India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ చలనచిత్ర అవార్డుల రద్దుకు నిర్దిష్ట నిబంధనలు లేకపోయినా అడ్మినిస్ట్రేటివ్ లా కింద రద్దు చేసే అధికారం అవార్డుల కమిటీకి ఉంటుంది. ఏ గుర్తింపుకైతే సదరు వ్యక్తికి అవార్డు ప్రకటించారో దానికి సంబంధించి కాపీ రైట్స్, క్రెడిట్స్ అవకతవకలు, ప్రలోభాలకు పాల్పడడం, నేరాభియోగాలపై అవార్డు రద్దు చేస్తారు. ఈ గ్రౌండ్స్‌పైనే జానీ మాస్టర్‌కు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేశారు.
AP: సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద బాధితులకు ప్రభుత్వం రేపు డబ్బులు అందించనుంది. మొత్తం 21,768 మంది ఖాతాల్లో రూ.18.69 కోట్లను జమచేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందరికీ సాయం అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం గత నెలలో రూ.602 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. బ్యాంకు ఖాతాల్లో తప్పులు, ఆధార్ లింక్ కాకపోవడం వల్ల కొందరికి డబ్బులు జమకాలేదు.
బెంగళూరు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. కానీ, అక్కడున్న 1.4 కోట్ల మంది ప్రజలకు కనీస మౌలిక సదుపాయమైన టాయిలెట్లను ఏర్పాటు చేయలేకపోయింది. నగరంలో 803 పబ్లిక్ టాయిలెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు RV యూనివర్సిటీ నివేదికలో వెల్లడైంది. ఈ లెక్కన ప్రతి 1.7లక్షల మందికి ఓ టాయిలెట్ ఉందన్న మాట. వీటిలోనూ సగం వాటిల్లో లైట్స్ లేవని తేలింది. కాగా HYDలోనూ టాయిలెట్స్ పెంచాలని నెటిజన్లు కోరుతున్నారు.
TG: గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేసిన యువత ఓసారి ఆలోచించాలని హరీశ్‌రావు కోరారు. ‘పింఛన్ పెంచలేదు. పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసాకు దిక్కులేదు. బోనస్‌ను బోగస్ చేశారు. ఉద్యోగాల ఊసులేదు. రూ.4వేల భృతికి నీళ్లు వదిలారు. ఈ దసరాకు సొంతూళ్లకు వస్తున్న వారితో INC మోసాలపై చర్చించండి. ఆ పార్టీ నాయకులను నిలదీయండి’ అని Xలో పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీకి ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తే తాను బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని, లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్యం నడుస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. కాగా ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల లోపు కరెంట్ ఫ్రీగా ఇస్తోంది.
AP: వైసీపీ హయాంలో చాలా టూరిజం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో పనులు నిలిచిపోయాయని మంత్రి కందుల దుర్గేశ్ విమర్శించారు. పర్యాటక రంగం పూర్తిగా నిర్వీర్యమైందని, భారీగా ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. విశాఖలో యాత్రి నివాస్ నిర్మాణాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తీరంలో MV MAA Shipను త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
ఫారిన్ ఇన్వెస్టర్లు చివరి 3 సెషన్లలోనే రూ.27,142 కోట్లను వెనక్కి తీసుకున్నారు. వెస్ట్ ఏషియాలో వార్, క్రూడాయిల్ ధరలు, చైనా మార్కెట్లు పుంజుకోవడమే ఇందుకు కారణాలు. స్టిమ్యులస్ ప్యాకేజీ, మానిటరీ పాలసీతో చైనా మార్కెట్లు గత నెల్లో 26% ఎగిశాయి. అక్కడి షేర్ల విలువ తక్కువగా ఉండటంతో FPIలు డబ్బును అక్కడికి మళ్లిస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. CY24 SEP నాటికి వీరి పెట్టుబడులు రూ.57,724 కోట్లకు చేరాయి.
ఒక మెంబర్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం వల్లే సార్క్ ప్రోగ్రెస్ ఆగిపోయిందని EAM జైశంకర్ అన్నారు. ఈ నెల్లోనే SCO మీటింగ్ కోసం పాక్ వెళ్తుండటంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘టెర్రరిజాన్ని సహించేది లేదు. మాలో ఒకరు మరొకరిపై అలా చేస్తే దాన్ని ఆపాల్సిందే. అందుకే సార్క్ మీటింగ్స్ జరగడం లేదు. అయితే గత ఐదారేళ్లలో బంగ్లా, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంకతో భారత్ బంధం మెరుగైంది’ అని వివరించారు.
‘శివ’ సినిమా విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హీరో అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్‌కు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘నా లైఫ్‌కి బ్రేక్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ అచంచలమైన మద్దతు, నాపై సంపూర్ణ విశ్వాసం లేకపోతే శివతో పాటు నేనూ ఉండేవాడినికాదు’ అని ట్వీట్ చేశారు. వర్మ తన కెరీర్‌ను ‘శివ’తో మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నారాయణపేట, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.