news

News August 7, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 7, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: ఆగస్టు 7, బుధవారం
✒ తదియ: రాత్రి 10.06 గంటలకు
✒ పుబ్బ: రాత్రి 8.30 గంటలకు
✒ వర్జ్యం: తెల్లవారుజాము 4.37 గంటలకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 11.47 గంటల నుంచి 12.38 గంటల వరకు

News August 7, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* ఒలింపిక్స్: ఫైనల్ చేరిన నీరజ్, వినేశ్ ఫొగట్
* యూట్యూబ్ సీఈవోతో సీఎం చంద్రబాబు వర్చువల్ సమావేశం
* వైసీపీ కార్యకర్తలపై చంద్రబాబు దాడులు ఆపాలి: జగన్
* అమెరికా పర్యటనలో పలు కంపెనీలతో సీఎం రేవంత్ ఒప్పందం
* ఆరోగ్య బీమాపై జీఎస్టీ ఎత్తేయండి: రాహుల్
* భారత్‌లోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
* LTCG ట్యాక్స్‌లో కేంద్రం మార్పులు

News August 7, 2024

అందరూ బౌలింగ్ చేస్తున్నారు సరే.. మరి బ్యాటింగ్?

image

కోచ్‌‌గా గంభీర్ హయాంలో భారత జట్టులో కొన్ని మార్పులు వచ్చాయి. ఆల్‌రౌండర్లతోనే కాక రోహిత్, గిల్, సూర్య, రింకూ వంటి బ్యాటర్లతోనూ బౌలింగ్ వేయిస్తున్నారు. ఇది బాగానే ఉంది. కానీ బలమైన బ్యాటింగ్‌కు మారుపేరైన భారత్ శ్రీలంకతో తొలి రెండు వన్డేల్లో 231, 241 రన్స్ ఛేదించలేక ఓడింది. రోహిత్ మినహా ఎవరూ రాణించట్లేదు. అందుకే బౌలర్లూ మినిమం బ్యాటింగ్ చేసేలా చూస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరేమంటారు?

News August 7, 2024

ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే అంతా ఆరోగ్యమే!

image

ప్రస్తుత కలుషిత వాతావరణంలో ఆరోగ్యంగా జీవించాలంటే శుద్ధమైన ఆక్సిజన్ అవసరం. ఓ మొక్క ఇంట్లో ఉంటే శుద్ధి చేసిన ఆక్సిజన్ పొందొచ్చు. బెంజీన్, ఫార్మల్డిహైడ్, ట్రైక్లోరోఇథైలీన్, జిలీన్, టోల్యూన్ వంటి విషపూరిత సమ్మేళనాలను తొలగించగల సామర్థ్యం సాన్సెవిరియా (స్నేక్ ప్లాంట్)కు ఉందని NASA తెలిపింది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌ మొక్క రోజంతా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి రాత్రిపూట CO2ను గ్రహిస్తుంది. బెస్ట్ ఇండోర్ ప్లాంట్.

News August 6, 2024

సెప్టెంబర్‌లో నందమూరి ఫ్యాన్స్‌కు పండగే!

image

వచ్చే నెలలో నందమూరి అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కానున్నారు. సెప్టెంబర్ 1న నందమూరి బాలకృష్ణ జూబ్లీ వేడుకలు, 6న నందమూరి మోక్షజ్ఞ తేజ బర్త్ డే వేడుకలు, అలాగే 27న ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ విడుదల కానుంది. దీంతో నందమూరి ఫ్యామిలీ నుంచి మూడు స్పెషల్ ఈవెంట్స్ ఉండటంతో సందడి నెలకొననుంది. ఆ నెల కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

News August 6, 2024

నీరజ్ కంటే ముందే వినేశ్ గోల్డ్ కొట్టేనా?

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ 3 బ్రాంజ్ మెడల్స్ మాత్రమే గెలిచింది. మన అథ్లెట్లు వరుసగా నిరాశపరుస్తుండటంతో అందరి ఆశలు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే పెట్టుకున్నారు. నమ్మకాన్ని నిలబెడుతూ నీరజ్ ఫెనల్స్ చేరారు. ఆగస్టు 8న ఫైనల్‌లో గోల్డ్ కోసం బరిలో నిలిచారు. కాగా ఔటాఫ్ సెలబస్ నుంచి వచ్చినట్లుగా భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ మూడు మ్యాచులు గెలిచి ఫైనల్ చేరారు. రేపే ఆమె ఫైనల్ మ్యాచ్.

News August 6, 2024

ఆ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు: నిర్మలా సీతారామన్

image

జన్‌ధన్, పొదుపు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె ప్రసంగించారు. మరోవైపు గత ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచని అకౌంట్ల నుంచి రూ.8,500 కోట్ల ఫైన్ వసూలు చేసినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో తెలిపారు. ఇందులో 2023-24 ఏడాదిలోనే రూ.2,331 కోట్ల జరిమానా వసూలు చేశామన్నారు.

News August 6, 2024

మాయదారి వైరస్.. మళ్లీ విజృంభణ

image

ప్రమాదకర జికా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. పుణేలో గత రెండు నెలల్లోనే ఏకంగా 66 కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు మరణించారని అధికారులు తెలిపారు. అయితే ప్రతి మరణం వెనక వేర్వేరు కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. వైరస్ సోకిన 26 మంది గర్భిణులూ ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. జికా వైరస్ వల్ల గర్భస్థ శిశువు మెదడు ఎదగదు. తల పరిమాణం చిన్నగా ఉంటుంది. వర్షాకాలంలో దోమలు పెరగకుండా జాగ్రత్తపడాలని వైద్యుల సూచన.

News August 6, 2024

APలో మరిన్ని ఎయిర్‌పోర్టులు: చంద్రబాబు

image

APలో నెల్లూరు(D) దగదర్తి, చిత్తూరు(D) కుప్పం, పల్నాడు(D) నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు/ఎయిర్‌స్ట్రిప్‌ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు CM చంద్రబాబు సూచించారు. భూసేకరణ కూడా పూర్తైన ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. తాడిపత్రి, తునిలోనూ ఎయిర్‌పోర్టులు నిర్మించే అంశాన్ని పరిశీలించాలని CM కోరారు. కర్నూలు ఎయిర్‌పోర్టులో ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ వంటివి తీసుకురావాలన్నారు.