news

News December 20, 2024

అసెంబ్లీకి చేరుకున్న CM రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. ధరణిలో అక్రమాలు జరిగాయని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై విచారణకు ఆదేశించే యోచనలో ఉంది. ఆ ప్రత్యేక విచారణపై సీఎం సభలో ప్రకటించే అవకాశం ఉంది. అటు, మాజీ మంత్రి హరీశ్ రావు ఎంఐఎం ఎమ్మెల్యేలను కలిశారు. ఫార్ములా ఈ-కార్ రేసుపై చర్చకు వచ్చేలా సహకరించాలని ఆయన కోరారు.

News December 20, 2024

మాజీ CM కన్నుమూత

image

హరియాణా మాజీ సీఎం, INLD అధినేత ఓంప్రకాశ్ చౌతాలా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 89. కార్డియాక్ అరెస్టుతో గురుగ్రామ్‌లోని తన ఇంట్లోనే మరణించారని తెలిసింది. అసౌకర్యంగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే చనిపోయారని వైద్యులు తెలిపినట్టు సమాచారం. ఐదుసార్లు సీఎం, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ కుమారుడైన ఓంప్రకాశ్ ఆ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు.

News December 20, 2024

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.330 తగ్గి రూ.76,800కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి రూ.70,400గా ఉంది. అటు వెండి ధర కేజీపై రూ.1000 తగ్గి రూ.98,000గా ఉంది.

News December 20, 2024

కరెంటు దొంగిలించడమేంటి ప్రజాప్రతినిధీ?

image

కొందరు ప్రజాప్రతినిధుల తీరుతో ప్రజలు విస్మయం చెందుతున్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి, కమీషన్లు బహిరంగ రహస్యమే అయినా కరెంటు బిల్లులకూ కక్కుర్తి పడటమేంటని ప్రశ్నిస్తున్నారు. సంభల్ ఎంపీ <<14929852>>జియా<<>> ఉర్ ఇంట్లో మీటర్లను ట్యాంపర్ చేయడాన్ని విమర్శిస్తున్నారు. లక్షల్లో జీతాలు వస్తున్నా రూ.2 కోట్ల మేర కరెంటు దొంగిలించి ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని అడుగుతున్నారు. వనరులను సొంత జాగీరుగా భావించడంపై మీ కామెంట్.

News December 20, 2024

‘బచ్చలమల్లి’ మూవీ REVIEW & RATING

image

మూర్ఖత్వం మనిషి జీవితానికి ఎంత నష్టం చేస్తుందనేదే కథ. తన పాత్రలో నరేశ్ జీవించాడు. గమ్యం సినిమాలా ఆయన క్యారెక్టర్ గుర్తిండిపోతుంది. హీరో మేనరిజం, యాక్టింగ్, ఫైట్లు, లవ్ స్టోరీ, హీరోయిన్, రావు రమేశ్ పాత్ర సినిమాకు ప్లస్ పాయింట్లు. ఎమోషన్ సీన్లు హత్తుకుంటాయి. సీరియస్ మూవీ కావడంతో నరేశ్ తరహా కామెడీ సీన్లు ఉండవు. ల్యాగ్ సీన్లు, కొన్ని సందర్భాల్లో హీరో పాత్ర విలన్ తరహాలో ఉండటం మైనస్.
RATING: 2.50/5

News December 20, 2024

అరపైసా అవినీతి జరగలేదు: KTR

image

TG: మంత్రిగా ఫార్ములా ఈ-రేస్ విషయంలో విధాన నిర్ణయం తీసుకున్నానని KTR అన్నారు. ‘డబ్బులు పంపిన విధానం తప్పు అని పొన్నం అంటున్నారు. ఈ కేసులో ACBకి కేసు పెట్టే అర్హత లేదు. అరపైసా అవినీతి జరగలేదు. ప్రభుత్వం తప్పులను హరీశ్ బయటపెట్టినందుకు సిట్ వేశారు. ORR టెండర్లు, కోకాపేట భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. నన్ను ఏ కేసులో జైలుకు పంపాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు’ అని అన్నారు.

News December 20, 2024

ALERT.. నోటిఫికేషన్ విడుదల

image

TG: గిరిజన, బీసీ, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యాసంవత్సరం 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు రేపటి నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు <>ఆన్‌లైన్‌లో <<>>దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.100 ఫీజు చెల్లించాలి. ఒక ఫోన్ నంబర్‌తో ఒక దరఖాస్తు చేయాలి. పాత జిల్లా యూనిట్‌గా ఎంపిక చేస్తారు. FEB 23వ తేదీన ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు 040-23391598, 9491063511 నంబర్లను సంప్రదించండి.

News December 20, 2024

మహేశ్‌బాబు ‘ముఫాసా’ విడుదల

image

‘లయన్ కింగ్’కు ప్రీక్వెల్‌గా వస్తోన్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ థియేటర్లలో రిలీజైంది. ముఫాసాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ అందించడంతో థియేటర్ల వద్ద ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. స్క్రీన్‌పై బాబు కనిపించకపోయినా సింహంలో ఆయన్ను చూసుకుంటూ వాయిస్ ఎంజాయ్ చేస్తున్నారు. పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్‌ పాత్రకు అలీ అందించిన డబ్బింగ్‌ నవ్వు తెప్పించిందని అంటున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ!

News December 20, 2024

గంటలో తిరుమల శ్రీవారి దర్శనం: BR నాయుడు

image

AP: తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. AI టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వారం రోజులు పరిశీలించి దర్శనం కల్పిస్తామన్నారు. ఇందుకోసం భక్తుల ఆధార్, ఫొటో తీసుకుని దర్శనం సమయం సూచించే టోకెన్ ఇస్తారు. ఆ సమయానికి వచ్చే భక్తులను దర్శనం కోసం నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి పంపుతారు. సక్సెస్ అయితే 45 కౌంటర్లలో టోకెన్లు ఇవ్వనున్నారు.

News December 20, 2024

నాపై కేసు నిలవదు: KTR

image

TG: ఫార్ములా E-కార్ రేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి సమాచార లోపం ఉందని కేటీఆర్ అన్నారు. ఆయన్ను ఎవరో తప్పు దోవ పట్టిస్తున్నారని చెప్పారు. తనపై కేసు నిలవదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము లీగల్‌గా ముందుకెళ్తున్నట్లు ఆయన వివరించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. మంత్రి పొన్నం అవినీతి జరగలేదంటున్నారని, అలాంటప్పుడు ఏసీబీ కేసు ఎందుకని ఆయన ప్రశ్నించారు.