India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్‌ను TGPSC ప్రకటించింది. ఈ నెల 10న గ్రూప్-1 ప్రొవిజినల్ మార్కులు విడుదల చేస్తామని పేర్కొంది. 11న గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా ఇస్తామని తెలిపింది. 14న గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా రిలీజ్ చేస్తామని వెల్లడించింది. 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలు ప్రకటిస్తామని చెప్పింది. 19న ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ తుది ఫలితాలు రిలీజ్ చేస్తామంది.

నటి ప్రియాంక చోప్రా వెస్ట్ ముంబై అంధేరిలో ఉన్న తన ఆస్తులను అమ్మేశారు. ఒబెరాయ్ స్కై గార్డెన్స్‌లో ఆమెకు విలాసవంతమైన 4 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని రూ.16.17కోట్లకు విక్రయించారు. గతంలోనూ ఆమె ముంబైలోని 2 ఫ్లాట్లను అమ్మేశారు. ప్రస్తుతం ప్రియాంక భర్త నిక్‌జోనస్, కుమార్తె మేరీ చోప్రాతో కలిసి లాస్ ఏంజెలిస్‌లో ఉంటున్నారు. అందువల్లే ఆమె ముంబైలో ఉన్న ఆస్తులను ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నట్లు సమాచారం.

AP: వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలపై CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ ముసుగులో రాష్ట్రంలో కరుడుగట్టిన నేరస్థులున్నారు. స్వలబ్ధి కోసం రాజకీయాలను జగన్ నేరపూరితంగా మార్చేశారు. ప్రజలను ఏమార్చేందుకు ఆయన చేస్తున్న అరాచకాన్ని తిప్పికొట్టాలి. వివేకా హత్య సమయంలో ముందు గుండెపోటు.. తర్వాత గొడ్డలి వేటు.. ఆపై నాపై ఆరోపణలు చేశారు. చెల్లినే నిందితురాలిగా చూపించే ప్రయత్నం చేశారు’ అని CM అన్నారు.

గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో కొన్ని టెస్టుల ద్వారా ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చని డా.సుధీర్ కుమార్ చెబుతున్నారు. ముఖ్యంగా సిగరెట్ అలవాటు, నిద్ర వ్యవధి, ఒత్తిడి, సీటింగ్ టైమ్, వ్యాయామం, ఫుడ్ గురించి తెలుసుకోవాలి. BP, ఇన్సులిన్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1C, లిపిడ్ ప్రొఫైల్, సీరం హోమోసిస్టీన్, HsCRPతో పాటు ECG, ఎకోకార్డియోగ్రామ్, CT కరోనరీ యాంజియోగ్రామ్ టెస్టులు చేయించాలంటున్నారు.

WGL మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను మాజీ CM KCR పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. దానికి ఇంకో 265 ఎకరాలు అవసరమైతే తాము అధికారంలోకి వచ్చాక రూ.205 కోట్లను CM విడుదల చేశారని చెప్పారు. 3 నెలల్లోనే ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభం అవుతాయన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు విషయంలోనూ BRS నిర్లక్ష్యం చేసిందని, PM మోదీ 2018లో RRRను ప్రకటించినా KCR దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.

బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన కుమారుడు మరికొందరికి పునర్జన్మనిస్తారని తెలుసుకున్న అతని కుటుంబం అవయవదానానికి ముందుకొచ్చింది. HYDలో ఇంజినీరింగ్ చదువుతున్న సాయి సుబ్రహ్మణ్యం బైక్ స్కిడ్ అయి బ్రెయిన్ డెడ్‌తో చనిపోయాడు. వైద్యుల సూచనతో సాయి తల్లిదండ్రులు అతని అవయవాలతో ఐదుగురికి పునర్జన్మనిచ్చారు. అతని 2 కిడ్నీలు, లివర్, హార్ట్, ఒక లంగ్స్‌ను అందించారు. అపోహలు మాని ఆపదలో ఉన్నవారిని అవయవదానంతో బతికించండి.

AP: రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెం శ్రీవారి ఆలయం వైభవం తెలియజేసేందుకు ఈ నెల 15న శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు TTD EO శ్యామలరావు తెలిపారు. దీనికి CM చంద్రబాబు ముఖ్య అతిథిగా వస్తారని చెప్పారు. 25 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. శ్రీనివాస కళ్యాణం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని EO వెల్లడించారు. వెంకటపాలెంలో శ్రీవారి ఆలయ నిర్మాణం 2022లో పూర్తైంది.

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నరసరావుపేట కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన్ను రేపు, ఎల్లుండి విచారించనున్నారు. CM, Dy.CMపై అనుచిత వ్యాఖ్యలు చేశారని TDP నాయకుడు కిరణ్ ఫిర్యాదుతో నరసరావుపేట 2టౌన్ PSలో కేసు నమోదైంది. ఈ మేరకు ఆయన్ను ఈ నెల 3న రాజంపేట జైలు నుంచి నరసరావుపేట తీసుకురాగా మేజిస్ట్రేట్ 10 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://bse.telangana.gov.inలోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం జిల్లా, స్కూల్, విద్యార్థి పేరుతో పాటు పుట్టినతేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇక్కడ <
*ALL THE BEST STUDENTS

మాస్ మహారాజా రవితేజ హీరోగా కిశోర్ తిరుమల తెరకెక్కించనున్న రొమాంటిక్ కామెడీ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న మమితా బైజు, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు వెల్లడించాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాయి. BVS రవి స్టోరీ అందించిన ఈ చిత్రాన్ని SLV సినిమాస్ నిర్మించనుంది.
Sorry, no posts matched your criteria.