India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వాట్సాప్‌లో త్వరలో ‘వాయిస్ చాట్ మోడ్ ఫర్ మెటా ఏఐ’ ఫీచర్ రానుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు మెటా AIతో వాయిస్ చాట్ చేయవచ్చు. ఇది 10 డిఫరెంట్ వాయిస్‌లు కలిగి ఉంటుంది. వాటిలో యూజర్లు దేనిని సెలక్ట్ చేసుకుంటే ఆ వాయిస్‌లోనే మెటా ఏఐ రిప్లై ఇస్తుంది. ఈ వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ రూపంలోకి కన్వర్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని వాబీటా ఇన్ఫో తెలిపింది.
బంగ్లాదేశ్‌లో నిరసన పేరుతో విధ్వంస నర్తనం జరుగుతోందని షేక్ హసీనా అన్నారు. అల్లరి మూకల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. 1975, ఆగస్టు 15న హత్యకు గురైన ఆమె తండ్రి, బంగ్లా జాతిపిత ముజీబుర్ రెహ్మాన్ సహా కుటుంబీకులకు నివాళి అర్పించారు. తన కొడుకు ట్విటర్ ద్వారా బంగ్లా పౌరులకు సందేశం పంపారు. అల్లర్లలో తనలాగే ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. వారికి న్యాయం చేయాలన్నారు.
కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచారం ఘటనలో న్యాయం కోసం అక్కడి డాక్టర్లు నిరనస బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో NRS వైద్య కళాశాలలోని వార్డుల్లో వైద్య సిబ్బంది కరవయ్యారు. రోగులు ఇబ్బంది పడుతుండటంతో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి మిలన్ చక్రవర్తి రంగంలోకి దిగారు. ఓ విభాగాధిపతి అయ్యుండి, ఇంటెర్న్స్ లేదా రెసిడెంట్ వైద్యులు చేసే పనుల్ని తానే చక్కబెడుతున్నారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
AP: అన్నమయ్య(D) తంబళ్లపల్లెలో మైనర్ బాలిక మృతి కలకలం రేపుతోంది. బంధువుల అబ్బాయిని ప్రేమించిన ఆమె అతడితో వెళ్లిపోయింది. మైనార్టీ తీరిన తర్వాత తామే పెళ్లి చేస్తామంటూ కుటుంబీకులు ఇంటికి తీసుకొచ్చారు. ఈక్రమంలోనే బాలిక అడవిలో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించింది. మృతదేహాన్ని కుటుంబీకులు గుట్టుగా కాల్చివేశారు. దీంతో పరువు హత్య జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డులపై వైసీపీ రంగులు, YSR, YS జగన్ ఫొటోలు ముద్రించి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రేషన్ కార్డుల రంగులు మారనున్నాయి. వీటికి సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
నవంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీనివాసుడి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు ఈనెల 24న ఉ.10 గంటలకు విడుదల కానున్నాయి. అదేరోజు మ.3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్స్ అందుబాటులోకి వస్తాయి. ఇక నవంబర్‌లో నిర్వహించే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ఈనెల 19 ఉ.10 గంటల నుంచి 21 ఉ.10 గంటల వరకు జరగనుంది.
వెబ్‌సైట్: <
TG: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేసేందుకు ప్రభుత్వం ఓ లాగిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్లికేషన్ సమయంలో సమర్పించని డాక్యుమెంట్లను ఇందులో అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఇందుకోసం <
ITBPలో 819 కానిస్టేబుల్(కిచెన్ సర్వీసెస్) ఉద్యోగాల భర్తీకి ప్రకటన(షార్ట్ నోటిఫికేషన్) విడుదలైంది. టెన్త్‌తో పాటు ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్‌కు సంబంధించిన కోర్సు చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చు. 18 నుంచి 25 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్, SC, STలకు ఫీజు లేదు.
TG: CM రేవంత్ రెడ్డి ఈనెల 17న ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యేల చేరికలపై ఆయన పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. శ్రావణమాసంలో పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రేవంత్‌కు సూచించారు. దీంతో ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చరిత్రను గుర్తుపెట్టుకున్న దేశమే భవిష్యత్తును నిర్మించుకొని శక్తిమంతంగా ఎదుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆగస్టు 14, దేశ విభజన గాయాల స్మృతి దినం నేపథ్యంలో ట్వీట్ చేశారు. ‘మన చరిత్రలోనే దారుణమైన రోజు ఇది. దేశ విభజనతో ప్రాణాలు, ఇళ్లు, ఆస్తులు, ఆప్తులను కోల్పోయిన లక్షల మందికి ఇదే నా నివాళి. మోదీ నాయకత్వంలో జాతి నిర్మాణం కోసమే ఈ స్మృతి దినాన్ని నిర్వహిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.