India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెదిరింపులకు భయపడమని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన వల్లే మెట్రో, మూసీ ప్రాజెక్టులు ఆగిపోయాయని పునరుద్ఘాటించారు. మోదీ ప్రభుత్వం ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలని నిలదీశారు. అధికారం కోల్పోతారనే కులగణనకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావట్లేదన్నారు.

TG: BJP, NDA పాలిత రాష్ట్రాల్లో బీసీ ఉప కులాల జాబితాలో ముస్లిం మైనార్టీలు ఉన్నారని CM రేవంత్ వెల్లడించారు. ‘APలో NDA ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? అక్కడ బీసీ మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా కిషన్ రెడ్డి? భావోద్వేగాలను రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారా? APలో SC వర్గీకరణ ఎందుకు చేయడం లేదు? మాదిగలకు ద్రోహం చేయడం లేదా?’ అని CM ప్రశ్నించారు.

APలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఇది చాలా విప్లవాత్మకమైన నిర్ణయమని చెప్పారు. దీని ద్వారా స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. టీచర్లు, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గిస్తుందని అంచనా వేశారు. బడ్జెట్‌లో పాఠశాల విద్యకు ₹31,805 కోట్లు, ఉన్నత విద్యకు ₹3506 కోట్లు కేటాయించామని, దీని ద్వారా విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని లోకేశ్ వెల్లడించారు.

TG: SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెస్క్యూ సిబ్బంది గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం మొత్తం స్కానింగ్ చేశారు. ఐదు చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు. చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులు అక్కడే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేపట్టారు. కాగా ఆ ఎనిమిది మంది చనిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

AP: సెల్‌ఫోన్ల రికవరీలో అనంతపురం జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో రికవరీ చేసిన 1183 ఫోన్లను బాధితులకు అప్పగించారు. 2022 నుంచి మొత్తం 11,378 మొబైల్స్ రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.21.08 కోట్లు ఉంటుందని వెల్లడించారు. మొబైల్ చోరీకి గురైనా/పోయినా <<10494424>>CEIR పోర్టల్‌లో<<>> రిజిస్టర్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

TG: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. మార్చి 9న ఆయన ప్రధానితో సహా పలు పార్టీ నేతలను కలవనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలపాలని కోరనున్నట్లు సమాచారం. అంతకుముందు మార్చి 6న రాష్ట్ర కేబినెట్ భేటీ అయి ఈ బిల్లుకు ఆమోదం తెలపనుంది. మరోవైపు మార్చి 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.

అమెరికాకు చెందిన citi బ్యాంక్ ఓ ఘోర తప్పిదం చేసింది. ఓ కస్టమర్ అకౌంట్‌లో 280 డాలర్లకు బదులుగా పొరపాటున $81 ట్రిలియన్లను జమ చేసింది. దీన్ని ఇద్దరు సిబ్బంది గుర్తించలేకపోయారు. మరో ఉద్యోగి దాదాపు 90 నిమిషాల తర్వాత పసిగట్టి తప్పును సరిదిద్దారు. ఇంత భారీ మొత్తంలో పేమెంట్ ప్రాసెస్ పూర్తికాలేదని, అయినా వెంటనే దోషాన్ని గుర్తించామని కంపెనీ తెలిపింది.

AP: రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు, హడ్కో రుణాలు ఇస్తున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, దీనికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని చెప్పారు. ఇప్పటికే రూ.48వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, మార్చి 10న ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. మేలో తల్లికి వందనం, ఆ తర్వాత అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.

TG: ప్రభుత్వ నిర్ణయాల్లో పీసీసీ కార్యవర్గ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని స్పష్టం చేశారు. సమర్థులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పదవులు పొందిన వారు కష్టపడితే రెన్యువల్ చేస్తామని లేకపోతే కొత్తవారికి అవకాశం ఇస్తామని తెలిపారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా అటల్ 85, అజ్మతుల్లా 67, ఇబ్రహీం 22, హష్మతుల్లా 20, రషీద్ 19 రన్స్ చేశారు. బెన్ 3, స్పెన్సర్, జంపా చెరో రెండు, ఎల్లిస్, మ్యాక్సీ చెరో వికెట్ పడగొట్టారు. విజయం కోసం కంగారూలు 274 రన్స్ చేయాల్సి ఉంది. ఈ వన్డేలో గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌కు వెళ్తుంది.
Sorry, no posts matched your criteria.