India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

– వాక్‌కు <<15631947>>ముందు <<>>వార్మప్ చేయకుంటే అంతర్గత గాయాలు/ కండరాలు పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి
– మొబైల్ వాడుతూ నడిస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది
– పరగడుపున నడక వద్దు. తేలికపాటి ఆహారం లేదా పాల వంటి డ్రింక్స్ తీసుకుని బయల్దేరండి
– భోజనం తర్వాత 30ని.లోపు వాకింగ్ చేయకండి
– ఫుట్‌వేర్‌తో పాదాలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి. సరైన ఫుట్‌వేర్‌తోనే వాకింగ్ స్పీడ్, నేలపై గ్రిప్, గాయాల నుంచి తప్పించుకోవచ్చు

AP: కృష్ణా జిల్లా నాగాయలంక(మ) గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు ప్రధాని మోదీ రానున్నారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం DRDO రూ.15-20వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా, శంకుస్థాపనకు తానే వస్తానని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది.

దేశంలో రిటైల్ మార్కెట్ వృద్ధి వేగంగా కొనసాగుతోందని BCG నివేదిక వెల్లడించింది. పదేళ్లుగా ఏటా 8.9% వృద్ధి రేటు సాధించినట్లు తెలిపింది. 2024లో ₹82 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ 2034 నాటికి ₹190 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. వినియోగదారుల అవసరాలు, అభిరుచులు, ఆర్థిక స్థోమత ఆధారంగా కంపెనీలు మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవాలని సూచించింది. పట్టణ, గ్రామీణ వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకోవాలంది.

TG: SLBC సొరంగంలో సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ టీమ్స్ తటపటాయిస్తున్నాయి. శిథిలాలను తీస్తే టన్నెల్ ఏ క్షణాన కూలుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరీ లోపలికి అడుగు పెడుతున్నారు. చివరకు తాము సహాయక చర్యలు చేపట్టలేమని ఉన్నతాధికారులకు వారు తెలిపినట్లు సమాచారం. ఇదే విషయాన్ని CM రేవంత్‌కు తెలిపారు. దీంతో రోబోలను వినియోగించాలని సీఎం ఆదేశించారు.

ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్ ట్రావిస్ హెడ్ తన ప్రత్యర్థి భారత్ అయితే చాలు చెలరేగిపోతారు. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ టీమ్ ఇండియాపై తన రికార్డును కొనసాగించారు. కీలక సమయాల్లో సెంచరీలతో విజృంభించి భారత విజయాలను ఆయన అడ్డుకుంటున్నారు. ఈ నెల 4న ఆసీస్‌తో భారత్ సెమీస్ ఆడాల్సి ఉంది. ఇందులోనూ హెడ్ అడ్డుగోడలా నిలుస్తారేమోనని భారత్ ప్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

APలో 5, TGలో 5 MLC స్థానాలకు(MLA కోటా) నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ దాఖలు చేయొచ్చు. 11న పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది. మార్చి 20న ఉ.9 నుంచి సా.4 వరకు అసెంబ్లీలో పోలింగ్, అదే రోజు సా.5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా APలో ఖాళీలకు TDP నుంచి జవహర్, వంగవీటి రాధా, SVSN వర్మ, JSP నుంచి నాగబాబు, BJP నుంచి మాధవ్ రేసులో ఉన్నట్లు సమాచారం.

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 7న సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను ఈ నెల 5లోగా పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున కీలక పథకాలు, ప్రాజెక్టుల అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

TG: MLC ఎన్నికలు జరిగిన ఉమ్మడి మెదక్, కరీంనగర్, ADB, నిజామాబాద్, NLG, WGL, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ కౌంటింగ్ జరగనుంది. దీంతో ఆయా జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. పలుచోట్ల సెలవు ఇవ్వలేదని విద్యార్థులు, పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అటు ఏపీలో అవసరమైతేనే సెలవు ఇవ్వాలని EC ఆదేశించింది. దీంతో కౌంటింగ్ జరిగే చోటే సెలవు ఉండే ఛాన్సుంది.

AP: శ్రీవారి భక్తులపై చిరుతల దాడులను అరికట్టేందుకు TTD కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫారెస్ట్‌లోని చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులకు యానిమల్ రేడియో కాలర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. వీటి ద్వారా ఆ జంతువుల కదలికలను గుర్తించవచ్చు. అవి జన సమీపానికి వస్తే వెంటనే అప్రమత్తమై దూరంగా తరమవచ్చు. వాటిని ట్రాప్ చేసి పట్టుకుని సిమ్‌తో కూడిన రేడియో కాలర్ సిస్టమ్‌ను అమర్చుతారు.

AP: రాజధాని అమరావతిలోని ఐదు ఐకానిక్ టవర్ల పనులపై ప్రభుత్వం దృష్టిసారించింది. వీటి పునాదుల్లో నిలిచిన నీటిని గత నెలలో తోడించగా ర్యాఫ్ట్ ఫౌండేషన్ పరిశీలనకు ఈ వారంలో మద్రాస్ ఐఐటీ నిపుణులు రానున్నారు. కాంక్రీట్, రాడ్ల నమూనాలను పరీక్షించనున్నారు. కాగా గతంలో వీటి నిర్మాణానికి రూ.2,703 కోట్లతో టెండర్లు పిలవగా ఇప్పుడు వ్యయం 70 శాతం పెరిగినట్లు అంచనా. ఈ మేరకు CRDA మళ్లీ టెండర్లు ఆహ్వానించనుంది.
Sorry, no posts matched your criteria.