India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని ఎవరూ వేలెత్తి చూపించకుండా అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఒకటో తేదీన ప్రారంభించి 16న మూసేయడం తమకు ఇష్టం లేదన్నారు. కాస్త లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తామని డైలాగ్ వేశారు. పథకం అమలయ్యేనాటికి సమస్యలను అధిగమించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. త్వరలో 1400 బస్సులను అందుబాటులోకి తెస్తామని, ఆ తర్వాత మరో 2000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు.
ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC)లో 723 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి నేటితో గడువు ముగియనుంది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ పాసైనవారు అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.18వేలు-రూ.92,300 మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
అస్సాంలోని కాచార్ జిల్లాలో ₹20 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఆపరేషన్ చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సిల్కూరి రహదారిపై మోటర్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి వద్ద ఈ సబ్‌స్టాన్సెస్ పట్టుబడ్డాయి. నిందితుడు సాహిల్ నుంచి 60 వేల యాబా టాబ్లెట్లు, 125 గ్రాముల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాబా అనేది మెథాంఫెటమైన్, కెఫీన్ ఉత్ప్రేరకం.
సీఎం రేవంత్ సినీ పరిశ్రమపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేసేలా రేవంత్ వ్యాఖ్యానించారు. ముగిసిన సమస్యపై అసెంబ్లీలో MIM సభ్యుడితో ప్రశ్న అడిగించారు. సినిమా తరహా కథ అల్లి మళ్లీ సమస్య సృష్టించారు. ఇది ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర. రేవంత్ కక్ష సాధింపు చర్యలు వీడాలి’ అని సూచించారు.
తాను ప్రిపేర్ కాలేదని పరీక్షల్నే వాయిదా వేయించాలన్న ఉద్దేశంతో ఓ విద్యార్థి ఏకంగా పాఠశాలకే బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు. ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ పాఠశాలకు చెందిన విద్యార్థి Dec 14న ఈ చర్యకు పాల్పడ్డాడు. పోలీసులు IP ఆడ్రస్‌ను ట్రేస్ చేసి అతని ఇంటికి వెళ్లారు. ఆ విద్యార్థి విషయాన్ని అంగీకరించడంతో కౌన్సిలింగ్ ఇచ్చారు. అతని ప్రవర్తనపై నిఘా ఉంచాల్సిందిగా తల్లిదండ్రులను ఆదేశించారు.
భారత్, చైనా పౌరులకు వీసా రహిత ఎంట్రీ గడువును మలేషియా 2026, డిసెంబరు 21 వరకూ పొడిగించింది. పర్యాటకానికి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ దాటుక్ అవాంగ్ అలీక్ జెమాన్ ప్రకటించారు. భారత్‌తో పాటు చైనా పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీని గత ఏడాది డిసెంబరు 1న మలేషియా అనౌన్స్ చేసింది. దీని ప్రకారం వీసా లేకుండా నెలరోజుల పాటు ఈ దేశాల పౌరులు మలేషియాలో పర్యటించవచ్చు.
13 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని IPL వేలంలో రాజస్థాన్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేయడం వెనుక కారణాన్ని ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఆస్ట్రేలియా-భారత్ అండర్-19 టెస్టు మ్యాచ్‌ను మా మేనేజ్‌మెంట్ ప్రత్యక్షంగా చూసింది. చాలా తక్కువ బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇలాంటి ఆటగాడు కచ్చితంగా మాకు ఉండాలని భావించాం. జైస్వాల్, పరాగ్, జురెల్ వంటి ఆటగాళ్లనూ ఇలాగే గుర్తించాం’ అని తెలిపారు.
TG: ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ కామెంట్స్ సీఎంను అగౌరవపరిచే విధంగా ఉన్నాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పర్మిషన్ లేకుండా ఆయన థియేటర్‌కు వచ్చారని, తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య గ్యాప్ లేదని మంత్రి స్పష్టం చేశారు.
AP: మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టిన కేసులో విచారణకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల్లోగా హాజరు కావాలని సూచించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆయన ఇంటి తలుపులకు నోటీసులు అంటించినట్లు సమాచారం.
ఆఫ్రికా దేశం కాంగోలోని బుసిరా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 38 మంది మరణించారు. 100 మందికి పైగా గల్లంతయ్యారు. సుమారు 400 మంది ఫెర్రీలో క్రిస్మస్ వేడుకల కోసం స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Sorry, no posts matched your criteria.