news

News August 13, 2024

MLA దానం నాగేందర్‌పై కేసు నమోదు

image

TG: ప్రభుత్వ స్థలం వ్యవహారంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సహా మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.69 నందగిరిహిల్స్‌లో GHMC స్థల ప్రహరీని కొందరు కూల్చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. కూల్చివేతతో MLAకు సంబంధం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రహరీ కూల్చివేత వల్ల రూ.10లక్షల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News August 13, 2024

మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

image

AP: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉదయమే NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది సిబ్బంది ఫైళ్లను పరిశీలిస్తున్నారు. సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో ఆయన కుటుంబీకులపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

News August 13, 2024

మార్స్‌పై నీటి ఆనవాళ్లను గుర్తించిన నాసా

image

మార్స్ గ్రహంపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మార్స్ ఉపరితలం కింద 11.5 కి.మీ నుంచి 20 కి.మీ లోతున నీరు ఉన్నట్లు గుర్తించారు. రోబోటిక్ ఇన్‌సైట్ ల్యాండర్ ద్వారా నాసా ఈ ప్రయోగం చేపట్టింది. ఆ నీటిని తోడడం సవాల్‌తో కూడుకున్నదని పేర్కొన్నారు. దీనిని బట్టి ఆ గ్రహంపై నీరు ప్రవహించినట్లు అంచనా వేస్తున్నారు. గతంలో అక్కడ జీవనానికి అనుకూలంగా ఉన్నట్లు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

News August 13, 2024

Left Handers: ఐన్‌స్టీన్ నుంచి అమితాబ్ వరకు..

image

నేడు ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం. జనాభాలో 10 నుంచి 12శాతం మంది ఎడమ చేతి వాటం వారు ఉంటారని అంచనా. వీరిలో ఎందరో ప్రముఖులు ఉన్నారు. మహాత్మాగాంధీ, రాణీ లక్ష్మీబాయి, ప్రధాని మోదీ, ఐన్‌స్టీన్, చార్లెస్ డార్విన్, న్యూటన్, ఒబామా, రతన్ టాటా, సచిన్, రవిశాస్త్రి, గంగూలీ, యువరాజ్, రైనా, అమితాబ్, సావిత్రి, సూర్యకాంతం.. వీరందరిదీ ఎడమచేతి వాటమే. మీకు తెలిసిన ప్రముఖ లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరో కామెంట్ చేయండి.

News August 13, 2024

బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు

image

AP: బాలింతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్సులు, సాధారణ అంబులెన్సుల మధ్య అనుసంధానం పెంచాలన్నారు. డోలీతో గర్భిణులు, బాలింతలను మోసుకొస్తున్న దృశ్యాలు కనిపించకూడదని స్పష్టం చేశారు. కాగా బేబీ కిట్‌లో చిన్న పరుపు, శానిటైజర్, సోప్, పౌడర్‌, దోమతెర, న్యాప్‌కిన్లు ఉంటాయి.

News August 13, 2024

భరతనాట్యంలో చైనా బాలిక అరంగేట్రం

image

భారతదేశ సంస్కృతిలో భాగమైన భరతనాట్యం విదేశాలకు విస్తరిస్తోంది. చైనాకు చెందిన బాలిక లీ ముజి(13) భరతనాట్యంలో అరంగేట్రం చేశారు. చైనాలోనే శిక్షణ పొంది, అక్కడే అరంగేట్రం చేసిన తొలి యువతిగా చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ భరతనాట్య కళాకారిణి లీలా శాంసన్ హాజరయ్యారు. 1999లో ఢిల్లీలో అరంగేట్రం చేసిన జిన్ షాన్ ఆ చిన్నారికి గురువుగా వ్యవహరించారు. ఈమె చైనాలో భరతనాట్యం స్కూల్ నడుపుతున్నారు.

News August 13, 2024

ఉత్కంఠ.. నేడే తీర్పు

image

భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు దక్కాల్సిన పతకంపై నేడు కాస్ (కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్) తీర్పు వెలువరించనుంది. తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తుందా? వ్యతిరేకంగా వస్తుందా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన వినేశ్‌ 100 గ్రా. బరువు అదనంగా ఉందని అనర్హత వేటు వేశారు. అయితే తనకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని ఆమె కాస్‌ను ఆశ్రయించారు.

News August 13, 2024

US వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్

image

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారి కోసం దేశంలో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి 26 వరకు ఈ ఫెయిర్ కొనసాగుతుంది. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, పుణే, ముంబైలో వీటిని ఏర్పాటు చేస్తారు. 80కిపైగా వర్సిటీలు, కాలేజీల ప్రతినిధులు ఈ ఫెయిర్‌లో అందుబాటులో ఉంటారు. ప్రవేశం ఉచితం కాగా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి.

News August 13, 2024

ఆంధ్ర వర్సిటీల ర్యాంకులు మరింత పతనం

image

NIRF (నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్) ప్రకటించిన ర్యాంకుల్లో రాష్ట్రంలోని యూనివర్సిటీల ర్యాంకులు పతనమయ్యాయి. యూనివర్సిటీ కేటగిరిలో 2019లో AU 16వ స్థానంలో ఉండగా ఇప్పుడు 25వ స్థానానికి పడిపోయింది. SVU 48వ స్థానంలో ఉండగా 87వ స్థానానికి పడిపోయింది. ANU (59) మాత్రం టాప్100లోకి దూసుకొచ్చింది. ఓవరాల్ కేటగిరీలో ఏయూ గతేడాది 76లో ఉండగా ఇప్పుడు 41, ఏఎన్‌యూ 97వ ర్యాంకులోకి వచ్చింది.

News August 13, 2024

1912కు కాల్ చేస్తే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్

image

AP: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1912 నంబర్‌కు కాల్ చేస్తే కనెక్షన్‌ను మంజూరు చేసే పద్ధతిని తీసుకొచ్చింది. తొలుత APEPDCL పరిధిలో శ్రీకారం చుట్టింది. త్వరలో రాష్ట్రమంతా అమలు చేయనుంది. ఆ నంబర్‌కు కాల్ చేసి భూమి ఖాతా సంఖ్య, సర్వే నంబర్ చెబితే వెబ్‌ల్యాండ్‌లో వివరాలను సరిచూసి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు.