India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
9వ పెళ్లి రోజు సందర్భంగా భారత క్రికెటర్ రోహిత్ శర్మకు ఆయన భార్య రితికా సజ్దే శుభాకాంక్షలు తెలిపారు. రోహిత్ ప్రస్తుతం BGT కోసం ఆస్ట్రేలియాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రితిక ఇన్‌స్టాలో తన భర్తపై ప్రేమను వ్యక్తీకరించారు. ‘బెస్ట్ డాడ్, బెస్ట్ హస్బండ్, బెస్ట్ ఫ్రెండ్. ఇంతకు మించి నాకు బెస్ట్ దొరకరు’ అని క్యాప్షన్ ఇచ్చారు. 2015, డిసెంబరు 13న ఈ జంటకు వివాహం కాగా ఓ పాప, బాబు వారికి జన్మించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంపై నటుడు బ్రహ్మాజీ మండిపడ్డారు. ‘దేశంలో చాలా చోట్ల తొక్కిసలాటలు జరుగుతుంటాయి. ఎవరినైనా అరెస్ట్ చేశారా? అలా చేస్తే సగం మంది రాజకీయనేతలు లోపల ఉండాలి’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరలవుతోంది. అయితే, చట్ట ప్రకారం ఇదంతా జరుగుతుండటంతో సినీ ఇండస్ట్రీ సభ్యులు సైతం రియాక్ట్ అయ్యేందుకు ఆలోచిస్తున్నారు.
TG: అల్లు అర్జున్ అరెస్టుపై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆయనకు రిమాండ్ విధించాలని పోలీసుల తరఫు లాయర్ వాదిస్తున్నారు. బన్నీ రావడంతోనే తొక్కిసలాట ఘటన జరిగిందని, అందుకే అరెస్ట్ చేసినట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు. కాగా తనపై కేసులు కొట్టేయాలని బన్నీ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. దీనిపై ఉన్నత న్యాయస్థాన నిర్ణయం కోసం నాంపల్లి జడ్జి వేచి చూస్తున్నట్లు సమాచారం.
దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతం మిడ్ సెషన్లో అనూహ్యంగా పుంజుకున్నాయి. ఉదయం వెయ్యికి పైగా పాయింట్ల నష్టంతో కదిలిన సెన్సెక్స్ చివరికి 843 పాయింట్ల లాభంతో 82,133 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 219 పాయింట్లు బలపడి 24,768 వద్ద నిలిచింది. అధిక వెయిటేజీ రంగాలైన ఐటీ, ఫైనాన్స్, బ్యాంకు, ఆటో, ప్రైవేట్ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది.
TG: అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. తనపై నమోదైన కేసులను కొట్టేయాలని ఆయన తరఫు లాయర్లు కోర్టును కోరారు. దీంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
అల్లు అర్జున్‌కు రాజకీయ పార్టీల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. బన్నీ అరెస్టును BRS, YCP, BJP నేతలు ఖండించారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకొని తెలుగు ప్రజలకు గౌరవాన్ని తెచ్చిన బన్నీ అరెస్టు అన్యాయమని రాజాసింగ్ అన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ పార్టీలు బన్నీకి మద్దతుగా నిలవడం ద్వారా ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంటున్నట్టు కనిపిస్తోంది.
అల్లు అర్జున్‌కు నటి పూనమ్ కౌర్ మద్దతుగా నిలిచారు. ‘బహిరంగ ర్యాలీలు నిర్వహించిన వారెంతమంది ఉన్నారన్నది చూడటానికి ట్రై చేస్తున్నా. అలాంటి ర్యాలీలు, సభల్లో ఎంతోమంది అమాయకులు మండే ఎండ కింద, తొక్కిసలాటల్లోనూ చనిపోయారు’ అని గుర్తుచేసుకున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట నేపథ్యంలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడాన్ని ఆమె ఖండించారు. వంశాన్ని చూసుకుని కాక సొంతంగా స్టార్ అయిన హీరో అంటూ ట్వీట్ చేశారు.
కాకతాళీయమో, దురదృష్టమో కానీ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్ద కుటుంబాలు గత కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఎన్ కన్వెన్షన్ విషయంతో పాటు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో అక్కినేని నాగార్జున కుటుంబం న్యాయపరంగా ముందుకెళ్తోంది. ఇక మంచు కుటుంబం సైతం అంతర్గత తగాదా, జర్నలిస్టుపై దాడి ఘటనల్లో చిక్కుకోగా తాజాగా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ సైతం అరెస్టయ్యారు.
వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజును తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించారు. అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలవడంతో ఆయనకు రూ.5 కోట్లతో ప్రభుత్వం సత్కరిస్తుందని స్టాలిన్ ట్వీట్ చేశారు. ‘మీ విశేషమైన విజయం భారతదేశ చెస్ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. దీంతో చెన్నై ప్రపంచ చెస్ క్యాపిటల్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తమిళనాడు మిమ్మల్ని చూసి గర్విస్తోంది’ అని పేర్కొన్నారు.
జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమాను ప్రదర్శించింది ఎవరు? తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.