India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత పారా షట్లర్ ప్రమోద్ భగత్‌పై 18 నెలల నిషేధం పడింది. డోపింగ్ ఉల్లంఘనకు పాల్పడినందుకు రాబోయే పారిస్ పారాలింపిక్స్‌కు దూరమయ్యారు. కాగా ఈ నిషేధం భారత మెడల్స్ ఆశలపై ప్రభావం చూపించనుంది.
రష్యా, చైనా, ఉత్తర కొరియా దేశాధినేతలపై US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆ ముగ్గురూ అత్యుత్తమ దశలో ఉన్నారని, వారిని అడ్డుకునేందుకు అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలని మస్క్‌తో జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘పుతిన్, జిన్‌పింగ్, కిమ్ ముగ్గురూ తెలివైనవాళ్లే. ప్రమాదకారులు కూడా. తమ దేశాన్ని రక్షించుకోవాలని చూస్తారు. కమలను, నిద్రముఖం బైడెన్‌ను చూసి నవ్వుకుంటారేమో’ అని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. RSS నేతలు సురేశ్ సోని, దీననాథ్, అతుల్ కొఠారి, దేవేంద్రరావ్ తదితరులు రాసిన 88 పుస్తకాలను అన్ని కాలేజీలూ కొని, పాఠ్యాంశాల్లో చేర్చాలని ఉత్తర్వులిచ్చింది. ఇది రాజకీయ దుమారాన్ని రేపుతోంది. బీజేపీ విభజన భావజాలాన్ని ప్రోత్సహిస్తోందని విపక్ష పార్టీలు మండిపడగా, గత ప్రభుత్వాలు దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రజలపై రుద్దాయని కమలం పార్టీ ఆరోపించింది.
AP: జాబ్ క్యాలెండర్ విధానంలో ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిపుణుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలో ప్రభుత్వానికి అందజేయనుంది. ‘ఏటా MAR 1 నుంచి APR 30లోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలను సిద్ధం చేయాలి. జులై 31లోగా సంబంధిత కార్యదర్శులు ఆమోదం తెలపాలి. SEP1 నుంచి OCT 15లోగా నోటిఫికేషన్లు జారీ చేయాలి. మంజూరైన ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదు’ అని పేర్కొంది.
AP: ₹2 కోట్ల విలువైన రామలక్ష్మణ నాణేన్ని ₹3 లక్షలకు ఇస్తామంటూ ఓ వ్యక్తిని నిర్బంధించిన ఘటన విజయవాడలో జరిగింది. కడపకు చెందిన రాజేంద్రకు 2నెలల కిందట నరసింహ పరిచయమయ్యాడు. తన దగ్గర మహిమలున్న నాణెం ఉందని రాజేంద్రను నమ్మించి విజయవాడకు రప్పించాడు. గదిలో బంధించి ₹30 లక్షలు ఇవ్వాలని అతని భార్యకు ఫోన్ చేసి నరసింహ బెదిరించాడు. ఆమె అన్న ఫిర్యాదుతో పోలీసులు అతడిని కాపాడి, నిందితులను అరెస్టు చేశారు.
విదేశాలకు రూ.6L మించి పంపిన లావాదేవీలపై CBDT నిఘా పెంచింది. 2016 నుంచి దాఖలైన ఫామ్ 15CCలను క్షణ్ణంగా పరిశీలించి, పన్ను ఎగవేతలను గుర్తించి నోటీసులు పంపాలని అధికారుల్ని ఆదేశించింది. రూ.5L వార్షిక ఆదాయాన్ని డిక్లేర్ చేసిన కొందరు గత మూడేళ్లలో ముగ్గురు ఏజెంట్ల ద్వారా రూ.15L పంపడాన్ని గమనించినట్టు తెలిపింది. విద్య, వైద్యం మినహా రూ.7 లక్షలకు మించి విదేశాలకు పంపిస్తే కేంద్రం 20% TCS వసూలు చేస్తోంది.
పారిస్ ఒలింపిక్స్‌లో పతకం ఖాయమనుకున్న బ్యాడ్మింటన్‌లో క్రీడాకారులు నిరాశపరిచారు. ఒలింపిక్స్ సన్నాహాల కోసం కేంద్రం ఈ క్రీడకు రూ.72 కోట్లు ఖర్చుచేసింది. అయితే ఒక్క పతకమూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సింగిల్స్‌లో ప్రణయ్, లక్ష్యసేన్, సింధు, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప-తనీషా భారత ఆశలను నెరవేర్చలేకపోయారు. కాగా సైనా 2012లో కాంస్యం, సింధు 2016లో రజతం, 2020లో కాంస్యం సాధించారు.
బంగ్లాదేశ్‌లో అలర్లకు, తాను అధికారం కోల్పోవడానికి అమెరికాయే కారణమని బంగ్లా మాజీ పీఎం హసీనా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల్ని అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ పియరీ ఖండించారు. ‘ఇది బంగ్లాదేశ్ ప్రజలు ఎంచుకున్న ఛాయిస్. వారి భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం వారికి ఉందని మేం నమ్ముతున్నాం. అదే మా అభిప్రాయం. ఇది తప్ప ఇంకేం ఆరోపణలొచ్చినా అవన్నీ అవాస్తవం’ అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనిషి సగటు జీవితకాలం 73ఏళ్లు(INDలో 70ఏళ్లు). 2021లో సెంచూరియన్స్ సంఖ్య 5,73,000. జీవన శైలి మార్పుతో మనమూ ‘వందేళ్ల’ మైలురాయిని చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘ఆహారంలో 57-65% కార్బోహైడ్రేట్లు, మితంగా ఉప్పు, ప్రొటీన్, కొవ్వు, ఎక్కువ కూరగాయలు, చేపలు తీసుకోవాలి. ఔషధాల వాడకాన్ని తగ్గించాలి. నాణ్యమైన నిద్ర ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించాలి’ అని సూచించారు.
TG: ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ధరణిలో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు ఓ రైతు నుంచి వాళ్లు రూ. 8 లక్షలు డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.