందుగా మార్కులను ప్రకటించనుండగా తర్వాత రీకౌంటింగ్ కోసం అభ్యంతరాలు స్వీకరించనుంది. అనంతరం మెరిట్ మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తితో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకు గాను 21,093 మంది మెయిన్స్ పరీక్ష రాశారు.