India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజైన డిసెంబర్ 21న సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైసీపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ఎమ్మెల్యేలు, పార్టీ కో-ఆర్డినేటర్లు సమన్వయం చేసుకుంటూ జగన్ పుట్టినరోజు వేడుకలను అందరూ ఘనంగా నిర్వహించాలని నిర్దేశించింది.
తొక్కిసలాట ఘటనలో అరెస్టై బెయిల్‌పై వచ్చిన అల్లు అర్జున్ సంతోషంగా ఉండాలని కోరుతూ హీరో మంచు మనోజ్ పోస్ట్ చేశారు. ‘దిష్టి మొత్తం పోయింది బాబాయ్. క్లిష్ట పరిస్థితుల్లో మీరు ప్రవర్తించిన తీరు ప్రశంసనీయం. సరైన సమయంలో బాధిత కుటుంబానికి మద్దతివ్వడం మీ క్యారెక్టర్‌కు నిదర్శనం. సంధ్య థియేటర్ విషాద ఘటన హృదయవిదారకం. ఈ ఘటన భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తుచేస్తుంది’ అని పేర్కొన్నారు.
పేదల కోసం తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని PM మోదీ తెలిపారు. ‘దేశంలో ఎక్కడ ఉన్నా పేదలు సులువుగా రేషన్ తీసుకునేందుకు వన్ నేషన్ వన్ కార్డ్, ఉచిత చికిత్స కోసం ఆయుష్మాన్ కార్డు తీసుకొచ్చాం. దేశాన్ని డిజిటల్ ఇండియాగా మారుస్తున్నాం. రాజ్యాంగ శక్తి, ప్రజల ఆశీర్వాదం మాకున్నాయి. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధినే కోరుకుంటున్నారు. మా పరిపాలన చూసి ప్రజలు మాకు మూడు సార్లు అధికారం ఇచ్చారు’ అని పేర్కొన్నారు.
TG: హైదరాబాద్‌లోని సినీ నటుడు బాలకృష్ణ, మాజీ మంత్రి జానారెడ్డి నివాసాలకు GHMC అధికారులు మార్కింగ్ వేయడం చర్చనీయాంశంగా మారింది. KBR పార్కు చుట్టూ అండర్ పాస్‌లు, బ్రిడ్జిలు నిర్మించేందుకు సేకరించే ఆస్తులలో ఈ ఇళ్లు కూడా ఉన్నాయి. దీంతో టెండర్లు పూర్తవ్వగానే రోడ్డు విస్తరణ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు తమ ఇళ్లకు మార్కింగ్ చేయడంపై జానారెడ్డితో పాటు బాలయ్య అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో వచ్చేనెల 10 నుంచి 19 వరకు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ‘సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తాం. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తాం. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ వంటి విశేష దర్శనాలు రద్దు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు’ అని తెలిపారు.
రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ అనేక విధాలుగా ప్రయత్నించిందని PM మోదీ పార్లమెంటు ప్రసంగంలో మండిపడ్డారు. ‘రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు నాటి ప్రధాని నెహ్రూ అనేకసార్లు ప్రయత్నించారు. రాజ్యాంగ మార్పుపై రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. తప్పు చేస్తున్నారంటూ బాబూ రాజేంద్రప్రసాద్ ఆయన్ను హెచ్చరించారు. ఎంతోమంది పెద్దలు సైతం సలహా ఇచ్చినా నెహ్రూ పెడచెవిన పెట్టారు’ అని పేర్కొన్నారు.
భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్‌ను వదిలేయాలని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సూచించారు. ‘ఏ లైన్ అండ్ లెంగ్త్ వేయాలో బుమ్రాకు స్పష్టంగా తెలుసు. కానీ టెస్టు క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లు సుదీర్ఘ సమయం పాటు తీవ్ర వేగంతో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. తన బౌలింగ్ యాక్షన్ కారణంగా బుమ్రా గాయాలపాలవడానికి ఆస్కారం ఎక్కువ. అతడు టెస్టు క్రికెట్‌ను వదిలి పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుకోవడం మంచిది’ అని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డామని PM మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘బానిస మనస్తత్వం ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు. ఐక్యతను దెబ్బతీసేందుకు విషబీజాలను నాటారు. సుప్రీంకోర్టు అధికారాలు తగ్గించేందుకు నాటి PM ఇందిర ప్రయత్నించారు. ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కుల్ని హరించారు. వేలాదిమందిని జైళ్లకు తరలించారు. కోర్టులు, పత్రికల గొంతు నొక్కారు’ అని పేర్కొన్నారు.
‘పుష్ప-2’కు కొనసాగింపుగా ‘పుష్ప-3’ రానున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ కీలక పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో రష్మిక స్పందించారు. తనకు ఆ విషయమై ఎలాంటి సమాచారం లేదని స్పష్టతనిచ్చారు. తాను కూడా ఆ ప్రచారాన్ని చూసినట్లు పేర్కొన్నారు. అయితే సస్పెన్స్ ఇవ్వడం సుకుమార్‌కు చాలా ఇష్టమన్నారు.
దేశానికి కాంగ్రెస్ పార్టీ అనేక నష్టాలు కలిగించిందంటూ పార్లమెంటు ప్రసంగంలో ప్రధాని మోదీ విమర్శించారు. ‘రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ యత్నించింది. రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకు ప్రయత్నించింది. 55 ఏళ్ల పాటు దేశాన్ని ఒకే కుటుంబం పాలించింది. 1947 నుంచి 1952 వరకూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరగలేదు’ అని గుర్తుచేశారు.
Sorry, no posts matched your criteria.